Peddi Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) హీరోగా నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ (Peddi). నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా.. సోషల్ మీడియాలో రెండు మూడు రోజుల పాటు ఈ సినిమా టైటిల్‌లో ట్రెండింగ్‌లోనే ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్ ఈ సినిమాపై దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది. పవర్ ఫుల్ కొలాబరేషన్, అద్భుతమైన టీమ్‌తో ‘పెద్ది’ భారతీయ సినిమాలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పడానికి సిద్ధమవుతోంది. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో.. నిర్మాత వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి వచ్చిన అప్డేట్‌తో.. మరోసారి ‘పెద్ది’ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
Also Read- Jana Nayakudu: ‘జన నాయకుడు’ ఫస్ట్ రోర్.. చివరి సినిమాలో విజయ్ చేస్తున్న పాత్ర ఇదే!
ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. భారీ యాక్షన్ నైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరణ జరుపుతున్నట్లుగా తెలుపుతూ లొకేషన్‌లోని స్టిల్‌ని మేకర్స్ విడుదల చేశారు. స్టార్ డీవోపీ రత్నవేలు ‘పెద్ది’ సెట్స్ నుంచి పవర్ ఫుల్ ఫొటోని షేర్ చేసి.. గ్లోబల్ స్టార్‌తో భారీ నైట్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నట్లు తెలియజేశారు. డీవోపీ రత్నవేలు షేర్ చేసిన పిక్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇంటెన్స్ అండ్ బీస్ట్ మోడ్‌లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ స్టిల్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సినిమాలో ఈ సీక్వెన్స్ మేజర్ హైలైట్‌గా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్, టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతి బాబు, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read- Gadwal: గద్వాలలో మరో సోనమ్.. పెళ్లయిన నెల రోజులకే భర్త హత్య!
ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గెలుచుకున్న నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం 2026 మార్చి 27న, రామ్ చరణ్ పుట్టిన రోజు స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతగానో వేచి చూస్తున్నారు. ఇంతకు ముందు రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గేమ్ చేంజర్’ చిత్రం అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. దీంతో బుచ్చిబాబు సానా ఇచ్చే ట్రీట్ కోసం వారంతా వేచి చూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్ రేంజ్ ఇదని నిరూపించుకునే ప్రాజెక్ట్ పడలేదు. అది ‘పెద్ది’నే అవుతుందని వారంతా భావిస్తున్నారు.
Filmed a terrific night action sequence with gritty visuals @AlwaysRamCharan bro breathes fire 🔥🔥#peddi @arrahman @BuchiBabuSana @RathnaveluDop #Janhvi Kapoor @vriddhicinemas
# Nabhakanth pic.twitter.com/wtQl6pLZzP— Rathnavelu ISC (@RathnaveluDop) June 21, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు