Kavitha(image credit: twitter)
Politics

Kavitha: కవితకు మద్దతుపై.. గులాబీ నేతల డైలామా!

Kavitha: ఎమ్మెల్సీ కవితతో వెళ్తే తమ రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుంది. పార్టీలో ఉంటే ఎలా ఉంటుందనేది ఇప్పుడు గులాబీ నేతల్లో డైలామా నెలకొన్నది. ఒక వేళ కవిత (Kavitha) ప్రోగ్రాంకు అటెండ్ అయితే మళ్లీ పార్టీ కార్యక్రమాలకు రానిస్తారా లేదా, ఆ తర్వాత తమ పరిస్థితి ఎంటనేది కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇంతకు ముందు ఆమె వెంట నడిచినవారు కూడా తాజాగా కవిత (Kavitha) నిర్వహించిన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని సమాచారం. పార్టీలోనే కొనసాగితే తమకు పదవులు వస్తాయని భావిస్తున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ
గులాబీ పార్టీ ఎమ్మెల్సీగా కవిత (Kavitha) కొనసాగుతున్నారు. అయినప్పటికీ తెలంగాణ జాగృతి కార్యక్రమాలను స్పీడప్ చేశారు. ఒక వైపు యువతను జాగృతిలో చేరికలు, మరోవైపు బీసీ నినాదంతో ముందుకెళ్తుంది. ఇంకో వైపు పోలవరం, బనకచర్ల (Banakacharla) అంశాలపైనా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ముందుకెళ్తుంది. ప్రతీ అంశాన్ని అస్త్రంగా చేసుకొని నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణతో పార్టీ కన్న ఒక అడుగు ముందుంటుంది. పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలను సైతం కొన్ని సమాయాల్లో హైజక్ చేస్తుందా? అనే ధోరణిలో ముందుగానే ప్రోగ్రాంలు చేపడుతుంది.

రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు ఉండేలా పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నట్లు ఆమె తీసుకుంటున్న కార్యక్రమాలు స్పష్టం చేస్తున్నారు. తను చేపట్టే కార్యక్రమాలకు మద్దతుగా వచ్చేవారితోనూ సంప్రదింపులు చేస్తున్నారు. వారితోనూ ఐక్యకార్యచరణ చేపట్టేందుకు సైతం సిద్ధమవుతున్నట్లు సమాచారం. పార్టీ నేతలు సైతం కవిత వద్దకు వచ్చేవారు. పనులు సైతం చేయించుకునేవారు. అయితే, ఈ మధ్యకాలంలో కొంతమంది దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతుంది. నిత్యం ఆమె వద్దకు వెళ్లేవారు సైతం ఈ మధ్యకాలంలో కనిపించడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎందుకు అనేది ఇప్పుడు చర్చకుదారితీసింది.

 Also ReadCM Revanth Reddy: వివాదం తెంచేందుకు.. నాలుగు రోజులైన సరే!

బీఆర్ఎస్ అనుబంధ సంస్థగా పేర్కొంటున్నా
బీఆర్ఎస్ (BRS) పార్టీకి తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థ అని కవిత (Kavitha) పేర్కొంటున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలోనూ అనుబంధ సంస్థగా పనిచేసిందని తెలిపారు. అయితే, ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్‌పై కవిత (Kavitha) పరోక్షంగా విమర్శలు చేయడంతో నేతలు ఆలోచనలో పడినట్లు సమాచారం. పార్టీకి ఆమెకు మధ్య అంతరం ఉన్నదా? లేకుంటే విమర్శలు చేయడానికి కారణం ఏమిటి? తప్పులను ఎత్తిచూపుతున్నారా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది హాట్ టాపిక్ అయింది.

కవిత (Kavitha) సైతం జాగృతి తరుపున కార్యక్రమాలు చేపట్టడం, పార్టీ తరుపున నిర్వహించకపోవడంతో గులాబీ నేతలు దూరంగా ఉంటున్నారని సమాచారం. కవిత (Kavitha) వెంట వెళ్తే తమ రాజకీయ భవిష్యత్ ఏంటనేది కొంతమంది నేతలు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది. అందుకే ఇంతకు ముందు కవిత (Kavitha) ప్రోగ్రాంలకు యాక్టివ్‌గా వెళ్లేవారు సైతం వెళ్లడం లేదని సమాచారం. పార్టీలో కేటీఆర్, (KCR) హరీశ్ రావు (Harish Rao) కీలకంగా ఉన్నారని రాబోయేది మళ్లీ గులాబీ ప్రభుత్వం అని అలాంటప్పుడు పదవులు వచ్చే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. కవిత (Kavitha) ప్రోగ్రాంలో పాల్గొంటే నష్టం జరుగుతుందని కొంతమంది దూరంగా ఉంటున్నారని సమాచారం. రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని జాగృతి కార్యక్రమాల్లో పాల్గొనట్లేదనే ప్రచారం జరుగుతున్నది.

నియోజకవర్గాల్లోనూ దూరం?
కవిత (Kavitha) రాష్ట్రంలోని ఏ నియోజకవర్గానికి వెళ్లినా బీఆర్ఎస్ (BRS) నేతలు ఘనస్వాగతం పలికేవారు. ఆమె పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేసేవారు. అయితే, ఈ మధ్యకాలంలో ఆమె పర్యటనలకు వెళ్తే కేవలం జాగృతి నేతలు, బీసీ పూలే ఫ్రంట్‌కు చెందిన నాయకులు మాత్రమే స్వాగతం పలుకుతున్నారనే ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఆమె చేపట్టే కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారనేది విస్తృత ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలో ఆమె వెంట నడిచేందుకు బీఆర్ఎస్ (BRS) పార్టీ క్యాడర్ సైతం వెనుకంజ వేస్తున్నారనే ప్రచారం.

బీఆర్ఎస్ పార్టీ ఆరా
జాగృతి పేరుతో కవిత (Kavitha) చేపట్టే ప్రోగ్రాంలపై బీఆర్ఎస్ (BRS) పార్టీ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆమె చేపట్టే కార్యక్రమాలకు బీఆర్ఎస్ (BRS) నేతలు ఎవరు వెళ్తున్నారు. వారు ఏ హోదాలో పనిచేసిన వారు, ఇప్పుడు పార్టీలో వారికి ఉన్న పదవి ఏంటి? వారు వెళ్లడానికి గల కారణాలు? తదితర అంశాలను క్షుణ్నంగా సేకరిస్తున్నట్లు సమాచారం. కీలక నేతలు వెళ్తే వారి వివరాలను సైతం ఎప్పకటిప్పుడు సేకరిస్తున్నట్లు సమాచారం. పార్టీ ఆరా తీస్తున్న విషయం తెలియడంతో కొంతమంది నేతలు కవిత చేపట్టే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతుంది. కొంతమంది నేతలు కవిత వద్దకు, మళ్లీ పార్టీ కార్యక్రమాలకు వస్తుండటంతో వారిపై సైతం ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం.

ఈ తరుణంలో సీనియర్ నేతలు, పార్టీలో యాక్టివ్‌గా పనిచేసే వారు అలర్టై భవన్‌కు మాత్రమే వస్తున్నారని సమాచారం. గతంలో కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లుగా పనిచేసిన వారు సైతం కవిత వద్ద యాక్టివ్‌గా పనిచేసినవారు ఉన్నారు. ఆమె చొరవతో పలువురికి పార్టీ పదవులు, కార్పొరేషన్ పదవులను పార్టీ అధిష్టానం అప్పగించింది. అయితే, ఈ మధ్య కాలంలో ఆమె చేపట్టే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం ఊపందుకున్నది.

 Also Read: Kaushik Reddy Arrest: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్.. ఎయిర్ పోర్టులో పట్టుకున్న పోలీసులు

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?