Modi caste vote Ahmadabad lok sabha
జాతీయం

Ahmedabad: ఓటేసిన ప్రధాని మోదీ

  •  ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్
  • పోలింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ఓటేసిన మోదీ
  • భారీ సంఖ్యలో ఓటర్లు పాల్గొనాలని పిలుపు
  • అధిక ఓట్లు వేసి సరికొత్త రికార్డు సృష్టించాలని వినతి

Modi: ప్రధాని మోదీ గాంధీనగర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అహ్మదాబాద్ లో ఓటేశారు. మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైన కాసేపటికే ఆయన రాణీప్‌ ప్రాంతంలోని నిషాన్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. గాంధీనగర్‌ నుంచి బరిలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆ సమయంలో ప్రధానితో పాటే ఉన్నారు. అంతకుముందు సార్వత్రిక సమరం మూడో విడతలో ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొనాలని మోదీ పిలుపునిచ్చారు. కొత్త రికార్డు సృష్టించాలని కోరారు. అందరి భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం మరింత పటిష్ఠమవుతుందని పేర్కొన్నారు. పోలింగ్‌ బూత్‌ పరిసరాల్లోకి పెద్ద ఎత్తున తరలివచ్చిన తన మద్దతుదారులను ఓటేసిన అనంతరం మోదీ పలకరించారు. అభివాదం చేస్తూ ఉత్సాహపరిచారు. పెద్ద సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొనాలని మరోసారి కోరారు మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో ఇప్పటికే సూరత్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 25 సీట్లకు మంగళవారం పోలింగ్‌ జరిగింది.

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు