Pawan Kalyan: ప్రధాని నరేంద్ర మోదీ.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ వచ్చిందా? లేకుంటే ఇచ్చారా? ఇప్పుడిదే కొందరు జనసైనికులు, మెగాభిమానుల్లో ఉన్న వస్తున్న పెద్ద డౌట్. వాస్తవానికి మోదీ-పవన్ (Modi-Pawan Kalyan) మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి రాకమునుపే ఇద్దరికీ పరిచయం ఉంది. టీడీపీతో కలిసి జనసేన, బీజేపీ పోటీచేశాక ఆ బంధం మరింత బలపడింది. ఇంకా చెప్పాలంటే కూటమి కట్టడానికి కర్త, కర్మ, క్రియ సేనానియే అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని ఇంకా చెప్పాలంటే.. ‘యే పవన్ నహీ హై.. అంధీ హై’ అంటూ ఎన్డీఏ సభలో స్వయంగా మోదీ వ్యాఖ్యానించారు. అలా ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా నరేంద్ర మోదీని కలవడం.. పలు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లడం ఇవన్నీ ఇప్పటి వరకూ చకచకా జరిగిపోయాయి. కానీ, ఈ మధ్య ఎందుకో ఒక్కసారిగా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చేసింది? అయితే నిజంగానే గ్యాప్ వచ్చిందా? లేకుంటే గ్యాప్ ఇచ్చారా? లేదంటే మూడో వ్యక్తి ప్రమేయంతో ఇలా జరిగిందా? అనేది తెలియట్లేదు కానీ.. ఏదో తేడా కొడుతోందని మాత్రం జనసైనికులకు క్లియర్ కట్‌గా అర్థమవుతోందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడిదే సోషల్ మీడియాలో విపరీతంగా నడుస్తున్న చర్చ..!
Read Also- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ షాకింగ్ నిర్ణయం.. ఇంత సడన్‌గా ఎందుకిలా?
Read Also- Janasena: పుంజుకుంటున్న బీజేపీ.. మంత్రి పదవికే అంకితమైన పవన్.. జనసేనకు ఎందుకీ గతి?
ఎందుకిలా..?
వాస్తవానికి.. ఆంధ్రాలో కూటమి గెలిచిందంటే ‘వన్ అండ్ ఓన్లీ’ పవన్ కళ్యాణ్ సాధ్యమన్నది జగమెరిగిన సత్యమేనని జనసైనికులు బల్లగుద్ది మరీ చెబుతుంటారు. అందుకే ఇటు సీఎం చంద్రబాబు (Chandrababu) .. అటు నరేంద్ర మోదీ (Narendra Modi) ఇరువురూ సేనానికి మంచి గౌరవ, మర్యాదలతో చూసుకుంటూ వస్తున్నారు. ఆయన ఏం అడిగినా సరే కాదనకుండా అన్ని పనులూ చక్కబెడుతున్నారు. కానీ, ఎందుకో ఈ మధ్య మోదీ, పవన్‌ల మధ్య లాంగ్ గ్యాప్ వచ్చిందనే విషయం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఇరువురూ కలుసుకున్నది లేదు.. మాట్లాడుకున్నదీ లేదు. పోనీ కలుసుకున్నా ఆశించినంతగా పలకరింపులూ లేవు.. అదేదో అంటూరే ఎడమొహం పెడమొహం అన్నట్లుగానే పరిస్థితి ఉన్నది. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమే డిప్యూటీ సీఎం ఎక్స్ (@APDeputyCMO) వేదికగా పోస్ట్ చేసిన ఫొటోలే. ఈ ఫొటోలు కాస్త నిశితంగా పరిశీలిస్తే.. ఎక్కడా ఇరువురి మధ్య మునుపు ఉన్న సఖ్యత ఉన్నట్లుగానీ, కనీసం నవ్వు కూడా కనిపించలేదు. ఏదో పోగొట్టుకున్న మనిషిలాగానే పవన్ కనిపించారు.. కానీ, ఎక్కడా ఆయన హ్యాపీగా కనిపించినట్లుగా లేనే లేదు. దీంతో ఈ ఫొటోలు చూసిన సొంత పార్టీ కార్యకర్తలు, నేతలే చిత్రవిచిత్రాలుగా చర్చించుకుంటున్న పరిస్థితి. దీనికి తోడు మోదీకి చంద్రబాబు శాలువా కప్పేటప్పుడు.. ఈయన కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేశారు కానీ, ఎందుకో వీలు కాలేదు. ఆ తర్వాత లక్ష్మీనర్సింహా స్వామి ప్రతిమను ప్రధానికి ఇవ్వడానికి పవన్ ప్రయత్నించారు కానీ.. ఆయన చేతిలో నుంచి చంద్రబాబు లాగేసుకొని మరీ ఇవ్వడం ఫొటోలు, వీడియోల్లో చూడొచ్చు. ఈ ఒక్క ఈవెంట్‌లోనే ఇలాంటి ఘటనలు చాలాలనే చోటుచేసుకున్నాయి. దీంతో ఇదే అదునుగా చేసుకున్న వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు ‘పబ్లిసిటీ కోసం పాకులాడే జాతి రత్నాలు’ అంటూ జాతిరత్నాలు సినిమా క్లిప్‌లు జతచేసి మరీ రచ్చ రచ్చ చేసేస్తున్నారు.
Read Also- Atchannaidu: ఇచ్చేయండి సార్.. అచ్చెన్నకు బహుమతి!
కారణం ఇదేనా?
ప్రధానికి-డిప్యూటీ సీఎంకు గ్యాప్ రావడానికి యువనేత నారా లోకేష్ కారణమని ప్రచారం పెద్ద ఎత్తునే జరుగుతోంది. ఎందుకంటే.. ఇదివరకు మోదీ-పవన్ మధ్య ఎంత అనుబంధం, కలివిడి ఉన్నదో.. ఇప్పుడే అదే పరిస్థితి మోదీ-లోకేష్ ఉన్నది. అంటే రానున్న ఎన్నికల్లో యువనేతను ఎక్కడికో తీసుకెళ్లడానికి చంద్రబాబు ఈ గ్యాప్ సృష్టించారనే రచ్చ సోషల్ మీడియాలో (Social Media) జరుగుతోంది. ఎందుకంటే.. పర్యటనలు, కార్యక్రమాలు ఇంకా అంతకుమించి పనులున్నా సరే సడన్‌గా అమరావతి నుంచి ఢిల్లీలో లోకేష్ (Lokesh Delhi Tour) ప్రత్యక్షమవుతున్నారు. ఈ మధ్యనే రెండుసార్లు హస్తినకు వెళ్లడం ఏకంగా ప్రధాని మోదీని కలవడంతో తెరవెనుక ఏదో పెద్ద ప్లానే జరుగుతోందనే సందేహాలు కొందరు జనసైనికుల్లో ఆటోమాటిక్‌గా వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే విశాఖకు విచ్చేసిన మోదీ.. లోకేష్‌పై ప్రశంసల జల్లు కురిపించడం, ఒక్క మాట కూడా పవన్ గురించి మాట్లాడకపోవడం కూడా లేనిపోని సందేహాలకు తావిస్తున్నది. అంటే అటు ఢిల్లీలో.. ఇటు వైజాగ్‌లో ఎటుచూసినా లోకేష్‌మయం స్పష్టంగా కనిపించింది. అంటే ఢిల్లీ పెద్దలకు లోకేష్ దగ్గరవుతున్న కొద్దీ.. మోదీ-పవన్ మధ్య గ్యాప్ వచ్చేస్తోందని సేనాని వీరాభిమానులు చర్చించుకుంటున్నారు. అంతేకాదు.. మోదీ కూడా పవన్‌తో మునుపటిలో సఖ్యతగా లేరనేది కూడా యోగాంధ్ర కార్యక్రమంలోని ఫొటోలు.. వీడియోలు చూస్తే అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే పవన్ ఎందుకో.. ఎక్కడో బాగా వెనుకబడినట్లుగా అర్థమవుతోంది. లోకేష్ మాత్రం జెట్ స్పీడ్ రేంజిలో అటు ఢిల్లీ.. ఇటు అమరావతి ఎటు కావాలంటే అటు దూసుకెళ్లిపోతున్నారని అభిమానులు చెబుతున్నారు. సో.. ఈ గ్యాప్ నిజంగానే వచ్చిందా? రాలేదా..? పోనీ గ్యాప్ ఇచ్చారా? ఎందుకిలా జరుగుతోందన్నది పైనున్న పెరుమాళ్లకు.. కిందున్న మోదీ, చంద్రబాబు, పవన్, లోకేష్‌లకే తెలియాలి మరి.
Read Also- Samantha vs Sobhita: అక్కినేని కోడలు వర్సెస్ సమంత రూత్ ప్రభు.. నెటిజన్లు షాకింగ్ కామెంట్స్!
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో గౌ|| భారత ప్రధాని శ్రీ @narendramodi గారితో ఉప ముఖ్యమంత్రి @PawanKalyan.#InternationalYogaDay #YogaForOneEarthOneHealth #YogaAndhra2025 pic.twitter.com/doRb2zbT24
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) June 21, 2025
పబ్లిసిటీ కోసం పాకులాడే జాతి రత్నాలు pic.twitter.com/t9ywJB06E1
— రామ్ (@ysj_45) June 21, 2025