Rowdy Sheeter Arrest: కళ్లుకప్పి ఆడవేషంలో తిరుగుతున్న ఓ రౌడీ షీటర్ ను రాజస్థాన్ పోలీసులు (Rajasthan Police) అరెస్ట్ చేశారు. రౌడీ షీటర్ దయాశంర్ చౌరియా (35) ఓ వ్యక్తిపై దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. దీంతో పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు గత నాలుగు నెలలుగా లేడీ గెటప్ లో తిరుగుతున్నాడు. చీర, బ్లౌజ్ ధరించడంతో పాటు ఎవరికీ అనుమానం రాకుండా చేతులపై ఉన్న వెంట్రుకలను సైతం తీసేశాడు. ఎట్టకేలకు అతడి ఆచూకి కనిపెట్టిన పోలీసులు.. తాజాగా అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే?
రాజస్థాన్ జోద్ పూర్ లోని లఖరా బజార్ కు చెందని దయాశంకర్ ఫిబ్రవరిలో జరిగిన దాడిలో నిందితుడిగా ఉన్నాడు. దీంతో అరెస్ట్ చేసేందుకు అతడి ఇంటికి వెళ్లిన ప్రతీసారి పోలీసులకు లేడీ వేషంలో బుర్ఘా దరించి కనిపించేవాడు. దయాకర్ ఇంట్లో లేడని వచ్చిన వచ్చిన అధికారులను పంపించేవాడు. దీంతో చేసేదేమి లేక పోలీసులు వెనుతిరిగి వచ్చేవారు. అయితే దయాశంకర్ ఆడుతున్న డ్రామాను.. ఓ పోలీసు ఇన్ ఫార్మర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వారు ఆడ వేషంలో ఉన్న దయాశంకర్ పై నిఘా పెట్టారు. తలపై షార్ట్ హెయిర్ ఉండటాన్ని చూసి మగవాడిగా నిర్ధారించుకున్నారు. అనంతరం అతడ్ని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. దయాశంకర్ ను అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Jodhpur: History-sheeter Dayashankar Chavariya caught disguised as a woman in sari, blouse, mangalsutra, with waxed hands & legs to evade police. Signaled Dayashankar wasn't home when cops arrived.
pic.twitter.com/Mb5Zjt420y— Ghar Ke Kalesh (@gharkekalesh) June 19, 2025
అరెస్ట్ ఎందుకంటే?
బాగర్ చౌక్ లోని పిప్లి గలి నివాసి ప్రిన్స్ చావ్లా (23), గజేంద్ర సింగ్ అనే వ్యక్తులపై ఫిబ్రవరి 10న రౌడీ షీటర్ దయాశంకర్ దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. అంతేకాదు రాత్రి 11:30 గంటలకు తన మనుషులతో పాటు బాధితుల ఇంటికి వెళ్లి బెదిరించిట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో ప్రిన్స్ ను కిందికి తోసి తలపై గాజు సీసాతో దాడి చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. కేసు నమోదైన దగ్గర నుంచి దయాశంకర్ కనిపించకుండా పోయాడు. తాజాగా అతడ్ని అరెస్ట్ చేసినట్లు జోద్ పూర్ పోలీసులు తెలిపారు.
#जोधपुर_पुलिस #NewsWindow #NewsUpdates #SafeJodhpur #RajasthanPolice #CrimeFreeJodhpur #JodhpurPolice pic.twitter.com/EAtvf03Y0a
— Jodhpur Police (@CP_Jodhpur) June 19, 2025