Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) జంటగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). ఈ సినిమా విడుదల విషయంలో ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతగా నిరాశలో ఉన్నారో తెలియంది కాదు. ఈ మధ్యకాలంలో ఏ సినిమాకు లేని విధంగా లెక్కలేనన్నీ సార్లు ఈ సినిమా వాయిదా పడింది. షూటింగ్ ఆలస్యం కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా, షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా అనూహ్యంగా వాయిదా పడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఈసారి పక్కాగా వస్తున్నాం.. అనేలా మేకర్స్ రిలీజ్ డేట్ (Hari Hara Veera Mallu Release Date)ని ప్రకటించారు. ‘హరి హర వీరమల్లు’ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 24న విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.
Also Read- Karuppu: కమెడియన్ దర్శకత్వంలో సూర్య మూవీ.. టైటిల్ లుక్ ఊచకోతే!
విడుదల తేదీ తెలుపుతూ విడుదల చేసిన పోస్టర్‌లో పవర్ స్టార్ ఫవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. విలన్‌గా చేస్తున్న బాబీ డియోల్‌ని కూడా ఈసారి రివీల్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై బారీగా అంచనాలను పెంచింది. ఆ విషయంలో డౌటే లేదు. అంతా ఈ సినిమా కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఏదో ఒక కారణంతో సినిమా వాయిదా పడుతూనే ఉంది.
Also Read- Ayan Mukerji: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య సంఘర్షణ వల్లే.. ‘వార్ 2’ ఆలస్యం!
వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ ఎక్కడా లేని ప్రాబ్లమ్స్ అన్నీ ఈ సినిమాకే ఏర్పడటంతో.. వాయిదాల మీద వాయిదాలు పడుతూ.. ఫైనల్‌గా జూలై 24న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. మరి ఈ డేట్‌కి అయినా పక్కాగా విడుదల చేస్తారో.. లేదంటే ఆ టైమ్ మళ్లీ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి.. వాయిదా వేస్తారో. ఈసారి వాయిదా పడితే మాత్రం.. ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను మరిచిపోతారు. ఇక నిర్మాత విడుదల చేస్తున్నామని చెప్పినా కూడా నమ్మరు. మరి నిర్మాత రత్నం ఏం చేస్తారో.. చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. నెల రోజుల పాటు సమయం దొరికింది కాబట్టి.. ప్రమోషన్స్‌లో దూకుడు పెంచి, ప్రమోషనల్ కంటెంట్‌తో మరింతగా సినిమాపై అంచనాలు పెంచేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
One fights for Power.
One fights for Dharma.
The clash of legacies begins. 🔥Witness the Battle for truth, faith and freedom 𝐈𝐧 𝐂𝐢𝐧𝐞𝐦𝐚𝐬 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐉𝐮𝐥𝐲 𝟐𝟒, 𝟐𝟎𝟐𝟓 ⚔️🔥
A Historic Experience Awaits ❤️#HariHaraVeeraMallu 🏹#HHVMonJuly24th #HHVM… pic.twitter.com/WHLUZWtavA
— Hari Hara Veera Mallu (@HHVMFilm) June 21, 2025
స్టార్ ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, పలువురు నోటెడ్ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు