Beggar Hits
ఎంటర్‌టైన్మెంట్, లేటెస్ట్ న్యూస్

Kuberaa: ‘కుబేర’కు ముందు సూపర్ డూపర్ హిట్టైన ‘బిచ్చగాళ్ల పాత్ర’ సినిమాలు ఇవే

Kuberaa: ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘కుబేర’ మూవీ (Kuberaa) మంచి పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో బిచ్చగాడి (Beggar) పాత్రలో నటించిన తమిళ స్టార్ హీరో ధనుష్‌ (Dhanush) అందరినీ మెప్పించాడు. అన్ని వర్గాల ప్రశంసలు అందుకుంటున్నాడు. ధనుష్ నటన వేరే లెవల్‌లో ఉందని, పాత్రలో లీనమైపోయి నటించిన అతడికి ఈసారి జాతీయ అవార్డు దక్కడం ఖాయమంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక, ఈ సినిమాకు (Kuberaa) దర్శకత్వం వహించిన శేఖర్ కమ్ముల, హీరోయిన్ రష్మిక మందన్నా, కీలక పాత్రలో నటించిన నాగార్జునతో పాటు ఇతర తారాగణం, ఇతర సిబ్బందిపై ప్రసంశల జల్లు కురుస్తోంది. అయితే, వెండి తెరపై హీరో బిచ్చగాడి పాత్రలో నటించి మెప్పించడం ఇదే తొలిసారి కాదు. కుబేర కంటే ముందు, పలువురు సూపర్ స్టార్ హీరోలు బిచ్చగాళ్లుగా నటించిన ఇండస్ట్రీ హిట్‌లు కొట్టారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ సునామీ సృష్టించారు. కుబేర హిట్ సాధించిన వేళ, హీరోలు బెగ్గర్ పాత్రల్లో నటించిన టాప్-5 ఇండియన్ మూవీస్‌ను ఒకసారి గుర్తుచేసుకుందాం..

బిచ్చగాడు
2016లో రిలీజ్ అయిన తమిళ మూవీ ‘పిచైకారన్’ సంచలన హిట్ అందుకుంది. తెలుగులో ‘బిచ్చగాడు’ పేరిట విడుదలైంది. డైరెక్టర్ శశి ఈ సినిమా కథను రచించి దర్శకత్వం వహించగా, భిక్షాటన చేసే వ్యక్తి పాత్రలో తమిళ నటుడు విజయ్ ఆంటోనీ నటించాడు. తన నటవిశ్వరూపం చూపించాడు. ఈ సినిమాలో సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి అయిన విజయ్, ప్రమాదవశాత్తూ తన తల్లి కోమాలోకి వెళ్తే, ఆమెను కాపాడుకునేందుకు 48 రోజులపాటు బిచ్చగాడిగా దీక్ష చేపట్టి, సంపాదించిన ఆస్తి మొత్తం దేవుడికి ఇవ్వాలని ఓ స్వామిజీ సలహా ఇవ్వడంతో విజయ్ పాటిస్తాడు. వీధుల్లోకి వచ్చి అడుక్కుంటూ జీవనం సాగిస్తాడు. తాను ఎవరనే విషయం ఎవరికీ చెప్పకుండా దీక్ష చేపట్టాలనే నిబంధన, తల్లి సెంటిమెంట్ ప్రతి ఒక్కరి హృదయాన్ని బలంగా తాకుతాయి. ఒక సంపన్న వ్యక్తి వీధుల్లోకి వచ్చి భిక్షాటన చేస్తూ బతికితే జీవితం ఏవిధంగా ఉంటుందో కళ్లకు కట్టినట్టు ఈ సినిమాలో చూపించారు. ఈ మూవీలో అద్భుత నటనకు విజయ్ ఆంటోనీ పాపులారిటీ ఒక రేంజ్‌లో పెరిగిపోయింది. విమర్శకులు సైతం అదరహో అంటూ ప్రశంసలు కురిపించారు.

Read this- Wife Marriage: దగ్గరుండి భార్యకు పెళ్లి చేసిన భర్త.. అంతపెద్ద కారణం ఏంటంటే?

బ్లడీ బెగ్గర్
‘బ్లడీ బెగ్గర్’ 2024లో విడుదలైన తమిళ కామెడీ సినిమా. కవిన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగులో కూడా ‘బ్లడీ బెగ్గర్’ పేరిట విడుదలైంది. తొలి సినిమానే అయినప్పటికీ దర్శకుడు శివబాలన్ ముత్తుకుమార్ అద్భుతంగా దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించిన కవిన్ ఒక పేరులేని సోమరిపోతు బిచ్చగాడిగా నటించాడు. భిక్షాటనలో ఆనందాన్ని ఆస్వాదిస్తూ నవ్వులు పూయిస్తుంటాడు. అయితే, ఒక సంపన్ను కుటుంబం నిర్వహించిన విందులో పాల్గొనేందుకు వెళ్లి, వారి చీకటి రహస్యాలను తెలుసుకుంటాడు. అక్కడి నుంచి కథ మరో హాస్యాస్పద మలుపు తిరుగుతుంది. కవిన్‌తో పాటు రాధా రవి, రెడిన్ కింగ్స్లీ, పదమ్ వేణు కుమార్, పృథ్వీ రాజ్, సలీమా, ప్రియదర్శిని రాజ్‌కుమార్, సునీల్ సుఖద తదితర నటులు మెప్పించారు. ఈ మూవీకి నెల్సన్ దిలీప్‌కుమార్ నిర్మాతగా వ్యవహరించాడు.

ముత్తు
1995లో బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన ‘ముత్తు’ మూవీలో సూపర్ స్టార్ రజనీ కాంత్ ‘బిచ్చగాడి’ పాత్రలో నటించి ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకున్నాడు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజనీకాంత్ తండ్రిగా, కొడుకుగా ద్విపాత్రాభినయం చేశాడు. ఒక జమీందారు, అతడి డ్రైవర్‌ (కొడుకుగా రజనీ కాంత్) మధ్య స్నేహం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. డ్రైవర్ తండ్రి (రజనీ కాంత్) గతంలో జమీందారు అయినప్పటికీ, బిచ్చగాడిలా ఎందుకు బతుకుతున్నాడనే నేపథ్యంలో సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. బిచ్చగాడి పాత్రలో రజనీకాంత్ శెభాష్ అనిపించేలా మెప్పించాడు. ఈ మూవీలో మీనా, శరత్ బాబు, వడివేలు, రాధా రవి, ఇతరులు నటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా అప్పట్లో ఒక ఊపుఊపింది. కలెక్షన్ల సునామీ సృష్టించింది. తెలుగులో కూడా ముత్తు పేరిట విడుదలైన ఈ సినిమాలో పాటలు ఇప్పటికే వినిపిస్తూనే ఉంటాయి.

Read this- Rishabh Pant: పంత్ సెన్సేషనల్ బ్యాటింగ్.. ధోనీ రికార్డులు బద్దలు

ట్రాఫిక్ సిగ్నల్
‘ట్రాఫిక్ సిగ్నల్’ ఇది హిందీ సినిమా. 2007లో విడుదలైన ఈ మూవీలో కునాల్ ఖేము, నీతు చంద్ర, రణ్‌వీర్ షోరే, కొంకోన సేన్ శర్మ కీలక పాత్రల్లో నటించారు. వాహనదారులను లక్ష్యంగా చేసుకుని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద, నగరంలో రద్దీగా ఉంటే ఇతర ప్రదేశాల్లో భిక్షాటన చేస్తుంటారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద అడుక్కునే వారి పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా ఈ సినిమాలో చూపించారు. మధుర్ భండార్కర్ రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రెండు జాతీయ అవార్డులు దక్కాయి. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్‌ పురస్కారాలు వరించాయి.

ఒట్ట నానయం
‘ఒట్ట నానయం’ మలయాళ మూవీ. సురేష్ కన్నన్ దర్శకత్వం వహించిన 2005లో రిలీజ్ అవ్వగా, దిను డెన్నిస్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించి అదరగొట్టారు. ఈ సినిమాలో హీరో తల్లి అనారోగ్యానికి గురవుతుంది. తన తల్లికి ఆపరేషన్ చేయించడానికి అవసరమైన డబ్బు సంపాదించడానికి హీరో భిక్షాటన చేయాలని నిర్ణయించుకుంటాడు. నిజమైన పేదవాడి జీవితం ఏవిధంగా ఉంటుంది, బిచ్చగాళ్ల జీవితాలు, అణగారిన వర్గాల దోపిడీ, బెగ్గింగ్ మాఫియాలను కళ్లకు కట్టినట్టుగా ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో నటనకు దిను డెన్సిస్‌కు మంచి పేరు వచ్చింది.

Read this- Viral News: కోడలు పారిపోయిందన్నారు.. దర్యాప్తులో సంచలనం!

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?