MLC Kavitha (imagcredit:swetcha)
తెలంగాణ

MLC Kavitha: బీసీలు రిజర్వేషన్ సాధించాలంటే ఉద్యమాలే మార్గం.. ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: కాంగ్రెస్ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్(Kamareddy Declaration) అమలు కోసం రెండేండ్లుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) తెలిపారు. ముఖ్యంగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన దానికి ఫలితంగా రెండు బిల్లులను అసెంబ్లీ ఆమోదించిందని గుర్తుచేశారు. అయితే, రాజ్యాంగంలోని 243(డీ) ప్రకారం ఒక జీవో ఇచ్చి 42 శాతం రిజర్వేషన్లు(Reservations) కల్పించే ఆస్కారం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ పని చేయకుండా నెపాన్ని మొత్తం రాష్ట్రపతిపై తోసేసి రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికల్లోకి వెళ్లే ప్రణాళిక రచించడం శోచనీయమని కవిత(Kavitha) విమర్శలు చేశారు. విద్యానగర్ లోని ఆర్ కృష్ణయ్య(R. Krishnaiah) నివాసానికి ఎమ్మెల్సీ కవిత వెళ్లారు. ఈ సందర్భంగా ఇరువురు భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఇరువురి భేటీ అనంతరం ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడారు.

సామాజిక ఉద్యమాలను నడిపింది కృష్ణయ్య

స్థానిక సంస్థల ఎన్నికల్లో( Local Body Elections)బీసీ(BC)లకు 42 శాతం కల్పించడానికి అసెంబ్లీ పాస్ చేసిన బిల్లును ఆమోదించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచడానికి చేపడుతున్న రైల్ రోకోకు (Rail Roco)మద్దతివ్వాలని కోరినట్లు ఆమె తెలిపారు. కాగా అనేక ప్రజాస్వామిక, సామాజిక ఉద్యమాలను కృష్ణయ్య(R. Krishnaiah) నడిపించిన నేత అని అందుకే తమ కార్యక్రమానికి మద్దతు ప్రకటించినట్లు ఆమె తెలిపారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం బీసీ(BC)లపై ప్రేమను మాటలకే పరిమితం చేస్తూ చేతల్లో చూపించడం లేదని మండిపడ్డారు.

కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని లీకులు ఇస్తున్న నేపథ్యంలో ప్రజా వ్యతిరేక విధానాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలంటే ప్రజా ఉద్యమాలే మార్గంగా కనిపిస్తోందని, కాబట్టి రైల్ రోకో చేపడుతున్నామని వివరించారు. ఓర్ ఏక్ ధక్కా.. బీసీ బిల్లు పక్కా.. అని కవిత స్పష్టం చేశారు.

Also Read: YSRCP: ఏపీ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్.. వైసీపీలోకి దేవినేని ఉమా?R

బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు

అనంతరం ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్(United Phule Front) సంయుక్తంగా జూలై 17న తలపెట్టిన రైల్ రోకో కార్యక్రమంతో సహా ప్రతీ కార్యక్రమానికి తాము అండగా నిలిచి పాల్గొంటామని, బీసీలంతా ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ కవిత బీసీలకు అండగా నిలచి ఉద్యమం చేస్తున్నారన్నారు. తరతరలాలుగా అన్యాయం జరుగుతున్న బీసీల కోసం కవిత పోరాటం అభినందనీయమని పేర్కొన్నారు.  ఈ ఉద్యమాన్ని భుజన ఎత్తుకోకపోతే బీసలకు భవిష్యత్తు లేదని ఆయన వ్యాఖ్యానించారు.

బీసీల రిజర్వేషన్లు తగ్గిపోయే ప్రమాదం

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చిందని, కానీ దాన్ని ప్రభుత్వం తోసిపుచ్చుతూ ప్రజల దృష్టిని మళ్లీస్తోందని ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ది ఉంటే జీవో(GO) జారీ చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే బీసీలకు చారిత్రక ద్రోహం చేసినట్లవుతుందని స్పష్టం చేశారు. పోరాటం చేయకపోతే భవిష్యత్తులో బీసీల రిజర్వేషన్లు తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తాడోపేడో తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చిందని కృష్ణయ్య పేర్కొన్నారు. రిజర్వేషన్లు పెంచకపోతే బీసీలు ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తప్పనిసరిగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు జరపాలని, లేదంటే రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుందని హెచ్చరించారు.

Also Read: AirIndia-DGCA: ఎయిరిండియాకు డీజీసీఏ సంచలన ఆదేశాలు

తెలంగాణ జాగృతిలో ఆటో యూనియన్ విలీనం

తెలంగాణ జాగృతిలో ‘యూనిటీ తెలంగాణ ఆటో డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్’(Telangana Auto Drivers Welfare Associations)  విలీనమైంది. బంజారాహిల్స్(Banjara Hills) లోని కవిత నివాసంలో వారు జాగృతిలో చేరారు. సంఘం అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ సలీం, ప్రధాన కార్యదర్శి సయీద్ రహ్మత్ అలీ హష్మీ సహా యూనియన్ నాయకులందరూ తెలంగాణ జాగృతి(Telangana Jagruthi)లో చేరారు. అనంతరం కవిత మాట్లాడుతూ హైదరాబాద్(Hyderabad) లోనే అతిపెద్ద ఆటో యూనియన్ తెలంగాణ జాగృతిలో విలీనమవ్వడం సంతోషకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా ఆటోడ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఈఎస్ఐ హాస్పిటళ్లలో ఆటోడ్రైవర్లకు వైద్య సేవలు

ఆటోలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చెల్లించడానికి ఒక్కో డ్రైవర్ పై రూ.8 వేల ఆర్థిక భారం పడుతోందని, దానిని రద్దు చేసి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ మొత్తం చెల్లించాలన్నారు. మహిళలకు ఉచిత బస్సు(Free Bus) కారణంగా ఉపాధి కోల్పోతున్న ఆటోడ్రైవర్లకు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలన్నారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ను రూ.10 లక్షలకు పెంచాలని, ఈఎస్ఐ హాస్పిటళ్లలో(ESI Hospital) ఆటోడ్రైవర్లకు వైద్య సేవలు అందించాలని కవిత డిమాండ్ చేశారు. ట్యాక్సీ ప్లేట్ వెహికిల్స్ ను మాత్రమే ఓలా(Ola), ఉబర్(Uber), ర్యాపిడో(Rapido) ద్వారా అనుమతించాలని సూచించారు.

జాగృతి విద్యార్థి విభాగంలో ఎన్ఎస్ యూఐ నాయకుల చేరిక…

తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ లో కూకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాలకు చెందిన ఎన్ఎస్ యూఐ(NSUI) నాయకులు సహా పలువురు విద్యార్థులు చేరారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వారికి కండువాలు కప్పి జాగృతిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు ఎమ్మెల్సీ కవితకు ఖడ్గం బహూకరించారు. కార్యక్రమంలో రాముయాదవ్, అభి గౌడ్, అఖిల్ స్వామి, అనికేత్ సాయి, అనిల్, చెన్న కేశవ, సాయి, సాయి కుమార్ నాయి, లడ్డు, లక్కీ రుద్ర, మహేశ్, మణికంఠ, నాగబాబు, ప్రణయ్, ప్రశాంత్, రుద్ర అభి, షేక్ ఆరిఫ్, సుదీప్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Chamala Kiran Kumar: హరీష్​రావు కీలక స్కెచ్.. కేసీఆర్‌ను విలన్ చేసే ప్రయత్నం

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు