Jagan Car Accident Issue
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

YSRCP: సింగయ్య నిజంగానే జగన్ కారు కిందపడి చనిపోయాడా.. వీడియోపై బోలెడన్ని డౌట్స్!

YSRCP: సింగయ్య మృతి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో ఈ ఘటన జరిగింది. తొలుత జగన్ కాన్వాయ్‌లోని కారు కిందపడి చనిపోయాడని కొందరు.. ఆ తర్వాత ప్రైవేట్ వాహనం ఢీకొని చనిపోయాడని మరికొందరు ఇలా ఎవరికి తోచినట్లుగా మీడియా, సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చే చేశారు. అయితే దీనిపై జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ.. జగన్ కాన్వాయ్‌లోని కారు ఢీకొని సింగయ్య చనిపోలేదని.. ప్రైవేటు వాహనం ఢీ కొట్టి చనిపొయారని టాటా సఫారీ కారు (నెంబర్ AP26CE0001) తగిలి పడిపోయారని.. ఆ తర్వాత ఆయన్ను రోడ్డు పక్కన పడుకోబెట్టారని క్లియర్ కట్‌గా చెప్పారు. అంతేకాదు.. సింగయ్యను పోలీసులు వచ్చేవరకూ ఎవరూ పట్టించుకోలేదని, జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే మరణించారని వైద్యులు చెప్పినట్లుగా ఎస్పీ తెలిపారు. అయితే.. రెండు మూడ్రోజుల వ్యవధిలోనే ఈ సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఏకంగా ఒక వీడియోను తెచ్చి జగన్ కారే ఢీ కొట్టిందని ప్రచారం చేయడం ఎంతవరకూ సమంజసం? అంటే నాడు ఎస్పీ చెప్పింది తప్పా? తప్పుడు సమాచారం అని అటున్నారా? అని ఈ వీడియోను వైరల్ చేస్తున్న.. టీడీపీని ప్రశ్నిస్తున్న పరిస్థితి.

Read Also- YS Jagan: జగన్.. రప్పా రప్పా అంటే ఇదేనా?

లాజిక్‌గా ఆలోచిస్తే..
పోనీ.. ఇప్పుడు ప్రచారం చేస్తున్న వీడియోలో చూస్తే ఫార్ట్యూనర్ కారు టైర్ సింగయ్య తలపైకి ఎక్కినట్టు చూపిస్తున్నారు కదా.. నిజానికి 3700 కేజీల బుల్లెట్ ప్రూఫ్ కారు ఒక మనిషి తలపైకి ఎక్కితే.. తల చితికిపోతుంది. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. కానీ, సింగయ్య మృతదేహం చూస్తే తలపైకి కారు ఎక్కినట్టుగా కనిపించడం లేదు. మరి ఆ వీడియో నిజమైనదా? లేక సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిపోయిన ఈ రోజుల్లో తయారు చేయబడ్డ వీడియోనా అనేది కూడా తేలాల్సి ఉందనే ప్రశ్నలు వైసీపీ నుంచి వస్తున్నాయి. ఆ వీడియోను కాస్త ఫ్రేమ్స్ వారిగా పరిశీలిస్తే ఆ జనాల్లో ఎక్కడా కనిపించని సింగయ్య.. సడన్‌గా కారు కింద కనిపించడమేంటి? అనేది కూడా పెద్ద డౌటానుమానమే. ఇక ఈ విషయం కాసేపు అటుంచితే.. ప్రతిపక్షనేత రాష్ట్రంలో ఒక కార్యక్రమానికి వస్తున్నప్పుడు ప్రజల తాకిడి ఉంటుందని ఖచ్చితంగా ప్రభుత్వం.. పోలీసు వారిని పెట్టి ప్రజలను కంట్రోల్ చేసే విధంగా భద్రతా చర్యలు తీసుకోవాలి కదా.. కానీ, అటువంటి భద్రతా చర్యలు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నట్టు ఎక్కడా కనిపించలేదన్నది మరో ప్రశ్న. పోలీసులు ఏమయ్యారు..? శాంతి భద్రతలు ఏమయ్యాయి? అని ఆ నాడే వైసీపీ నేతలు.. ప్రభుత్వంపై ఏ రేంజిలో మండిపడ్డారో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ మధ్యనే పలు ఇంటర్వ్యూలు, మీడియా సమావేశాల్లో సీఎం చంద్రబాబు మొదలుకుని టీడీపీ నేతలు.. జగన్‌పై ఇష్టానుసారం మాట్లాడుతున్న మాటలను వైసీపీ కార్యకర్తలు, వీరాభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ‘ ఒక్కటి మాత్రం నిజం. జగనన్నను ప్రజల వద్దకు వెళ్లకుండా ఆపాలన్న ప్రయత్నమైతే చాలా పెద్ద ఎత్తునే జరుగుతోంది. అలాగే జగనన్నను భూస్థాపితం చేస్తానని స్వయంగా బాబుగారు అన్నారు. మీరు జాగ్రత్త జగనన్న.. తలచుకుంటేనే భయమేస్తోంది’ అని వైసీపీ కార్యకర్తలు కంగారుపడుతూ ఎక్స్ వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

Read Also- Star Comedian: స్నానం చేయక చేతికి గజ్జి వచ్చిందంటూ.. ఎమోషనల్ అయిన స్టార్ కమెడియన్

సమాధానం ఏదీ..?
వినుకొండలో టీడీపీ కార్యకర్త చేతిలో హత్య గావింపబడ్డ రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన రోజు కూడా సరైన భద్రత ఎందుకు కల్పించలేదు? అని వైసీపీ నేతలు ప్రశ్నించగా ఇంతవరకూ సమాధానం రాలేదు. కాస్త నిశితంగా గమనిస్తే.. నాడే జగన్ భద్రతాలోపం ఉన్న కారు దిగి మరొక కారులో వెళ్లవలసిన పరిస్థితి నెలకొన్నది. రాప్తాడు పర్యటనలో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే.. హెలీకాఫ్టర్ దగ్గర సరైన భద్రత కూటమి ప్రభుత్వం కల్పించలేదనే విమర్శలు వైసీపీ నుంచి ఉన్నాయి. అలాగే.. గుంటూరు మిర్చి యార్డుకు వెళ్ళిన రోజు కూడా పోలీస్ భద్రత సరిగ్గా లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ భద్రతా లోపాలపై వైసీపీ ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పల్నాడులో కూడా జగన్ కాన్వాయ్ దారిలో సరైన భద్రత లేదని వైసీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే.. వాస్తవానికి మాజీ సీఎం, ప్రతిపక్షనేత పర్యటన ఉన్నప్పుడు.. కాన్వాయ్ సాగుతునప్పుడు ప్రజలను కంట్రోల్ చేయాల్సిన భాద్యత ముమ్మాటికీ ప్రభుత్వానిదే కానీ, అలా చేయకుండా అవాంచనీయ ఘటనలు జరిగితే.. దానిని జగన్‌పై వేసి బురదజల్లుదామని వేచి చూడటం శోచనీయం అని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ మొత్తమ్మీద చూస్తే.. జగన్ కారు కిందపడి సింగయ్య చనిపోయారా? లేదంటే ప్రైవేట్ కారు కిందపడి మృతిచెందారా? అన్నది ప్రభుత్వమే తేల్చాల్సి ఉన్నది.

Read Also- Jana Nayakudu: ‘జ‌న నాయ‌కుడు’ ఫ‌స్ట్ రోర్.. చివరి సినిమాలో విజయ్ చేస్తున్న పాత్ర ఇదే!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు