Viral Video: సాధారణంగా ఇళ్లల్లో జరిగే పెను ప్రమాదాల్లో గ్యాస్ సిలిండర్ లీక్ ఒకటి. ఒకసారి సిలిండర్ పేలిందంటే ఆ తర్వాత జరిగే నష్టం ఎంత భయానకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్యాస్ సిలిండర్ పేలి.. ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరుచూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే గ్యాస్ సిలిండర్ పేలుడుకు సంబంధించి ఒక షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. అయితే ఈ ప్రమాదం నుంచి ఇద్దరు వ్యక్తులు తృటిలో ప్రాణాలతో బయటపడటం ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే..
గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన ఎక్కడ జరిగిందన్న దానిపై క్లారిటీ లేదు. అయితే ఫుటేజీలోని టైమ్ స్టాంప్ ను బట్టి చూస్తే ఈ ప్రమాదం.. జూన్ 18 (బుధవారం) మ.3 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. వీడియో విషయానికి వస్తే.. వంటగదిలోని నేలపై గ్యాస్ సిలిండర్ భారీగా లీక్ కావడాన్ని గమనించవచ్చు. మధ్య వయస్కురాలైన మహిళ మెుదట గ్యాస్ లీక్ కావడాన్ని ఆపేందుకు యత్నించింది. అది సాధ్యం కాకపోవడంతో.. సాయం కోసం ఇంటి బయటకు పరుగెత్తుకెళ్లింది. కొన్ని క్షణాల తర్వాత మరో వ్యక్తి వచ్చి.. గ్యాస్ లీక్ ను ఆపేందుకు యత్నించారు. గ్యాస్ వాల్వ్ ను మూసేందుకు ప్రయత్నించారు.
They were lucky that all the doors and windows were open, which allowed much of the gas to escape outside and significantly reduced the impact of the explosion. pic.twitter.com/HhS9TTz6m8
— Satyam Raj (@Satyamraj_in) June 22, 2025
ఒక్కసారిగా మంటలు
అయితే అప్పటికే సిలిండర్ నుంచి భారీగా గ్యాస్ లీకై.. ఇంటి మెుత్తాన్ని చుట్టేసింది. వారిద్దరు గ్యాస్ లీక్ ఆపేందుకు యత్నిస్తున్న క్రమంలో.. వంటగది స్టౌవ్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. క్షణాల్లో మంటలు ఎగసిపడ్డాయి. దీంతో వారిద్దరు తలోదిక్కు పరిగెత్తారు. అదృష్టవశాత్తు ఆ మంటలు వారికి అంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అంత భారీ పేలుడు జరిగిన వారిద్దరూ బయటపడటంతో ఆసక్తికరంగా మారింది.
Also Read: Gold Records High: యుద్ధం ఎఫెక్ట్.. పసిడి ఇక కొనలేమా.. మిడిల్ క్లాస్‌కు కష్టమే!
నెటిజన్ల కామెంట్స్
గ్యాస్ లీక్ ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో.. నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ఇంటి తలుపులు, కిటికీలు తెరిచి ఉండటం వల్ల గ్యాస్ బయటకు వెళ్లి.. ప్రమాద తీవ్రత తగ్గిందని స్పష్టం చేస్తున్నారు. భూమ్మీద నూకలు ఉన్నాయంటే ఇదేనేమో.. అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రమాద సమయంలో సదరు మహిళ.. చాలా తెలివిగా వ్యవహరించిందని మరికొందరు పేర్కొంటున్నారు. వెంటనే బయటకు పరిగెత్తి ప్రాణాలను కాపాడుకుందని పేర్కొంటున్నారు.