Tejaswi Madivada: బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 (Bigg Boss Telugu Season 2) విన్నరైన కౌశల్ (Kaushal Manda)పై, అదే సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న తేజస్వి మదివాడ సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌశల్ ఆర్మీ అని పెట్టుకుని, తను ఎదగడానికి ఎంతో మందిని తొక్కేశాడని ఆమె ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. కౌశల్ క్యారెక్టర్ ఎలాంటిదో తెలిపింది. ఎంతమందిని తొక్కేసి ఎదిగినా, ఇప్పుడు కనీసం కనిపించకుండా పోయాడు.. అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి కాంట్రవర్సీగా మారాయి. తేజస్వి చెప్పే మాటల్లో నిజం లేకపోలేదు. కౌశల్ ఆర్మీ అంటూ ఆ సీజన్‌లో కౌశల్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. మొదట్లో ఆయనపై సాఫ్ట్ కార్నర్ చూపించినవారే.. తర్వాత ఇతను ఇలాంటి వాడా? అని ఆశ్చర్యపోయారు. అదే విషయాన్ని ఇప్పుడు తేజస్వి వెల్లడించింది.
Also Read- NBK: పెద్దల్లుడితో హ్యాపీనే.. చిన్నల్లుడితోనే ప్రాబ్లమ్! బాలయ్య సంచలన వ్యాఖ్యలు
బిగ్ బాస్ తెలుగు సీజన్ 1ని వేరే రాష్ట్రంలో నిర్వహించగా, సీజన్ 2 కోసం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ 7 ఏకర్స్‌లో ఒక అందమైన బిగ్ బాస్ హౌస్ సెట్ నిర్మించారు. మొదటి సీజన్‌కు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తే, రెండో సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. ఈ సీజన్ మొత్తం కాంట్రవర్సీలతో రచ్చ రచ్చ అయింది. ఫైనల్‌గా కౌశల్ విన్నర్‌గా, సింగర్ గీతా మాధురి రన్నర్‌గా నిలిచారు. కౌశల్‌కు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ లభించింది. అయితే ఈ సీజన్‌లో విన్నర్‌గా నిలిచేందుకు కౌశల్ రకరకాల ప్రయత్నాలు చేశాడని, అందరినీ నమ్మించి మోసం చేశాడని తేజస్వీ మదివాడ తన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అసలామె ఏమన్నదంటే..
‘‘అతను ఎదగడానికి చాలా మందిని తొక్కాడు. ఆ సీజన్‌లో ఉన్న వాళ్లందరినీ తొక్కాడు. భానుని, నన్ను.. ఇలా అందరినీ తొక్కేశాడు. అసలు మా సీజన్‌కు హోస్ట్‌నే మార్చేశారు. నాని మాకు హోస్ట్. నానిపై కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. ఇదంతా నాకు తెలుసు. మీడియా ఎలా వర్కవుట్ అవుతుంది? న్యూస్ ఎలా వర్కవుట్ అవుతుంది? ఒక్కసారి మనం బయటికి వెళ్లిపోయిన తర్వాత ఒక్క థంబ్‌నైల్ మన జీవితాన్ని ఎలా మార్చేస్తుందనేది నాకు చిన్నప్పటి నుంచీ తెలుసు. కానీ నేను దానికి బాధితురాలిని అవుతానని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. బాధితురాలినై, దానిని ఓవర్ కమ్ చేసి.. ఇప్పుడు చాలా క్యాజువల్‌గా తీసుకుంటున్నాను. కానీ, వాడు ఎక్కడా లేడు.. నేను ఇంకా ఇండస్ట్రీలోనే ఉన్నాను. నా మీద జనాలకి ఏదో ఒక ఒపీనియన్ ఉంది. గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒక అభిప్రాయం అయితే ఉంది. నేను ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నాను. కానీ, ఆ సీజన్ విన్నర్ ఎక్కడ ఉన్నాడో నాకయితే తెలియదు. నాకే కాదు ఎవరికీ తెలియదు’’ అంటూ తేజస్వీ ఈ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు