Gonne Prakash Rao: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం నడిచిందని ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశ్ రావు (Gonne Prakash Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడోసారి అధికారంలోకి రావడానికే ఈ చర్యకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. కేటీఆర్, (KCR) సంతోశ్ రావు (Santhosh Ra0) కలిసి కవిత (Kavitha) ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్నారు. ఈ కేసును సీబీఐకి (CBI) అప్పగించాలని డిమాండ్ చేశారు. అప్పుడే అసలు సూత్రధారుల బండారం బట్టబయలు అవుతుందన్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని సిట్ కార్యాలయానికి వచ్చిన ఆయన తన వాంగ్మూలాన్ని విచారణ అధికారులకు ఇచ్చారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎలాగైనా సరే అధికారాన్ని మూడోసారి చేజిక్కించుకోవాలని కేసీఆర్ వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులతోపాటు పారిశ్రామిక వేత్తల ఫోన్లను ట్యాప్ (Phone Tapping) చేయించారన్నారు. చివరకు జర్నలిస్టులు, సినిమా వాళ్లను కూడా వదిలి పెట్టలేదన్నారు. నిజానికి 2015 నుంచే ఫోన్ల ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం నడుస్తూ వచ్చిందన్నారు. ఓటుకు నోటు వ్యవహారం వెలుగు చూసినప్పుడే కేసీఆర్ ఫోన్లు ట్యాపింగ్ (Phone Tapping) చేస్తున్న విషయం బయట పడిందన్నారు. అప్పట్లో కేసీఆర్ (KCR) మీడియా సమావేశం పెట్టి మరీ పైలట్ రోహిత్ రెడ్డి, నంద కుమార్, సింహాయాజీ స్వామి, నంద కుమార్‌లు మాట్లాడిన మాటల ఆడియో టేపులను వినిపించిన విషయాన్ని గుర్తు చేశారు.
Also Read: Agricultural Workers: 4 నెలలుగా ఎదురు చూస్తున్న ఉపాధి కూలీలు
ట్యాప్ చేయించక పోతే ఈ ఆడియో టేపులు కేసీఆర్‌కు ఎలా అందాయని వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కూడా ఈ బాగోతాన్ని నడిపించారని చెప్పారు. తన ఫోన్ ట్యాప్ అయిన విషయం సిట్ అధికారుల ద్వారా తెలిసిందన్నారు. తాను మాట్లాడిన ఫోన్ నెంబర్లతోపాటు పదిహేను రోజుల డేటాను పోలీసులు చూపించినట్టు చెప్పారు. తన ప్రైవసీకి ఎలా భంగం కలిగిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ ఆదేశాలు లేనిదే ఇదంతా జరగదని అన్నారు.
కవిత ఫోన్లు కూడా ట్యాప్ చేయించారు
మాజీ మంత్రి కేటీఆర్, (KTR) (Santhosh Ra0) సంతోశ్ రావులు కలిసి కవిత (Kavitha) ఫోన్లను కూడా ట్యాప్ చేయించారని గోనె ప్రకాశ్ రావు (Gonne Prakash Rao) వ్యాఖ్యానించారు. ప్రభాకర్ రావును (Prabhakar Rao) ఎట్టి పరిస్థితుల్లో కస్టడీకి తీసుకుని విచారించాలన్నారు. (CBI) సీబీఐకి బదిలీ చేస్తే ఈ వ్యవహారం వెనక ఉన్న పెద్దలు ఎవరన్నది బయట పడుతుందని చెప్పారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా (Phone Tapping) ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మేమేమైనా టెర్రరిస్టులమా?
వాంగ్మూలం ఇవ్వడానికి సిట్ కార్యాలయానికి వచ్చిన మల్కాజిగిరి కాంగ్రెస్ నాయకుడు కపిల్ మీడియాతో మాట్లాడుతూ, మేమేమైనా టెర్రరిస్టులమా? మా ఫోన్లు ట్యాప్ చేశారంటూ వ్యాఖ్యానించారు. సిట్ అధికారుల ద్వారా తన ఫోన్ ట్యాప్ అయినట్టు తెలిసి స్టేట్మెంట్ ఇవ్వడానికి వచ్చానన్నారు. తాను ఎన్నికల సమయంలో మల్కాజిగిరి, మెదక్ నియోజకవర్గాల్లో పని చేసినప్పుడు ఫోన్లను ట్యాప్ (Phone Tapping) చేశారన్నారు. బీఆర్ఎస్ (Brs) ప్రభుత్వం అధికారం కోసం ఇలా చేయడం హేయమైన చర్య అని అంటూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
బాల్క సుమన్ అనుచరుల ఫోన్లు సైతం
చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పని చేసిన బాల్క సుమన్ (Balka Suman) అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని సిట్ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. నియోజకవర్గంలోని రామకృష్ణాపూర్‌కు చెందిన అబ్దుల్ అజీజ్, మందమర్రికి చెందిన మహ్మద్ ముజాహిద్‌లు (Balka Suman) బాల్క సుమన్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. వీరి ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు వెల్లడి కావడంతో సిట్ అధికారులు వీరి నుంచి కూడా స్టేట్మెంట్లు తీసుకున్నట్టు తెలిసింది. ఇక, కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) వద్ద పని చేస్తున్న సిబ్బంది, సన్నిహితుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు సమాచారం. ఈ క్రమంలో వీరి నుంచి కూడా సిట్ (Sit) అధికారులు వాంగ్మూలాలు తీసుకోనున్నట్టు సమాచారం.