Harish and ktr
సూపర్ ఎక్స్‌క్లూజివ్

KTR And Harish: అవును.. కేటీఆర్-హరీశ్ ఒక్కటయ్యారు!

KTR And Harish: అవును.. వాళ్లు ఒక్కటయ్యారా? కలిసిపోయారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏ కార్యక్రమం చేయాలన్నా ఒకరికికొకరు కోఆర్డినేషన్‌తో ముందుకెళ్తున్నారని, చర్చించుకొని అంశాల వారీగా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారని సమాచారం. గతంలో లేని విధంగా ప్రభుత్వంపై ఏదైనా కార్యక్రమం చేయాలంటే ముందుకు ప్లాన్ వేసుకుంటున్నారని, సోషల్ మీడియాలో సైతం పోటాపోటీగా కాకుండా అంశాల వారీగా పంచుకున్నట్లు స్పందిస్తున్నారని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. ఈ మధ్య తాజా పరిణామాలు సైతం బావబామ్మర్దులు ఒక్కటే అనే సంకేతాన్ని పార్టీ కేడర్ కు ఇస్తున్నారు. అంతేకాదు ఏదో ఒక అంశంతో ప్రజల్లో నిత్యం ఉండేలా పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు.


అప్పుడు.. ఇప్పుడు!
పార్టీలో సీనియర్ నేత హరీశ్ రావు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇద్దరి మధ్య సయోధ్య లేదు.. హరీ‌శ్‌కు పార్టీలో ప్రాధాన్యత తగ్గించారనే ప్రచారం జరిగింది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాల నిర్వహణకు అనుమతి ఇవ్వలేదని కేవలం ఉమ్మడి సిద్దిపేటకు మాత్రమే పరిమితం చేశారని విస్తృత ప్రచారం జరిగింది. ముఖ్యంగా కేటీఆర్‌తో గ్యాప్ ఉందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. వరంగల్‌లో నిర్వహించిన పార్టీ రజతోత్సవ సభ బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగిస్తామని తొలుత పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఆతర్వాత హరీశ్ చెప్పిన స్థలంలో కాకుండా మరోచోట ఎల్కతుర్తిలో సభ నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో కొంత హరీశ్ రావు అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరిగింది. ఆతర్వాత కూడా రకరకాలుగా ప్రచారం జరిగింది. కొద్ది రోజులు హరీశ్ సైతం కొంత సైలెంట్ గా ఉన్నారు. ఈ తరుణంలో గత నెల 16న స్వయంగా కేటీఆర్ వెళ్లి హరీశ్‌తో భేటీ అయ్యారు. పలురాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మరుసటి రోజు మే 17న హరీశ్ నివాసానికి కేటీఆర్ వెళ్లారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి పకడ్బందీ కార్యాచరణ రూపొందించారు. తెలంగాణ సంస్కృతి, అస్తిత్వ పరిరక్షణ లక్ష్యంగా ఉద్యమ కాలం నాటి తరహాలో కవులు, కళాకారులు, రచయితలు, విభిన్న రంగాలకు చెందిన మేధావులతో భేటీ అయ్యారు. ఈ భేటీతో ఇద్దరి మధ్య విభేదాలు లేవని అంతా కలిసికట్టుగా ఉన్నామనే మెసేజ్ ఇచ్చారు. కానీ కొంత అపోహలు ఉండేవి కానీ వరుస కార్యక్రమాలతో ఇద్దరు కలిసిపోయారని, ఒక్కటేనని పార్టీ కేడర్ కు, రాజకీయ పార్టీలకు సంకేతం ఇచ్చారు. అంతేగాకుండా పార్టీ పగ్గాలు కేటీఆర్ కు అప్పగించినా పనిచేస్తానని, పార్టీ అధినేత కేసీఆర్ చెప్పిన లైన్ దాటనని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని హరీశ్ రావు మీడియా ముందు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Read Also- Sekhar Kammula: నేను ఎంజాయ్ చేయలేదు.. ‘పుష్ప 2’పై శేఖర్ కమ్ముల షాకింగ్ కామెంట్స్


సద్దుమణిగిన సమస్య?
పార్టీలో హరీశ్ రావు కీలక నేతగా ఉన్నారు. ఆయన పార్టీలో పనిచేయకపోతే భవిష్యత్ లో జరుగబోయే పరిణామాలను ముందుగానే ఊహించిన కేసీఆర్.. కేటీఆర్- హరీశ్ మధ్య సయోధ్య కుదుర్చినట్లు సమాచారం. మాస్ లీడర్ గా పేరున్న ట్రబుల్ షూటర్ కు యువతతో పాటు పార్టీలోనూ అభిమానులు కేడర్ ఉంది. పార్టీకి నష్టం జరుగకుండా కేసీఆర్ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. అందులో భాగంగానే స్వయంగా కేటీఆర్ ను పిలిచి హరీశ్ రావు ఇంటికి పంపారని సమాచారం. దీంతో హరీశ్ రావు సైతం పార్టీ, రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కలిసి ముందుకు సాగేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది. అంతేకాదు హరీశ్ రావు కీలక శాఖలైన ఆర్థికశాఖ, ఇరిగేషన్, హెల్త్, అడ్మినిస్ట్రేషన్ పై పట్టుంది. ఉద్యోగుల్లో సైతం హరీశ్ రావుకు సన్నిహితులు ఉన్నారు. దీంతో డిపార్టు మెంట్లలో జరుగుతున్న వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు సమస్యలపైనా క్షణాల్లోనే స్పందించడం జరుగుతుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని హరీశ్ రావును శాంతపరిచినట్లు ప్రచారం జరుగుతుంది.

ఒకరికి ఒకరుగా…
గత నెలలో హరీశ్ రావుతో కేటీఆర్ భేటీ తరువాత ఉద్యమ పంథాను మార్చుకున్నారు. ఇద్దరు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతున్నారు. హరీశ్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భాన్ని పురస్కరించుకొని కేటీఆర్ తో సహా నేతలంతా తెలంగాణ భవన్ కు ఉదయమే వచ్చారు. అక్కడ సంఘీభావం ప్రకటించారు. అక్కడి నుంచి బీఆర్ కే భవన్ కు వచ్చారు. విచారణ కంప్లీట్ అయ్యేవరకు భవన్ వద్దే ఉన్నారు. ఫార్కులా ఈ కారురేసు కేసులో ఏసీబీ విచారణకు వెళ్తున్న కేటీఆర్ కు సంఘీభావంగా హరీశ్ రావుతో సహా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులంతా భవన్ కు వచ్చి మద్దతు తెలిపారు. విచారణ పూర్తయ్యేవరకు భవన్ లోనే ఉన్నారు. గతానికి భిన్నంగా బావబామ్మర్దులు హరీశ్, కేటీఆర్ ముందుకెళ్తు పార్టీ కేడర్ కు సైతం భరోసా ఇస్తున్నారు. ఎవరికి కష్టం వచ్చినా అండగా ఉంటామని, పార్టీ నేతలంతా ఏకతాటిపై ఉండాలని సూచనలు చేస్తున్నారు.

సోషల్ మీడియాలోనూ జాగ్రత్తగా..
ఇంతకు ముందు సోషల్ మీడియాలో హరీశ్ ట్వీట్ చేస్తే.. ఆ వెంటనే కేటీఆర్ ట్విట్ వచ్చేది. ఒకే అంశంపై ఇద్దరు స్పందించేది. కొన్ని ట్విట్లు పోటాపోటీపెడుతున్నారనే సంకేతం సైతం ప్రజల్లోకి వెళ్లింది. పార్టీ నేతల్లో చర్చనీయాంశమైంది. కానీ ఎప్పుడైతే హరీశ్ రావుతో కేటీఆర్ భేటీ అయ్యారో అప్పటి నుంచి జాగ్రత్తగా సోషల్ మీడియాను హ్యాండిల్ చేస్తున్నారు. ఆచితూచి పోస్టులు పెడుతూ ఒకరికి ఒకరికి మధ్య గ్యాప్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇతరులు విమర్శలు చేయకుండా, ప్రజా సమస్యలపైనే ఎక్కువగా స్పందిస్తున్నారు. ప్రభుత్వ హామీలు, గ్యారెంటీలపై నిలదీస్తూ , కాంగ్రెస్ నేతలకు కౌంటర్లు ఇస్తూ ప్రజల్లో నిత్యం ఉండేలా పక్కాప్లాన్ తో ముందుకెళ్తున్నారు. ఇద్దరం పార్టీలో కార్యకర్తలమేనంటూ సందేశం ఇస్తూ కేడర్ తో మమేకం అవుతున్నారు. ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు పవర్ పాయింట్ ప్రజంటేషన్లు ఇస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు ప్రెస్ మీట్లతోనూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు.

కవిత విమర్శలతో అలర్ట్?
ఎమ్మెల్సీ కవిత పార్టీ నేతలపై విమర్శలు చేసింది. అంతేకాదు పేరు ఎత్తకుండా కేటీఆర్, హరీశ్ రావులపై ఘాటుగా విమర్శలతో పాటు మండిపడింది. కేసీఆర్ పై కేసులు పెడితే పార్టీ కార్యచరణ చేపట్టలేదని, మరోవైపు బీజేపీ నేతల తోనూ టచ్ లో ఉన్నారని, పార్టీలో కొంతమంది ఇతర పార్టీలకు కోవర్టులుగా పనిచేస్తున్నారని ఆరోపణలు చేసింది. దీంతో అలర్టు అయిన కేటీఆర్, హరీశ్ రావులు మరింతగా దగ్గరయ్యారని, ఇద్దరు కలిసి పోయేలా నిర్ణయం తీసుకొని పార్టీపై ఫోకస్ పెట్టారని సమాచారం. రాబోయే కాలంలో ఇద్దరు పార్టీని నడిపిస్తారని, కేటీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే మరో పార్టీ కీలక పదవికి హరీశ్ రావుకు ఇస్తారనే ప్రచారం సైతం జరుగుతుంది. ఏది ఏమైనా గతానికి భిన్నంగా హరీశ్ రావు, కేటీఆర్ కలిసి కట్టుగా ముందుకు సాగుతుండటంతో పార్టీ మరింత బలోపేతం కానుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read Also-Bike Taxi: బైక్ ట్యాక్సీలపై నిషేధం.. 5 రెట్లు పెరిగిన ట్రాఫిక్!

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు