Neet Maharastra
క్రైమ్, లేటెస్ట్ న్యూస్

Maharashtra: క్షమించు తల్లి.. తండ్రి కాదు కాలయముడు!

Maharashtra: పిల్లల్ని మార్కుల యంత్రాలుగా తీర్చిదిద్దుతున్న తల్లిదండ్రులు మన దేశంలో కోకొల్లలు. ఫలానా పిల్లాడికి అన్ని మార్కులు వచ్చాయి, పక్కింటి అమ్మాయికి టాప్ ర్యాంకు వచ్చిందంటూ పోలికలు పెడుతూ కన్నబిడ్డల్ని చిత్రహింసలకు గురిచేస్తున్న అమ్మానాన్నలు లెక్కలేనంతమంది ఉన్నారు. శృతి మించి, దండించి ప్రాణాలు తీసినవారూ ఎందరో ఉన్నారు. అలాంటి శాడిస్ట్ తల్లిదండ్రులకు బలైపోయిన అమాయక పిల్లల జాబితాలో మరో బాలిక చేరింది. మెడిసిన్ అర్హత పరీక్ష నీట్‌కు (NEET) ప్రిపేర్ అవుతున్న ఓ బాలికకు మాక్ టెస్టులో (నామూనా పరీక్ష) తక్కువ మార్కులు వచ్చాయని కన్నతండ్రే కాలయముడు అయ్యాడు. చేజేతులారా చంపేశాడు. ఈ దిగ్భ్రాంతికర ఘటన మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో జరిగింది. సాధనా భోంస్లే అనే 17 ఏళ్ల బాలికను ఆమె తండ్రి ధోండిరాం భోంస్లే మాక్ టెస్టులో తక్కువ మార్కులు వచ్చాయంటూ కర్రతో చావబాదాడు.

Read this- Syringe Horror:145 మందిపై సిరంజి దాడులు.. అందులో ఏముంది?

ఏడాదికి పైగా కాలంగా నీట్‌కు ప్రిపేర్ అవుతున్న సాధన ఇటీవలే ఒక మాక్ టెస్ట్ రాసింది. ఆ పరీక్షలో ఆమెకు తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో, తండ్రి ధోండిరాం తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కోపంలో కూతుర్ని కర్రతో దారుణంగా కొట్టాడు. తలపై కూడా బాగా కొట్టాడు. దీంతో, బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. తలపై కూడా గాయాలయ్యాయి. బాలికను హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించినప్పటికీ ప్రయోజనం దక్కలేదు. చికిత్స అందేలోపే బాలిక ప్రాణాలు కోల్పోయింది. గత శుక్రవారం ఈ దారుణం జరిగింది.

జూన్ 22న బాలిక తల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తక్కువ మార్కులు వచ్చాయంటూ కూతుర్ని దారుణంగా కొట్టాడని ఫిర్యాదులో పేర్కొంది. దెబ్బలు తాళలేక ఆసుపత్రిలో చనిపోయిందని తెలిపింది. దీంతో, నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కూతురు సాధనను చావబాదినట్టు ధోండిరాం ఒప్పుకున్నాడు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతోందని, నిందితుడు జూన్ 24 వరకు పోలీసు కస్టడీలోనే ఉంటాడని పోలీసులు వివరించారు. కాగా, సాధనా భోంస్లే 10వ తరగతి బోర్డు పరీక్షల్లో ఏకంగా 92.60 శాతం మార్కులు సాధించింది. చాలా మంది సాధించలేని మార్కులు ఆమె తెచ్చుకుంది. ప్రస్తుతం బాలిక ఇంటర్ చదువుతోంది. ఇంటర్ చదువుతూనే నీట్‌కు సన్నద్ధమైంది.

Read this- India Vs England: ఇంగ్లండ్‌పై సెంచరీల మోత.. పంత్ సంచలన రికార్డ్

దయచేసి పిల్లల్ని చంపకండి
మార్కులు తక్కువ వచ్చాయంటూ పిల్లల్ని కొట్టడం చాలా దారుణం. పిల్లల భవిష్యత్‌ను తీర్చిదిద్దే ప్రక్రియలో తల్లిదండ్రుల పాత్ర చాలా చాలా ముఖ్యమే. అయితే, మార్కులు తక్కువ వచ్చినంత మాత్రాన పిల్లల భవిష్యత్ ముగిసిపోయినట్టు భావించకూడదని నిపుణులు చెబుతున్నారు. పిల్లలపై తల్లిదండ్రులు కోపంగా వ్యవహరించడం చాలా తప్పు అని, కొట్టడం వంటి చర్యల ద్వారా శారీరక హింసకు గురిచేయడం సబబు కాదంటున్నారు. ఇది మంచి మార్గం కాదని విద్యావేత్తలు సూచిస్తున్నారు. పిల్లలకు తక్కువ మార్కులు రావడం బలహీనత కాదని, సరైన మార్గదర్శనం లేకపోవచ్చని అంటున్నారు. పిల్లల్ని కొడితే వారిపై మానసిక ప్రభావం పడుతుందని అంటున్నారు. కొట్టడం వల్ల పిల్లల్లో భయం, ఒత్తిడి పెరుగుతుందని, తల్లిదండ్రులపై నమ్మకాన్ని కోల్పోతారని వివరించారు. దీర్ఘకాలికంగా మానసిక సామర్థ్యం, ఆత్మవిశ్వాసం తగ్గుతాయని హెచ్చరించారు.

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?