Ambani Wedding: భారత అపరకుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ (Mukesh Ambani), భార్య నీతా అంబానీల (Nita Ambani) ముద్దుల చిన్నకొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహం (Anant Ambani Wedding) గతేడాది జులై 12న అత్యంత వైభవంగా, విలాసవంతంగా జరిగింది. ఈ పెళ్లి గురించి మన దేశమే కాదు, ప్రపంచమంతా మాట్లాడుకుంది. భారీ మొత్తంలో ఖర్చు పెట్టి అంత గ్రాండ్‌గా ఈ వివాహ వేడుకను నిర్వహించారు. పెళ్లి వేడుకల్లో భాగంగా భారతదేశంతో పాటు యూరప్‌లోనూ కొన్ని విలాసవంతమైన వేడుకలు జరిగాయి. అత్యంత ఖరీదైన దుస్తులు, ఆభరణాలు ఎంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతేకాదు, భారతీయ, అంతర్జాతీయ ప్రముఖ కళాకారులు పెళ్లి వేడుకల్లో అదిరిపోయే ప్రదర్శనలు ఇచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న సింగర్లు రిహన్న, కేటీ పెర్రీ, జస్టిన్ బీబర్ వంటి వారు కూడా పెర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. భారతదేశంలోనే అత్యంత విలాసవంతమైన వివాహాల్లో ఒకటిగా నిలిచిన ఈ వేడుకకు, మ్యారేజ్ డిజైన్లకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఈవెంట్ డిజైనర్ ప్రెస్టన్ బెయిలీ ప్లాన్ చేశారు.
Read this- Pakistan: పాక్ అమ్ములపొదిలోకి అధునాతన అస్త్రం.. భారత్ వద్ద కూడా లేదు
జస్టిన్ బీబర్‌కు కళ్లు చెదిరే డబ్బు
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం ప్లానింగ్‌లో భాగమైన ఈవెంట్ డిజైనర్ ప్రెస్టన్ తన సన్నిహిత వ్యక్తుల వద్ద ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారని ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ కథనం పేర్కొంది. అనంత్ అంబానీ పెళ్లిలో సంగీతకారుల ప్రదర్శనకు ముకేష్ అంబానీ కుటుంబం అత్యధిక మొత్తంలో చెల్లించిందని చెప్పారు. వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన ప్రముఖ పాప్ సింగర్ జస్టిన్ బీబర్, వివాహ వేడుకలో ఇచ్చిన ప్రదర్శనకుగానూ ఏకంగా 10 మిలియన్ డాలర్లు అందుకున్నారని ప్రెస్టిన్ పేర్కొన్నారు. భారతీయ కరెన్సీలో ఈ మొత్తం రూ.86 కోట్లు పైమాటేనని వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. అయితే, ఈ కథనంపై స్పందించేందుకు జస్టిన్ బీబర్ ప్రతినిధి నిరాకరించారు.
Read this- Kuberaa Review: ధనుష్, నాగ్, రష్మికల ‘కుబేర’ ఎలా ఉందంటే..
‘‘డీజేలు కూడా ఒక మిలియన్ డాలర్ మేర వసూలు చేశారు. గ్రిఫిన్, మార్టిన్ సోల్విగ్ వంటి బ్రాండెడ్ డీజేలు భారీ డిమాండ్ పలికిన వారిలో ఉన్నారు. అనంత అంబానీ జంట పెళ్లి ముగిసిన తర్వాత అంతా నైట్‌క్లబ్‌గా మారిపోయింది’’ అని ప్రెస్టిన్ పేర్కొన్నారు. కాగా, అనంత్ అంబానీ వివాహ ప్లానింగ్‌లో భాగమైన డిజైనర్ ప్రెస్టిన్ గతంలో ఇవాంకా ట్రంప్ పెళ్లిని కూడా ప్లాన్ చేశారు. కాగా, అనంత్ అంబానీ పెళ్లికి డబ్బును మంచి నీళ్లలా ఖర్చు పెట్టిన విషయం తెలిసిందే. వివాహ వేడుకలకు సుమారుగా 600 మిలియన్ డాలర్లు (రూ.51,93 కోట్లు పైమాటే) ఖర్చు అయినట్టుగా అంచనాలు ఉన్నాయి. దంపతులు ధరించిన దుస్తులను వెర్సేస్, డోల్స్ అండ్ గబ్బానా వంటి టాప్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ కంపెనీలు తయారు చేశాయి. తరుణ్ తహిలియాని, అబు జాని సందీప్ ఖోస్లా వంటి ప్రముఖ ఇండియన్ డిజైనర్లు వీటిని రూపొందించారు. అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్‌ల ప్రీ-వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని అంబానీ ఇంట్లో అత్యంత విలాసవంతంగా జరిగాయి. ఇవాంకా ట్రంప్, హిల్లరీ క్లింటన్, బిల్ గేట్స్ వంటి అతిరథ మహారథుల మధ్య మూడు రోజుల వేడుక జరిగింది.