Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) ఎస్బీఐ మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావును (Prabhakar Rao) సిట్ అధికారులు నాలుగోసారి విచారించారు. 9 గంటలకు పైగా సాగిన విచారణలో డెజిగ్నేటెడ్ అధికారిగా అధికారాన్ని ఎందుకు దుర్వినియోగం చేశారు, రివ్యూ కమిటీకి తప్పుడు సమాచారం ఎందుకిచ్చారు, ట్యాపింగ్ వ్యవహారంలో నిబంధనలు ఎందుకు పాటించలేదు అంటూ ప్రశ్నించినట్టు సమాచారం. దాంతోపాటు హార్డ్ డిస్కుల ధ్వంసానికి సంబంధించి మరోసారి విచారించినట్టుగా తెలిసింది.
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping case) సిట్ దూకుడును పెంచింది. ఈ క్రమంలోనే పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahehs Kumar Goud) తోపాటు పలువురు ట్యాపింగ్ బాధితుల నుంచి సిట్ అధికారులు వాంగ్మూలాలు సేకరించారు. ఇప్పటికే గతంలో హోంశాఖ కార్యదర్శిగా పని చేసిన ప్రస్తుత డీజీపీ జితేందర్, (DGP Jithendar) ఇంటెలిజెన్స్ ఐజీగా పని చేసిన అనిల్ కుమార్ (Anil Kumar) లనుంచి కూడా స్టేట్మెంట్లు తీసుకున్నారు.
Also Read: Eatala Rajender: దమ్ముంటే రిపోర్ట్ వచ్చాక చర్యలు తీసుకోవాలి!
అధికార దుర్వినియోగంపై..
ఇక, ఎస్ఐబీ ఛీఫ్‌గా ఉన్నపుడు (Prabhakar Rao) ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి డెజిగ్నేటెడ్ ఆఫీసర్‌గా కూడా వ్యవహరించారు. ఈ అధికారం ప్రకారం మావోయిస్టు సానుభూతిపరులు, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అనుమానాలు ఉన్న వారి ఫోన్లను ట్యాప్ చేయవచ్చు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే అనుమానితుల ఫోన్లపై వారం రోజులు మాత్రమే నిఘా పెట్టాలి. ఆ తరువాత దీనిని కొనసాగించాలంటే రివ్యూ కమిటీ అనుమతి తప్పనిసరి.
అయితే, డెజిగ్నేటెడ్ ఆఫీసర్‌గా తన అధికారాన్ని ప్రభాకర్ రావు (Prabhakar Rao) దుర్వినియోగం చేసినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. రోజుల తరబడి పలు ఫోన్లను ట్యాప్ చేయించినట్టుగా తెలియడంతో దీనిపై (Prabhakar Rao) ప్రభాకర్ రావును నిశితంగా ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే, ఆయన మాత్రం పాత సమాధానాలనే పునరావృతం చేసినట్టు సమాచారం. ‘‘నేనేం చేశానో అంతా నా పై అధికారులకు తెలుసు’’ అంటూ జవాబు ఇచ్చినట్టు తెలిసింది. అధికార దుర్వినియోగానికి ఎందుకు పాల్పడ్డారు అని అడిగితే అలాంటిదేమీ చేయలేదని చెప్పినట్టు సమాచారం.
ఇక, పీసీసీ ఛీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తోపాటు మరికొందరు కాంగ్రెస్ (Congress) నాయకులు ఏమైనా మావోయిస్టు సానుభూతిపరులా, వారి ఫోన్లను ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది, దీని వెనక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అని ప్రశ్నిస్తే ప్రభాకర్ రావు (Prabhakar Rao) మౌనం దాల్చినట్టుగా తెలిసింది. తన పై అధికారుల నుంచి వచ్చిన ఫోన్లనే ట్యాప్ చేశానని చెప్పినట్టు సమాచారం. రివ్యూ కమిటీకి తప్పుడు సమాచారం ఎందుకు అందించారు అనే ప్రశ్నకు కూడా ప్రభాకర్ రావు (Prabhakar Rao) జవాబు చెప్పలేదని తెలియవచ్చింది.
Also Read:Eatala Rajender: దమ్ముంటే రిపోర్ట్ వచ్చాక చర్యలు తీసుకోవాలి!
ఒక్కరోజే 600 ఫోన్లు..
2023, నవంబర్ 15న ఒక్కరోజే 600 మంది ఫోన్లను ట్యాప్ చేసిన దానిపై ప్రశ్నించినప్పుడు కూడా ప్రభాకర్ రావు (Prabhakar Rao) సరైన సమాధానం చెప్పలేదని తెలిసింది. ఇన్ని ఫోన్లను ట్యాప్ చేయడానికి రివ్యూ కమిటీ నుంచి అనుమతి తీసుకున్నారా అని అడిగినప్పుడు కూడా జవాబు ఇవ్వలేదని సమాచారం. కీలకమైన ప్రశ్నలన్నింటికీ పై అధికారులకు అంతా తెలుసు అని మాత్రమే సమాధానం ఇచ్చినట్టు తెలియవచ్చింది. 9 గంటల విచారణ తరువాత నేడు మరోసారి రావాలని సూచించి సిట్ అధికారులు ప్రభాకర్ రావును పంపించారు.
వ్యూహాత్మకంగానే..
ప్రభాకర్ రావు వ్యూహాత్మకంగానే ఇలా వ్యవహరిస్తున్నారన్న చర్చ పోలీస్ వర్గాల్లో జరుగుతున్నది. పై అధికారులకు అంతా తెలుసంటూ ఆయన పదే పదే చెబుతుండడం అప్పట్లో డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి, (Mahendra Reddy) ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న అనిల్ కుమార్, హోంశాఖ కార్యదర్శిగా ఉన్న జితేందర్, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌లను (Somesh Kumar) కేసులోకి లాగడానికి చేస్తున్న ప్రయత్నమే అని పోలీస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తద్వారా కేసును మరింత సంక్లిష్టం చేయాలన్నది ప్రభాకర్ రావు ఉద్దేశంలా కనిపిస్తోందని అంటున్నాయి.
Also Read: Harish Rao: సీఎంకు బేసిన్‌లపై నాలెడ్జ్ లేదు.. హరీశ్ రావు సంచలన కామెంట్స్!