Kuppam Issue
ఆంధ్రప్రదేశ్, చిత్తూరు

Kuppam: చంద్రబాబు ఇలాకాలో మరో హృదయవిదారక ఘటన

Kuppam: టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (CM Chandrababu) సొంత ఇలాకా కుప్పంలో అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగివ్వలేదని మహిళను చెట్టుకు కట్టేసిన ఘటన గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఘటన యావత్ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి రంగంలోకి దిగడం వివాదం సద్దుమణిగింది. ఆ కుటంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం కూడా చేశారు. అయితే ఈ ఘటన మరువక ముందే ఇదే కుప్పం నియోజకవర్గంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకున్నది. వివరాల్లోకెళితే.. గుడి రోడ్డు కోసం స్థలం ఇవ్వలేదని చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలను గ్రామస్థులు బహిష్కరించారు. అంతేకాదు, స్మశానంలో మృతదేహాన్ని పూడ్చేందుకు కూడా గ్రామస్తులు అడ్డుకున్నారు.

Read Also- Chandrababu: కుప్పం మహిళకు చంద్రబాబు పరామర్శ.. భారీగా ఆర్థిక సాయం

అసలేం జరిగింది?
చిత్తూరు జిల్లా కుప్పం మండలం మార్వాడ గ్రామానికి చెందిన తిమ్మరాయ స్వామి ఆలయానికి రోడ్డు నిర్మించాలని గ్రామ పెద్దలు భావించారు. అయితే స్థలం ఇవ్వాలని శివశంకర్‌ను గ్రామ పెద్దలు కోరారు. అయితే స్థలం ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో.. శివశంకర్‌కు గ్రామస్థుల మధ్య గత కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపధ్యంలో శనివారం శివశంకర్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆలయం కోసం స్థలం ఇవ్వలేదని.. అతని అంత్యక్రియలకు వెళ్లొద్దని గ్రామస్థులు నిర్ణయించారు. స్మశానంలో అతని మృతదేహం పూడ్చనివ్వొద్దని (Funeral Blocked) గ్రామస్థులకు పెద్దలు ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయంపై శివశంకర్ కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు మధ్య గొడవలు జరిగాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దగ్గరుండి.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంత్యక్రియలు జరిపించారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. ఇది కాస్త కుప్పంలో జరగడంతో చంద్రబాబు ఇలాకా అని.. వరుస ఘటనలు ఆ నియోజకవర్గంలోనే ఎందుకు జరుగుతున్నాయనే ప్రశ్నలు వస్తున్న పరిస్థితి.

Read Also- Kuppam Incident: సీఎం ఇలాకాలో దారుణం.. మహిళను చెట్టుకు కట్టేసి చిత్ర హింసలు

టీడీపీ నేతలు కూడా..?
అయితే.. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకున్న వారిలో అధికార పార్టీ టీడీపీ నేతలు ఉన్నారన్నది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా నడుస్తున్న చర్చ. నాగరాజు కుమారుడు శివ శంకర్ గత కొన్నిరోజులుగా డెంగీ వ్యాధితో బాధపడుతూ బెంగుళూరులోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని బెంగళూరు నుంచి స్వగ్రామానికి తీసుకురావడం మొదలుకుని.. అంత్యక్రియల వరకూ టీడీపీ నాయకులు చేయాల్సిన అడ్డంకులన్నీ చేశారని ఆ కుటుంబం ఆరోపిస్తున్నది. ఇలా గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకోవడం.. కొందరైతే ఆ ఇంటిపైకి రాళ్లు కూడా విసరడం మొదలుపెట్టడంతొ.. ఇక చేసేదేమీ లేక బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. శివశంకర్ అంత్యక్రియలు నిర్వహించడానికి చర్యలు తీసుకున్నారు.

Read Also- Yuvatha Poru: కదం తొక్కిన యువత.. రప్పా రప్పా బ్యాచ్‌తో విధ్వంసమా?

 

వీడియో కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?