Good News to Farmers (Image Source: Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Good News to Farmers: గుడ్ న్యూస్.. మరో 2 రోజుల్లో ఖాతాల్లోకి డబ్బులు.. మంత్రి హామీ!

Good News to Farmers:  బీఆర్ఎస్ నేతలపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao).. విపక్ష బీఆర్ఎస్ (BRS) పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా(Rythu Bharosa) నిధులు విడుదల చేయగానే BRS నాయకులు డ్రామాలు మొదలుపెట్టారని ఆరోపించారు. మంచి ఉద్దేశ్యంతో రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన పథకాలను రాజకీయం చేసిన ఘనత ప్రతిపక్ష నాయకులకే దక్కుతుందని మండిపడ్డారు. మీరు కోతల మనుషులు, మీది కోతల ప్రభుత్వమనే ప్రజలు తిరస్కరించి విపక్షంలో కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు.

తెలంగాణ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 6 రోజుల్లో రైతు భరోసా సాయం కింద రూ. 7770.83 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీ (Congress Party)కే దక్కుతుందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ.. రూ.2 లక్షల లోపు రుణమాఫీని ఒకేసారి చేయడం జరిగిందని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లోపల ఉన్న రైతులకు రైతు భరోసా రావట్లేదని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు.

Also Read: Aamir Khan – Gauri Spratt: అమీర్ ఖాన్ కొత్త గర్ల్ ఫ్రెండ్.. ఇద్దరి ఏజ్ గ్యాప్ తెలిస్తే షాకే!

ఔటర్ రింగ్ రోడ్డు లోపల 2.18 లక్షల ఎకరాల భూమి ఉందని మంత్రి తుమ్మల తెలిపారు. అందులో 93000 ఎకరాలు రియల్ ఎస్టేట్ వెంచర్లకు వెళ్లిపోయాయని.. సాగుకు వీలులేని విధంగా భూములు మారిపోయాయని అన్నారు. వాటిని మినహాయించి మిగతా 1.20 లక్షల ఎకరాల భూమికి రైతుభరోసా పథకాన్ని వర్తింపచేయుటకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. రానున్న 2,3 రోజుల్లో ఓఆర్ఆర్ లోపల ఉన్న రైతుల ఖాతాల్లోనూ రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాజకీయం చేయాలని చూస్తున్న బీఆర్ఎస్ నేతల మాటలు.. రైతులు వినవద్దని హితవు పలికారు.

Also Read This: Nalgonda Crime: మహిళతో ఎఫైర్.. చెట్టుకు కట్టేసి.. కళ్లల్లో కారం కొట్టి.. యువకుడి హత్య!

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు