Mineral Water Plant Business: ఈ కాలంలో నీళ్లు అంటేనే పెద్ద వ్యాపారం అయిపోయింది. ఎక్కువమంది ప్రజలు మినరల్ వాటర్(Mineral Water)కు ఆకర్షితులు అవ్వడంతో మినరల్ వాటర్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. మినరల్ వాటర్ తాగే మనిషుల సంఖ్య అదికంగా ఉండడంతో ప్రతి వీధిలో పుట్టగొడుగుల వాటర్ ప్లాంట్లు(Water Plants) పుట్టుకొస్తున్నాయి. ఇక పలు ప్రాంతాల్లో మాత్రం బోరు, నల్లా నీటి శుద్ది చేసి మినరల్ వాటర్‌గా అమ్ముతూ మినరల్ వాటర్ ప్లాంట్ వ్యాపారస్తులు సొమ్ము చేసుకుంటున్నారు. మినరల్ వాటర్ తాగని మనిషి లేనందునా పోటా పోటీనా ప్రతి వీధికి మినరల్ వాటర్ ప్లాంట్(Mineral Water Plants)ను ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తూ వ్యాపారస్తులు సొమ్ముచేసుకుంటున్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ల పర్మిషన్లపై కూడా అధికారులు కన్నెత్తి చూడరు. మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే స్థానిక అధికారుల పర్మిషన్ తప్పనిసరి. కాగా అధికారుల నిర్లక్ష్యం వల్ల వ్యాపారస్తులు ఇష్టానుసారంగా మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే
ఒక వ్యాపారి మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలంటే తప్పనిససరిగా ఐఎస్ఐ(ISI) మార్క్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ వాటర్ ప్లాంట్ నడిపించే వ్యాపారి మినరల్ వాటర్ ప్లాంట్ పై అవగాహన కలిగి ఉన్న వ్యక్తులు తప్పనిసరిగా ఉండాలి. నీటిలో మినరల్స్ ఎంత శాతం ఉన్నాయో ఫార్మాసిస్(Pharmosiss) నిర్దారణ చేయాల్సి ఉంటుంది. ఫిల్టర్ చేసిన నీటిని బయటికి అమ్మాలంటే అందులో సరైన మొతాదులా లవణాలు, ఖనిజాలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ప్లాట్‌లో పని చేసే ఉద్యోగినికి, వ్యాపారస్తుడికి ఎలాంటి రోగాలు లేకుండా ఉండేలా చూస్తూ, ఏడాదికి రెండుసార్లు వైద్య పరీక్షలు(Medical Test) చేయించాలి.
అడుగంటి పోతున్న భూగర్బ జలాలు
నీటి వ్యాపారం అధికంగా మారిపోవడంతో భూగర్బ జలాలు(Ground Water) అడుగంటి పోతున్నాయి. వాటర్ ప్లాంట్ లేని ఊరు లేదు. ఆ వాటర్ ప్లాంట్ నడిపేందుకు బోర్ల నుండి నీటిని బాగా వాడుకోవాల్సి వస్తుంది. మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల100 శాతం నీరు ఉంటే అందులో 50శాతం నీరు ఫిల్టర్(Water Filter) అయి మినరల్ వాటర్‌గా తయారవుతుంది. మిగతా 50 శాతం నీరు కెమికల్(Chemical)తో కూడుకొని వృదాగా వదిలేస్తారు. ఉదాహరణకు బోరు నుండి ఒక లీటర్ వాటర్‌ను తీస్తే అందులో ఫిల్టర్ చేసిన వాటర్ 500 గ్రాములు కాగా మిగతా 500 గ్రాముల వాటర్ వృదాగా బయటికి పంపించివేస్తారు. భూగర్బ జలాలు అడుగంటి పోవడంతో బోర్లనుండి నీరు రాక చెరువులు(Lakes), కుంటల నుండి నీటిని ట్యాంకర్ల ద్వారా తీసుకువచ్చి వాటర్ ప్లాంట్‌లకు వాడుతారు.
Also Read: Pakistan: పాక్ అమ్ములపొదిలోకి అధునాతన అస్త్రం.. భారత్ వద్ద కూడా లేదు
మినరల్ వాటర్ తాగితే ఈ సమస్యల భారిన పడాల్సిందే
ఇప్పుడు ప్రతి ఒక్కరూ మినరల్ వాటర్‌నే ఎక్కువగా తాగుతుంటారు. ప్రజలు ప్రయాణించేప్పుడు, ఇంటి అవసరాలకు, ఎలాంటి కార్యాలు చేసినా మినరల్ వాటర్ వాడుతున్నారు. మినరల్ వాటర్ లో పోటాషియం, మెగ్నేషియం, కాల్షియం వంటి అవసరమైన ఖనిజాలు ఉంటాయి. మంచి రుచికరంగా నీరు ఉండాలని వీటిని మొతాదును మించి వాడుతారు. మొతాదును మించి కెమికల్స్‌ను వాడడం వల్ల నీరు రుచికరంగా ఉంటాయి కాని మనిషి ఆరోగ్యం మాత్రం నాశనం(Health Risk) కావడం ఖాయం. ఈ నిటిని తాగిన మనిషి శరీరంలో అనేక సమస్యలు వస్తుంటాయి. వీటి వల్ల మనిషి కండరాల తిమ్మిరి, అలసట, ఇతర ఆరోగ్య సమస్యలు(Health Problems) వస్తాయి. తాగే నీటిలో ఉప్పు, కాల్షియం, సోడియం, బోరాన్ వంటి మూలకాలు ఉండాలి. అయితే ఈ అన్‌బ్రాండెడ్ కార్బా నీటిలో అలాంటివి ఉండవు. ఈ తరహా నీటిని తాగడం వల్ల నీటి ద్వారా వచ్చే వ్యాధులు, బి12 లోపం, కిడ్నీ ఎఫెక్ట్, లివర్ సైడ్ ఎఫెక్ట్, క్యాన్సర్ తదితర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
ప్లాంట్లను నియంత్రించాలి : సాయిబాబా
వాటర్ ప్లాంట్ల వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి మా కాలనీలో అడుగడుగుకు వాటర్ ప్లాంట్‌లు ఉన్నాయి. వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు నిరంతరాయంగా బోర్ల నుంచి నీరును డ్రా చేయడంతో పక్కన ఉన్న బోరు బావుల్లో నీరు అడుగంటుతుంది. వేసవి(Sumer)కాలంలో అయితే పూర్తిగా పనిచేయడం లేదు. ఇటు బోరు బావులు పనిచేయకపోవడం, ఆటో మిషన్ భగీరథ(Mishan Bhagiradha)ని రాకపోవడంతో తీవ్ర నీటి ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తోంది. సంబంధిత అధికారులు ఇష్టానుసారంగా వాటర్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలి.
చర్యలు తీసుకుంటాం: నాగిరెడ్డి, మున్సిపాలిటీ కమిషనర్
వాటర్ ప్లాంట్లో ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి. అనుమతి లేని వాటర్ ప్లాంట్లను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. సంబంధిత అధికారుల ద్వారా నిబంధన ప్రకారం నీటిలో లవణాలు ఉన్నాయా? లేదా పరిశీలన జరుపుతాం అని మడ్చల్ మున్సిపల్ కిమీషనర్ అన్నారు.
Also Read: Kavitha: కవితకు మద్దతుపై.. గులాబీ నేతల డైలామా!