Cancer Control: క్యాన్సర్ కంట్రోల్ కు ప్రభుత్వం కీలక నిర్ణయం
Cancer Control (imagecredit:twitter)
Telangana News

Cancer Control: క్యాన్సర్ కంట్రోల్ కు ప్రభుత్వం కీలక నిర్ణయం

Cancer Control: క్యాన్సర్ కంట్రోల్(Cancer Control) కు ఇటీవల సర్కార్ తీసుకున్న నిర్ణయంలో మరో ముందడుగు పడింది. అన్ని జిల్లాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్లకు శ్రీకారం చుట్టనున్నారు. అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ(Medical Collage)ల్లో ఈ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఒక్కో ఆసుపత్రి నుంచి ఇద్దరు డాక్టర్లు(Doctors), ఐదుగురు నర్సింగ్ ఆఫీసర్లకు ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా పూర్తయింది.

త్వరలోనే హెల్త్ స్క్రీనింగ్(Health Screening), చెకప్ లు నిర్వహించనున్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్(Cancer Screening), డయాగ్నసిస్, డే కేర్ కీమో థెరఫీ(Chemotherapy), పాలియేటివ్ కేర్ వంటి సేవలన్నీ ఈ కేంద్రాల ద్వారా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు అడ్వాన్స్ డ్ ల్యాబ్స్(Advance Labs), టెస్టులు కూడా ఈ సెంటర్లలోనే నిర్వహించేలా సర్కార్ ప్లాన్ చేస్తోన్నది. అతి త్వరలోనే వీటని ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది.

ఎర్లీ స్టేజ్ తో కంట్రోల్?

క్యాన్సర్ వ్యాధిని ఎర్లీ స్టేజ్ లో గుర్తిస్తే కంట్రోల్ సులభమని డాక్టర్లు చెప్తున్నారు. దీంతోనే జిల్లాకొక స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. క్షేత్రస్థాయిలోని గ్రామాల్లో కూడా స్క్రీనింగ్ చేసి క్యాన్సర్ ను వేగంగా గుర్తించాలనేది సర్కార్ టార్గెట్. దీంతోనే ఈ సెంటర్లకు అనుసంధానంగా మొబైల్ స్క్రీనింగ్ వెహికల్స్ కూడా వర్క్ చేయనున్నాయి.

ఇక సీనియర్ కేసులకు ట్రీట్మెంట్ అందించేందుకు ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రిని నోడల్ సెంటర్ గా వినియోగించుకోనున్నారు. ప్రతి కేంద్రానికి ఎంఎన్ జేతో లింక్ ఇవ్వనున్నారు. సీనియర్ అంకాలజిస్టుల సలహాలతో జిల్లాల్లోనే కొన్ని కేసులకు ట్రీట్మెంట్ ఇవ్వనున్నారు. అక్కడ సాధ్యపడని సందర్భాల్లో మాత్రమే కేసులను హైదరాబాద్ కు రిఫర్ చేయనున్నారు.

Also Read: Good News to Farmers: గుడ్ న్యూస్.. మరో 2 రోజుల్లో ఖాతాల్లోకి డబ్బులు.. మంత్రి హామీ!

రొమ్ము క్యా న్సర్ పై ఫోకస్

మారుతున్న లైఫ్​ స్టైల్(Life Style), వ్యాయామాలు లేకపోవడం, ఆలస్యంగా జరుగుతున్న వివాహాలు, సరైన అవగాహన లేకపోవడం, అధిక బరువు తదితర లక్షణాలతో చాలా మంది మహిళల్లో రొమ్ము క్యాన్సర్లు ప్రబలుతున్నాయి. అయితే వీటిని చాలా మంది ఆలస్యంగా గుర్తిస్తున్నారు. దీంతో వ్యాధి నియంత్రణ ఆశించిన స్థాయిలో జరగడం లేదు.

తద్వారా రాష్ట్రంలో రొమ్ము క్యాన్సర్ల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. 2021 నుంచి ఇప్పటి వరకు వరకు ప్రతీ ఏడాది సగటున ఒక్క ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి(MNJ Cancer Hospital)లోనే 1500 లకు చొప్పున కేసులు నమోదయ్యాయంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన చేయడంతో పాటు వేగంగా చికిత్సను అందించేందుకు ఈ స్క్రీనింగ్ సెంటర్లు బాగా ఉపయోగపడనున్నాయి.

Also Read: Telangana: దివ్యాంగుల సంక్షేమం.. సర్కారు సరికొత్త వ్యూహం

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..