Bandaru Veeraiah
Viral

Shalem Raj : మల్లెపూలు పెట్టుకునే మహిళలంతా… పాస్టర్ షాకింగ్ కామెంట్స్

Shalem Raj: ఈ మధ్య కొందరు పేరుకే మేము ఫలానా అని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ, చేసేవి మాత్రం ఇంకో పనులు అన్నట్లుగా పరిస్థితి ఉన్నది. ఎవరో ఎందుకు.. ఇదిగో పాస్టర్ షాలెం రాజు గురించే మాట్లాడుకుంటే.. పాస్టర్ నోట పచ్చి బూతులు. ఎంతలా అంటే కట్టుకున్న భార్యే అసహ్యించుకునేంత! ఈ మాటలు విన్న తర్వాత సదరు మహిళగా, మహిళకు భర్తగా, అన్నగా, తమ్ముడిగా మీకూ ఆయనపై కట్టలు తెంచుకునే కోపం రాక మానదు. ఇంకా మాట్లాడుకోవాల్సి వస్తే.. అసలు ఇతను పాస్టరా లేకుంటే *** అని మాట్లాడుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో!

ఈయన పాస్టరా.. లేకుంటే..!
గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన బండారు వీరయ్య అలియాస్ షాలెం రాజు పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. క్రిస్టియానిటీని వ్యాప్తి చేయడానికి ఈయన చేయని భగీరథ ప్రయత్నాలు లేవు. అది ఆయన వృత్తి కాబట్టి చేసుకుంటున్నాడు అనుకుందాం.. హిందువులతో ఆయనకేం పని? హిందువులను రెచ్చగొట్టి ప్రసంగించాల్సిన అవసరం ఉందా? అస్సలు లేదు కదా.. కానీ, ఈయనకు మాత్రం వివాదాలు, రచ్చలు, రాద్ధాంతాలే కావాలి.. ఇవే ఊపిరి కూడా. ఇప్పటి వరకూ ఆయన చేసిన పాపిస్టి పనుల సంగతి అటుంచితే.. తాజాగా పల్నాడు జిల్లాలోని ఓ ప్రార్థనా సభలో మాట్లాడుతూ ‘ మల్లెపూలు పెట్టుకునే ఆడవాళ్లంతా బజారు మహిళలు’ అని వ్యాఖ్యానించాడు. దీంతో హిందూ, మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. అంతేకాకుండా, మల్లెపూలకు సంబంధించిన కొన్ని సంప్రదాయాలు.. వ్యక్తిగత ఎంపికలను తప్పుబట్టే విధంగా మాట్లాడటం గమనార్హం. ఆయన ఉద్దేశం ఏమైనప్పటికీ, కామెంట్స్ మాత్రం మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, అభ్యంతరకరంగా ఉన్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షాలెం చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ వివాదం మొదలైంది. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారంగా మారింది.

Shalem Raj

ప్రజా స్పందన, ఫిర్యాదులు
పాస్టర్ షాలెం రాజు వ్యాఖ్యలు విన్న ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు మహిళల పట్ల అగౌరవంగా ఉన్నాయని, సమాజంలో తప్పుడు సందేశాన్ని పంపే విధంగా ఉన్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని మహిళా సంఘాలు, వ్యక్తిగత ఫిర్యాదుదారులు సైతం పాస్టర్ షాలెం రాజుపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. మహిళల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడినందుకు, సమాజంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నించినందుకు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఈ ఫిర్యాదులను స్వీకరించి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ వివాదంపై ఇతర మత పెద్దల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు షాలెం రాజు వ్యాఖ్యలను ఖండించగా, మరికొందరు వ్యక్తిగత ప్రసంగాలను వివాదాస్పదం చేయొద్దని అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా.. ఇలాంటి కేసుల్లో పోలీసులు ఫిర్యాదులను లోతుగా పరిశీలించి, వీడియో సాక్ష్యాలను విశ్లేషించి.. ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటారు.

Jasmine Flower

పూల గురించి నీకేం తెలుసు?
మహిళలు పూలు పెట్టుకోవడం అనేది కేవలం ఒక అలంకరణగా మాత్రమే కాదు.. భారతీయ సంస్కృతిలో లోతైన అర్థాలను, సంప్రదాయాలను కలిగి ఉంది. ఇది వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు భావాలను సూచిస్తుంది. ప్రాథమికంగా, పూలు మహిళల సహజ సౌందర్యాన్ని పెంపొందిస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మల్లెపూలు, గులాబీలు, చేమంతి వంటివి జడలో లేదా కొప్పులో పెట్టుకోవడం వల్ల మహిళలకు ప్రత్యేకమైన శోభ వస్తుంది. వాటి సువాసన వాతావరణాన్ని ఆహ్లాదపరుస్తుంది. పూలు శుభానికి, పవిత్రతకు ప్రతీకలు. పండుగలు, పెళ్లిళ్లు, పూజలు వంటి శుభకార్యాల్లో మహిళలు పూలు ధరించడం సంప్రదాయం. ఇది ఆచార వ్యవహారాల్లో ఒక భాగంగా ఉంటుంది. తరతరాలుగా వస్తున్న ఒక ఆచారం ఇది. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని కులాల్లో పూలు పెట్టుకోవడం ఒక గుర్తింపుగా కూడా ఉంటుంది. ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో పూలు పెట్టుకోవడం ఒక సాధారణ దృశ్యం. పూల సువాసన మానసిక ప్రశాంతతను, ఆనందాన్ని ఇస్తుందని జనాలు ఎక్కువగా నమ్ముతారు. ఇది ఒత్తిడిని తగ్గించి, సానుకూల దృక్పథాన్ని కూడా కలిగిస్తుందని పెద్దలు, నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా వివాహిత మహిళలు (సువాసినులు) పూలు పెట్టుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది వారి సౌభాగ్యానికి ప్రతీకగా కూడా చూస్తారు. పోనీ.. ఈ విషయాలన్నీ ఆ పాస్టర్‌కు తెలుసా? చదువుకున్న వ్యక్తే కదా? కనీసం ఇప్పటికైనా ఈ విషయాలు తెలుసుకుంటే మహా మంచిది. పోనీ.. ఇప్పటికైనా తెలుసుకొని క్షమాపణలు చెప్పి, మరోసారి రిపీట్ కాకుండా చూసుకుంటే మంచిది.

Read Also- KTR And Harish: అవును.. కేటీఆర్-హరీశ్ ఒక్కటయ్యారు!

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు