Samantha on Ye Maaya Chesave Promotions
ఎంటర్‌టైన్మెంట్

Samantha: చైతూతో కలిసి ప్రమోషన్స్.. సమంత షాకింగ్ రియాక్షన్!

Samantha: కొన్ని రోజులుగా సమంత, నాగ చైతన్య (Naga Chaitanya) మళ్లీ కలవబోతున్నారనేలా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. వారిద్దరూ కలిసి నటించిన ‘ఏ మాయ చేసావే’ (Ye Maaya Chesave) మూవీ జూలై 18న రీ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో వారిద్దరూ కలిసి సినిమా ప్రమోషన్స్ నిర్వహించనున్నారని, ఈ ప్రమోషన్స్‌లో వారిద్దరూ ఒకరినొకరు ఎలా ఫేస్ చేస్తారో? అంటూ ఒకటే వార్తలు. ఎందుకంటే, ఈ మధ్య రీ రిలీజ్ అవుతున్న చిత్రాలకు, ఆ సినిమాల్లో నటించిన వారంతా ప్రమోషన్స్ చేస్తున్నారు. కొందరు పబ్లిక్ ఫంక్షన్స్ ఏర్పాటు చేస్తుంటే, కొందరు మాత్రం స్పెషల్ ఇంటర్వ్యూలతో సరిపెడుతున్నారు. రీసెంట్‌గా రీ రిలీజైన ‘అందాల రాక్షసి’ చిత్రానికి ఆ సినిమాలో నటించిన లావణ్య త్రిపాఠి, రాహుల్, నవీన్ చంద్ర స్పెషల్ ఇంటర్వ్యూలు ఇచ్చి సినిమాను ప్రమోట్ చేశారు. ఆ సినిమా రీ రిలీజ్‌లో కూడా చాలా మంచి ఆదరణను రాబట్టుకుంది.

Also Read- Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ విడుదల తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే?

సేమ్ టు సేమ్ ఇప్పడు రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ‘ఏ మాయ చేసావే’ మూవీ విషయంలోనూ జరుగుతుందని అక్కినేని, సమంత అభిమానులు భావిస్తున్నారు. అందులోనూ సమంత నటించిన తొలి తెలుగు చిత్రమిది. అలాగే చైతూ, సమంత విడిపోయినా.. వారిద్దరూ లవ్‌లో పడింది ఈ సినిమా టైమ్‌లోనే అని అందరికీ తెలుసు. ఫస్ట్ లవ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది కాబట్టి.. కచ్చితంగా ఇద్దరూ ప్రమోషన్స్‌లో పాల్గొంటారని భావిస్తున్న వారందరికీ సమంత షాక్ ఇచ్చింది. చైతూతో కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొనే సమస్యే లేదని ఖరాఖండీగా చెప్పేసింది. దీంతో అక్కినేని, సమంత ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.

సమంత, చైతూ విడిపోయినప్పటికీ.. ఆ జంట తీసుకున్న నిర్ణయం విషయంలో ఇప్పటికీ కొందరు అభిమానులు నిరాశలోనే ఉన్నారు. చైతూ మళ్లీ పెళ్లి చేసుకునేంత వరకు.. వారిద్దరూ ఏదో రకంగా మళ్లీ కలవాలని కోరుకున్నవారే ఎక్కువ. కానీ, శోభితను చైతూ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఉన్న ఆ కాస్త ఆశలు కూడా ఫ్యాన్స్‌కు ఆవిరైపోయాయి. అలాగే సమంత కూడా రెండో పెళ్లికి సిద్ధమైనట్లుగా రోజూ సోషల్ మీడియాలో ఒకటే వార్తలు. ఈ నేపథ్యంలో వారిద్దరూ కలిసి నటించిన సినిమా కోసం ప్రమోషన్స్‌లో పాల్గొంటారనే వార్త రాగానే.. ఇరువురి అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. కానీ సమంత ఆన్సర్ విన్నాక.. మరోసారి వారికి తీవ్ర నిరాశ తప్పలేదు.

Also Read- Klinkara Birthday: మెగా ఫ్యాన్స్ కోసం.. క్లీంకార ఫేస్‌ను రివీల్ చేసిన ఉపాసన

ఇంతకీ సమంత ఏమందంటే.. ‘‘ఆ సినిమాను ప్రమోట్ చేసే ఉద్దేశం నాకు లేదు. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎవరు పుట్టిస్తున్నారో నాకు తెలియదు. బహుశా, మమ్మల్ని మళ్లీ కలిసి చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నట్లున్నారు. కాకపోతే, మేము వారి అంచనాలకు అనుగుణంగా మాత్రం జీవించలేము’’ అని తెలిపింది. ఆమె చెప్పింది విన్న తర్వాత.. మళ్లీ చైతూని కలవాలని సమంత కోరుకోవడం లేదనేది స్పష్టమైంది. ఇది ఫ్యాన్స్ కూడా గమనిస్తే బాగుంటుంది. ‘ఏ మాయ చేసావే’ విషయానికి వస్తే.. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రమిది. తమిళ హిట్ ‘విన్నైతాండి వరువాయా’కు తెలుగు రీమేక్‌గా రూపొందింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!