TG Police In Top (imagecredit:twitter)
తెలంగాణ

TG Police In Top: పాస్ పోర్ట్ వెరిఫికేషన్.. దేశంలోనే నెంబర్ వన్!

TG Police In Top: తెలంగాణ పోలీసులు(Telangana Police) మరో ఘనతను సాధించారు. పోలీసింగ్ లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన మన పోలీసులు తాజాగా పాస్​ పోర్టు వెరిఫికేషన్(Passport Verification) లో కూడా దేశం మొత్తం మీద నెంబర్ వన్​ స్థానాన్ని సాధించారు. ఈ క్రమంలో నేడు న్యూ ఢిల్లీ(Delhi)లో విదేశీ వ్యవహారాల శాక మంత్రి చేతుల మీదుగా ఇంటెలిజెన్స్​ డైరెక్టర్ జనరల్​ బీ.శివధర్ రెడ్డి(Shivdar Reddy) అవార్డు అందుకోనున్నారు.

నేర చరిత్ర ఉందా

నిత్యం వందలాది మంది పాస్​ పోర్టుల(Passport) కోసం దరఖాస్తులు చేసుకునే విషయం తెలిసిందే. ఇలా దరఖాస్తు చేసుకున్న వారికి ఏదైనా నేర చరిత్ర ఉందా? అన్న విషయాన్ని నిర్ధారించటానికి పోలీసులు(Police) వెరిఫికేషన్ జరిపేవారు. అయితే, మాన్యువల్ గా ఈ ప్రక్రియను జరపటం వల్ల ఆలస్యం అవటంతోపాటు పలు సమస్యలు ఉత్పన్నమయ్యేవి. వీటి పరిష్కారం కోసం తెలంగాణ పోలీసులు(TelanganaPolice) VeriFast యాప్​ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

Also Read: Bike Theft Arrested: చూస్తే మాయం కావాల్సిందే.. పాత నేరస్తుల అరెస్ట్

దేశంలోనే అత్యంత వేగంగా

దీని ద్వారా వెరిఫికేషన్ ప్రక్రియ వేగంగా, ఖచ్చితత్వంతో, పారదర్శకంగా పూర్తి చేసే అవకాశం కలిగింది. విదేశాంగ శాఖ తాజా గణాంకాల ప్రకారం తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యంత వేగంగా పాస్​ పోర్టు ధృవీకరణను పూర్తి చేస్తున్నారు. మూడు పని దినాల్లోనే ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఇలా యేటా 8లక్షలకు పైగా పాస్​ పోర్టు వెరిఫికేషన్ పూర్తి చేస్తున్నారు. అదే సమయంలో మోసపూరిత దరఖాస్తులను గుర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే అవార్డును సాధించారు. నేడు పాస్​ పోర్ట్​ దివస్(Passport Dhivass)​ సందర్భంగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి చేతుల మీదుగా ఇంటెలిజెన్స్​ డీజీ శివధర్​ రెడ్డి(Srideer Reddy) ఉత్తమ సేవా ధృవీకరణ పత్రాన్ని అందుకోనున్నారు.

Also Read: Health Awareness: మునగాకు వీళ్లు తింటే చాలా డేంజర్.. జరజాగ్రత్త

Just In

01

The Girlfriend: ‘ది గర్ల్ ఫ్రెండ్’ రిజల్ట్‌పై రష్మిక మందన్నా స్పందనిదే..

Naga Vamsi: నాగవంశీని 2025 భయపెట్టిందా? అందుకే ‘ఫంకీ’ని 2026కు వాయిదా వేశారా?

S Thaman: ‘చికిరి’తో థమన్ శాటిస్ ఫై అయ్యాడా?

Nagabandham: ‘నాగబంధం’‌లోని ‘ఓం వీర నాగ’ పాటకు కొరియోగ్రఫీ ఎవరంటే..

Akhanda 2: ‘తాండవం’ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. గూస్‌బంప్స్!