Dil Raju on Game changer ( Image Source: Twtter)
ఎంటర్‌టైన్మెంట్

Dil Raju on Game changer: వాళ్లను నమ్మడం నాదే తప్పు.. గేమ్ ఛేంజర్‌ పై దిల్ రాజు సంచలన కామెంట్స్

Dil Raju on Game changer: తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన సినిమా గేమ్ ఛేంజర్ (Game Changer). శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మించాడు. అయితే, ఈ నేపథ్యంలో సినిమా గురించి దిల్ రాజు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన చేసిన కామెంట్స్ లో బాధ కనిపించింది. 50కి పైగా హిట్ సినిమాలను నిర్మించిన దిల్ రాజు నుంచి ఇలాంటి తప్పు ఒప్పుకోవడం గొప్ప విషయమే అని చెప్పుకోవాలి.

Also Read: Salman Khan : అలాంటి ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నా.. కపిల్‌ శర్మ షోలో సల్మాన్ సంచలన కామెంట్స్

ఆయన చేసిన కామెంట్స్ చూస్తే, దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న శంకర్‌తో (contract స్పష్టత లేకపోవడం వలనే ఈ సమస్యలు వచ్చినట్లు తెలుస్తుంది. పైగా శంకర్ ఓ వైపు  ఇండియన్ 2, ఇంకో వైపు ఈ  సినిమా చేశాడు. చివరికి ఏ సినిమా కూడా హిట్ అవ్వలేదు. కమలా హాసన్ సినిమా  పనుల్లో  బిజీగా ఉండటంతో గేమ్ ఛేంజర్ షూటింగ్ చాలా సార్లు  పోస్ట్ పోన్ అయింది. ఇలా లేట్ అవ్వడం వలన  బడ్జెట్ భారీగా పెరగడమే కాకుండా, కొన్ని విషయాల్లో ఇబ్బందులు వచ్చాయని అంటున్నారు.

Also Read: Upasana: రెండో పెళ్లికి రెడీ అవుతోన్న ఉపాసన.. సోషల్ మీడియాను ఊపేస్తున్న న్యూస్?

సినిమా హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ, ఎవరూ ఊహించని విధంగా డిజాస్టర్ అవ్వడంతో మెగా అభిమానులు కూడా హర్ట్ అయ్యారు. దిల్ రాజు చేసిన కామెంట్స్ ఆయనలోని ఎమోషనల్ బాగా అర్దమవుతోంది. స్టార్ డైరెక్టర్ అని  శంకర్ చేతిలో సినిమాని పెట్టాను. అంత వరకు బాగానే ఉంది. మా ఇద్దరి మధ్య జరిగిన  ఒప్పందాన్ని నేను సీరియస్ గా తీసుకోలేదు. కాబట్టి తప్పు నాది. నా జీవితంలో నేను వేసిన రాంగ్ స్టెప్ అదే అంటూ తాను  చేసిన “తప్పు”  ను ఒప్పుకోవడమే కాకుండా , భవిష్యత్ సినిమాల్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూసుకుంటానంటూ కామెంట్స్ చేశాడు. దీనికి సంబందించిన వీడియో  బాగా వైరల్ అవుతోంది.

Also Read: Naga Chaitanya: సమంతను కలిసిన రోజు హగ్ ఇచ్చి అలా చేస్తానంటూ చైతూ షాకింగ్ కామెంట్స్.. వీడియో వైరల్

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..