Manchu Heroes
ఎంటర్‌టైన్మెంట్

Manchu Family: న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొన్నాం.. అసలు విషయం ఇదే!

Manchu Family: మంచు ఫ్యామిలీ న్యూజిలాండ్‌‌లో 7 వేల ఎకరాలు కొన్నదా? అంత డబ్బు ఎక్కడిది? ఈ మధ్య కాలంలో వాళ్లకి ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. ఆస్తుల విషయంలో గొడవలు పడుతున్నారు. మంచు మనోజ్ (Manchu Manoj) గొడవ పడుతుంది ఈ ఆస్తుల కోసమేనా? న్యూజిలాండ్‌లో మోహన్ బాబు (Manchu Mohan Babu) తన పెద్ద కుమారుడు మంచు విష్ణు (Vishnu Manchu)కు అన్ని వేల ఎకరాలు కొనిపెట్టాడు కాబట్టే.. మంచు మనోజ్ ఫైట్ చేస్తున్నాడా? ఈ డౌట్స్ అన్నీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియోతో రైజ్ అవుతున్నాయి. ఈ వీడియోలో మంచు మోహన్ బాబు మాట్లాడుతూ.. న్యూజిలాండ్‌లో ఈ కనిపిస్తున్న స్థలం, ఆ కొండలు మొత్తం 7 వేల ఎకరాలు మంచు విష్ణు కోసం కొన్నాం. ఇదంతా మనదే అని చెబుతున్నారు. వీడియోలో ముఖేష్ రుషి, ప్రభుదేవా, మంచు విష్ణు వంటి వారంతా ఉన్నారు.

Also Read- Jana Nayakudu: ‘జ‌న నాయ‌కుడు’ ఫ‌స్ట్ రోర్.. చివరి సినిమాలో విజయ్ చేస్తున్న పాత్ర ఇదే!

ఇక ఈ వీడియో విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీపై ఒకటే వార్తలు. మంచు ఫ్యామిలీలో ఇంత జరుగుతుందా? పెద్ద కొడుకుకు అంత చేసి, చిన్న కొడుకుని నడిరోడ్డుపై వదిలేస్తాడా? ఇదేనా పెదరాయుడుకు ఉండాల్సిన లక్షణం అంటూ ముఖ్యంగా మోహన్ బాబుపై ఓ రేంజ్‌లో కామెంట్స్ పడుతున్నాయి. ఈ విషయంలో కూడా ఆయనని కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో వాస్తవమెంత? అనేది తేలిపోయింది. మోహన్ బాబు ఆ వీడియోలో చెప్పేది నిజం కాదు. న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొనేంత సీన్ వాళ్లకి ఉన్నా, అక్కడ సాధ్యం కాదు. అక్కడ పరదేశీయులకు ఇలా భూమిని కొనే అవకాశం ఉండదు. మరి ఇదంతా మోహన్ బాబు ఎందుకు చేశాడు? అంటే.. కడుపు లోపల ఉన్న ‘నీళ్లు’ అలా పలికించాయని చెప్పుకోవచ్చు. సరే.. ఆ సంగతి పక్కన పెడితే, ఈ 7 వేల ఎకరాల వెనుక ఉన్న విషయమేంటో తాజాగా నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చేశారు. ఈ మేరకు ఆయన చేసిన పోస్ట్‌లో..

Also Read- Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9లో క్రేజీ స్టార్స్.. రచ్చ చేయడానికి కాంట్రవర్సీ భామలు?

‘‘అరే బాబులు.. వినండి..
మోహన్ బాబు, విష్ణు మంచులతో నేను పోస్ట్ చేసిన ఆ వీడియో కేవలం సరదా కోసమే. మేమంతా ఎప్పుడూ అలాగే నవ్వుతూ, సరదాగా మాట్లాడుకునేవాళ్లం. న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొనేశాం, అక్కడున్న కొండలు కూడా మావే అని సరదాగా జోక్ చేశాం. మంచు విష్ణు కూడా అందుకు తగ్గట్టుగా నటించాడు, మోహన్ బాబు సార్ పూర్తిగా కామెడీ మూడ్‌లో ఉన్నారు, నేను ఎప్పటిలాగే వాళ్ళని ఆటపట్టించాను.

మేము సరదాగా చేస్తే, సడెన్‌గా జనాలు ఇది నిజమని నమ్మడం మొదలుపెట్టారు?! అలా నమ్మే వారందరి కోసం.. అరే భాయ్… న్యూజిలాండ్‌లో 7000 ఎకరాలు కొనడం అంత సులువైతే, నేను ప్రతీ వారాంతం అక్కడే షూటింగ్ చేసుకునేవాడిని కదా! అదంతా మేము సరదాగా చేసింది తప్పిదే.. అందులో నిజం లేదు. ఈ సరదా వీడియో మరింత కాంట్రవర్సీగా మారకముందే.. అందరికీ ఒక విషయం స్పష్టం చేయాలి. న్యూజిలాండ్‌లో ఎవరూ, ఎలాంటి భూమి కొనలేదు. న్యూజిలాండ్ పౌరులు కాని వారికి అక్కడ భూమికి యాజమాని అయ్యే అనుమతి, అర్హత ఉండదు. దయచేసి ఈ సరదా వీడియోని సీరియస్‌గా తీసుకోవద్దని కోరుతున్నాను. కాస్త అందరూ నవ్వండి. కామెడీగా చేసిన దానిని వేరే విధంగా సృష్టించకండి. ‘కన్నప్ప’ విడుదలవుతోంది. అందరూ ఆ సినిమా చూసేందుకు సిద్ధం కండి’’ అని బ్రహ్మాజీ తన పోస్ట్‌లో క్లారిటీ ఇచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?