Durga Neelima
ఆంధ్రప్రదేశ్, క్రైమ్

Marriage: ఏంటిది భయ్యా.. మగాళ్లను బతకనివ్వరా?

Marriage: పెళ్లి.. అనే మాట ఎత్తితే చాలు ‘పెళ్లి కాని ప్రసాద్‌లు’ బెంబేలెత్తిపోతున్నారు. ఎందుకంటే.. ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనలు అలాంటివి మరి. ఈ దెబ్బతో వామ్మో.. పెళ్లా అంటూ యూత్ వణికిపోతున్న పరిస్థితి. పెళ్లయ్యాక ఒకరు భర్తను హనీమూన్ తీసుకెళ్లి మరీ చంపేయడం.. ఇంకోచోట పెళ్లైన నెలరోజులకే ప్రియుడితో కలిసి భర్తను చంపేయడం.. వీటికి తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య జరిగిన ఘటనలు చూసి వద్దు బాబోయ్ ఈ పెళ్లి.. పెళ్లాం అంటూ దండం పెట్టేస్తున్నారు. అవసరమైతే సింగిల్ బతికి.. చచ్చే రోజు అలాగే పోతామని చెబుతున్న పరిస్థితి. సరిగ్గా ఈ క్రమంలోనే అందరూ భర్తలను చంపేస్తున్నారు కదా అని సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తూ వార్తల్లో నిలిచింది ఓ యువతి. ఏపీలో జరిగిన ఈ ఘటనతో ‘దేవుడా.. ఏంటిది మగాళ్లను ప్రశాంతంగా బతకనివ్వరా’ అంటూ సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా కామెంట్స్ వచ్చిపడుతున్నాయ్. ఇంతకీ ఆంధ్రాలో ఏం జరిగింది..? ఏమిటా రికార్డ్..? అనే విషయాలు తెలుసుకుందాం..

Read Also- Tejaswi Madivada: నేనింకా ఉన్నాను.. వాడు ఏమైపోయాడో? కౌశల్‌‌ని ఇలా అనేసిందేంటి?

అసలేం జరిగింది..!
ఇదిగో ఈ ఫొటోలో ఎంతో అమాయకంగా, అందంగా కనిపిస్తున్న యువతి పేరు బేతి వీరదుర్గ నీలిమ (Veeradurga Neelima). అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఈమె.. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 12 మంది పురుషులను పెళ్లి పేరుతో మోసం చేసి లక్షల రూపాయలు, బంగారం, ఇతర విలువైన వస్తువులు కాజేసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులే నివ్వెరపోయారు. బయటికి చెప్పుకుంటే ఎక్కడ పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుందో అని ఈ నిత్య పెళ్లికూతురు (Serial Bride) వ్యవహారం ఎవరూ బయటపెట్టలేదు కానీ, చివరికి ధైర్యం చేసుకొని మరీ ఓ వ్యక్తి వెలుగులోకి తెచ్చాడు. దీంతో ఖిలేడి గుట్టు రట్టయింది. ముఖ్యంగా బాగా డబ్బులున్న.. విడాకులు తీసుకున్న పురుషులనే టార్గెట్‌గా చేసుకుని మోసం చేస్తూ వస్తోంది ఈ యువతి. ఇలా ఇప్పటి వరకూ ఈమె బుట్టలో 12మంది పురుషులు పడ్డారు. మాయమాటలు చెప్పి పెళ్లికి ఒప్పించి.. తీరా అయ్యాక డబ్బులు, బంగారం, విలువైన వస్తువులు తీసుకుని పరారయ్యేది. ఈమె వెనుక ఒక ముఠా కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మోసాలకు ఈమె కుటుంబ సభ్యులు కూడా సహకరించి ఉండవచ్చని తెలుస్తోంది. బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావుకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ మహిళను అరెస్టు చేసి, ఈ మోసాల వెనుక ఉన్న పూర్తి వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Konaseema Issue

ప్లాన్.. యాక్షన్ ఇలా!
విడాకులు తీసుకుని లేదా భార్యను కోల్పోయి డిప్రెషన్‌లో ఉన్న పురుషులను టార్గెట్ చేసేది. తిన్నగా నీలిమ తన వలలోకి లాక్కునేది. పెళ్లి చేసుకుంటానని నమ్మించేది. పెళ్లి చేసుకున్న తర్వాత కొద్దిరోజులు సజావుగా కాపురం చేసి, తర్వాత వివిధ కారణాలు చెప్పి డబ్బులు గుంజేది. బాధితులు ప్రశ్నిస్తే, వారిపై తప్పుడు కేసులు పెడతానని బెదిరింపులకు పాల్పడేది. డిప్రెషన్‌లో ఉన్న పురుషులను బలహీనతను ఆసరాగా చేసుకుని వారిని మరింతగా మోసం చేసేది. డబ్బులు తీసుకున్న తర్వాత లేదా తన పని పూర్తయ్యాక, ఇంట్లో విలువైన వస్తువులతో పాటు అదృశ్యమయ్యేది. ఆఖరికి వరకట్న వేధింపుల కేసులు ఎదుర్కొంటున్న పురుషులను కూడా ఈమె టార్గెట్ చేసేది. ఇలాంటి వారు త్వరగా లొంగిపోతారని, తిరిగి ఫిర్యాదు చేయడానికి వెనుకాడతారని యాక్షన్‌లోకి దిగిపోయేది. నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు బాధితులు ఈమె మోసాలను తట్టుకోలేక అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా ఈ ‘నిత్య పెళ్లి కూతురు’ బాగోతం బయటపడింది. ప్రస్తుతం దుర్గా నీలిమతో పాటు ఆమె తల్లి వీరలక్ష్మి మరో ఇద్దరు రామకృష్ణ, కల్యాణ్‌లపై కేసులు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో.. దీన్నిబట్టి చూస్తే పెళ్లి సంబంధాల విషయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా ఆన్‌లైన్ లేదా తెలియని వ్యక్తుల ద్వారా వచ్చే సంబంధాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Read Also- Telangana: పెళ్లైన నెలకే భర్తను చంపిన ఘటనలో విస్తుపోయే నిజాలు.. 2వేల ఫోన్ కాల్స్, 5 రోజుల కథేంటి?

 

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ