Team India
Viral, లేటెస్ట్ న్యూస్

Team India: 93 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. టీమిండియా సంచలన రికార్డు

Team India: లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానం వేదికగా ఆతిథ్య ఇంగ్లండ్, భారత జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా (Team India) చారిత్రాత్మక రికార్డు నమోదు చేసింది. తొలిసారి ఒక టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఐదు సెంచరీలు నమోదు చేసింది. పరుగుల వరద పారుతున్న ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 159 బంతుల్లో 101 పరుగులు, కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ 227 బంతులు ఎదుర్కొని 147 రన్స్, రిషబ్ పంత్ 178 బాల్స్ ఎదుర్కొని 134 పరుగులు సాధించారు. వీరి ముగ్గురి సహకారంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగుల భారీ స్కోరు అందుకుంది. ఇంగ్లండ్ బ్యాటర్లు కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో భారత్‌కు కేవలం 6 పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది.

ఇక, రెండవ ఇన్నింగ్స్‌లో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సెంచరీతో చెలరేగాడు. 247 బంతులు ఎదుర్కొని 137 రన్స్ సాధించాడు. రాహుల్‌తో కలిసి అద్భుత భాగస్వామ్యం నెలకొల్పిన స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌తో పాటు రెండవ ఇన్నింగ్స్‌లో కూడా శతకం సాధించారు. 140 బంతులు ఆడి 118 రన్స్ కొట్టాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన పంత్ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఒక టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించిన 7వ భారత బ్యాటర్‌గా ఈ లెఫ్ట్ హ్యాండర్ రికార్డు సాధించాడు. మొత్తంగా లీడ్స్ టెస్టు మ్యాచ్‌లో ఏకంగా ఐదు సెంచరీలు నమోదయ్యాయి.

Read this- Commercial Flat: గచ్చిబౌలిలో రికార్డ్ ధరలు.. రూ.65.02 కోట్ల మేర ఆదాయం!

టెస్ట్ క్రికెట్‌లో ఒక జట్టు ఐదు సెంచరీలు నమోదు చేయడం ఇది ఆరోసారి. అయితే, విదేశీ గడ్డపై ఈ ఘనత అందుకున్న రెండవ దేశం మాత్రం భారతేనని గణాంకాలు చెబుతున్నాయి. 1955లో కింగ్‌స్టన్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఏకంగా ఐదుగురు సెంచరీలు సాధించారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో కాలిన్ మెక్‌డొనాల్డ్ (127), నీల్ హార్వే (204), కీత్ మిల్లర్ (109), రాన్ ఆర్చర్ (128), రిచీ బెనాడ్ (121) శతకాలు బాదారు. దీంతో, ఫస్ట్ ఇన్నింగ్స్‌ను 758/8 స్కోర్‌కు ఆసీస్ డిక్లేర్ చేసింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తేడాతో వెస్టిండీస్‌పై జయకేతనం ఎగురవేసింది.

కాగా, భారత్-ఇంగ్లండ్ మధ్య లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో నాలుగవ రోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 21/0గా ఉంది. ఆట ఆఖరి రోజైన మంగళవారం 350 పరుగులు సాధిస్తే ఇంగ్లండ్ గెలుస్తుంది. ఒకవేళ భారత బౌలర్లు పుంచుకొని ఆతిథ్య జట్టు ఆటగాళ్ల పనిపడితే విజయం వరిస్తుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు ఎలా ఆడతారన్నది ఆసక్తికరంగా మారింది. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 364 పరుగులకు భారత్ ఆలౌట్ అయ్యింది. దీంతో, 371 పరుగుల విజయ లక్ష్యంతో ఇంగ్లండ్ బ్యాటింగ్ చేపట్టింది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి బెన్ డకెట్ 9 (బ్యాటింగ్), జాక్ క్రాలే 12 (బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.

Read this- Samantha: ఆ హీరోకి ‘లవ్ యు ఫర్ ఎవర్’ చెబుతూ చైతూకి బిగ్ షాక్ ఇచ్చిన సమంత.. పోస్ట్ వైరల్?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!