Bhu Bharati Act(Image credit: free pic or twitter)
తెలంగాణ

Bhu Bharati Act: ధరణి కష్టాలకు.. భూ భారతి చెక్ పెట్టేనా?

Bhu Bharati Act: తెలంగాణలో భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భూ భారతి’ చట్టం (Bhu Bharati Act) అమలులో భాగంగా, ఈ నెల 3 నుంచి 20 వరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. అయితే, వచ్చిన దరఖాస్తుల సంఖ్యను బట్టి ఆగస్టు 14న ప్రభుత్వం పెట్టుకున్న డెడ్‌లైన్ నాటికి అన్ని సమస్యల పరిష్కారం కొంత కష్ట సాధ్యమేనని అధికార వర్గాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 Also Read: Telangana Cabinet Meeting: సుదీర్ఘంగా క్యాబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలకు ఆమోదం!

భూ భారతి’పై కోటి ఆశలు..

గత ‘ధరణి’ పోర్టల్ తెచ్చిన సమస్యలతో ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. భూముల క్రయవిక్రయాలు నిలిచిపోవడం వల్ల ఎన్నో రైతు కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. ఈ నేపథ్యంలో, ధరణి చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఏప్రిల్ 14న ‘భూ భారతి’ చట్టాన్ని (Bhu Bharati Act) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) తీసుకొచ్చింది. మొదట పైలట్ ప్రాజెక్ట్‌గా జిల్లాకు ఒక మండలాన్ని ఎంపిక చేసి సదస్సులు నిర్వహించగా, ఆ తర్వాత అన్ని మండలాల్లోనూ భూ భారతిని (Bhu Bharati Act) అమలు చేయాలని సంకల్పించింది.

ఈ క్రమంలో ఈ నెల 3 నుంచి 20 వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లు నిత్యం క్షేత్రస్థాయిలో సదస్సుల్లో పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. ధరణితో విసిగివేసారిపోయిన ప్రజానీకం (Bhu Bharati Act) ‘భూ భారతి’పై కోటి ఆశలు పెట్టుకుని పెద్ద ఎత్తున దరఖాస్తులు అందజేశారు. ఉమ్మడి రంగారెడ్డి (Ranga Reddy District) జిల్లా వ్యాప్తంగా ఈ రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 35,858 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో (Ranga Reddy District) రంగారెడ్డి జిల్లాలో 21,200, వికారాబాద్ జిల్లాలో 11,801, మేడ్చల్ జిల్లాలో 2,857 దరఖాస్తులు నమోదయ్యాయి.

కొనసాగుతున్న ఆన్‌లైన్ ప్రక్రియ..
వచ్చిన దరఖాస్తులను వివిధ సమస్యల ఆధారంగా కేటగిరీల వారీగా విభజించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. మిస్సింగ్ సర్వే నంబర్లు, అపరిష్కృతంగా ఉన్న పట్టా మార్పిడి, పీవోబీ, ఓఆర్‌సీ, అసైన్డ్ భూములు, 38 ఈ-సర్టిఫికెట్, ల్యాండ్ స్వాధీనం, కోర్టు ఆదేశాలు, విస్తీర్ణం సవరణ వంటి దరఖాస్తులను వేరు చేసి ఈ నెలాఖరు వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆగస్టు 14 నాటికి వీటిని పరిష్కరించేలా అధికారులు కార్యాచరణను రూపొందించుకున్నారు.

సవాళ్లు, పరిష్కార మార్గాలు..
పెండింగ్ దరఖాస్తులు: ఇప్పటికే కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ల లాగిన్లలో వేల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, రెవెన్యూ సదస్సుల ద్వారా మళ్లీ వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. సాదాబైనామ సమస్యలు: 2014 జూన్ లోగా సాదాబైనామాల ద్వారా భూ విక్రయాలు జరిపిన (Farmers) రైతులకు ఇంకా చట్టబద్ధత కల్పించలేదు. వీటిపై న్యాయస్థానాల్లో స్టే ఉత్తర్వులు అమల్లో ఉండటంతో, ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేసే వరకు వీటి పరిష్కారం కష్టమే. పని ఒత్తిడి: కొన్ని సమస్యల పరిష్కారానికి (Farmers) రైతులకు నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. వివిధ పనుల ఒత్తిడిలో రెవెన్యూ యంత్రాంగానికి అన్ని ప్రక్రియలను పూర్తిచేసి గడువులోపు భూ సమస్యలకు పరిష్కారం చూపడం భారమే అవుతుంది.

అధికారులు సాధ్యమైనంత వరకు దరఖాస్తులను ప్రభుత్వ నిబంధనల మేరకు పరిష్కరించనున్నారు. ఒకవేళ పరిష్కారం కాకుంటే, సహేతుక కారణాలతో దరఖాస్తుదారుడికి తెలియజేసి, ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో సూచనలు అందిస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి. ధరణి చట్టం ప్రకారం మెజారిటీ భూ సమస్యల పరిష్కారం కలెక్టర్ లాగిన్‌లోనే ఉండగా, ‘భూ భారతి’ చట్టంతో చాలా వరకు అధికార వికేంద్రీకరణ జరిగిందని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో భూ సమస్యల పరిష్కారం గతంలో కంటే వేగవంతమయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.

 Also Read: Sand Scam: ఖమ్మం గుమ్మంలో సాండ్ స్కాం.. స్వేచ్ఛ ఎక్స్‌ప్లోజివ్ కథనం

Just In

01

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!