England vs India: భారత్-ఇంగ్లండ్ మధ్య లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానం వేదికగా శుక్రవారం (జూన్ 20) ప్రారంభమైన తొలి టెస్టులో (England vs India) భారత బ్యాటర్లు కదం తొక్కారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 92 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినప్పటికీ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌తో కలిసి ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. తొలి రోజు సెకండ్ సెషన్ ముగిసే సమయానికి 152 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ సెంచరీ సాధించాడు. 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తన ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఇక, గిల్ 74 బంతులు ఎదుర్కొని 58 పరుగులు సాధించాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు ఉన్నాయి. ఓపెనర్ కేఎల్ రాహుల్ 42 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద, అరంగేట్ర ఆటగాడు సాయి సుదర్శన్ డకౌట్ అయినప్పటికీ మూడవ వికెట్‌కు జైస్వాల్-గిల్ కలిసి 123 పరుగుల (సెకండ్ ఇన్నింగ్స్ ముగింపు సమయానికి) భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రిడాన్ కర్సేకి 2 వికెట్లు పడ్డాయి. తొలి రోజు సెకండ్ సెషన్ ముగిసే సమయానికి భారత్ స్కోరు 215/2గా ఉంది.
Read this – Iran Israel Conflict: ఇరాన్‌కు భారత్ ప్రత్యేక విజ్ఞప్తి.. వెంటనే అంగీకారం
హిస్టరీ క్రియేట్ చేసిన జైస్వాల్
లీడ్స్‌లో అద్భుత సెంచరీ సాధించిన యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ పేరిట ఒక రికార్డు నమోదయింది. ఇంగ్లండ్‌లో ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ సాధించిన 5వ భారతీయ క్రికెటర్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. జైస్వాల్ కంటే ముందు మురళీ విజయ్ (146 పరుగులు, ట్రెంట్ బ్రిడ్జ్ 2014), విజయ్ మంజ్రేకర్ హెడింగ్లీ (133 పరుగులు, 1952), సౌరవ్ గంగూలీ (131 పరుగులు, లార్డ్స్ 1996), సందీప్ పాటిల్ (129 నాటౌట్, ఓల్డ్ ట్రాఫోర్డ్ 1982), యశస్వి జైస్వాల్ (100 (బ్యాటింగ్, హెడింగ్లీ 2025) వరుస స్థానాల్లో ఉన్నారు.
టాస్ ఓడిన ఇండియా
లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా టాస్ ఓడింది. టాస్ గెలిచిన అతిథ్య ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పర్యాటక జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. భారత కాలమానం ప్రకారం, సాయంత్రం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమైంది.
ఇంగ్లంగ్ తుది జట్టు: జైస్వాల్ జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.
భారత తుది జట్టు: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
Read this – Ambani Wedding: అనంత్-రాధిక పెళ్లిపై ఆసక్తికర విషయం బయటపెట్టిన వెడ్డింగ్ డిజైనర్