Janhvi Kapoor and Shikhar
ఎంటర్‌టైన్మెంట్

Janhvi Kapoor: చేయి పట్టుకుని.. లండన్‌లో లవర్‌తో ఛిల్ అవుతోన్న జాన్వీ కపూర్.. పక్కనే చెల్లి కూడా?

Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే సౌత్‌లో తన జెండా పాతేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ‘దేవర’ తర్వాత ‘పెద్ది’లో అవకాశం సంపాదించిన జాన్వీ.. మరో రెండు తెలుగు ప్రాజెక్ట్స్‌ని లైన్‌లో పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆ రెండు ప్రాజెక్ట్స్ ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయని, త్వరలోనే ఆ వివరాలు అధికారికంగా ప్రకటిస్తారనే వార్తలు టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. ఇక జాన్వీ సినిమాల సంగతి ఇలా ఉంటే.. ప్రస్తుతం ఆమె రిలేషన్‌కి సంబంధించి కూడా సోషల్ మీడియాలో షేకయ్యేలా వార్తలు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె శిఖర్ పహారియా (Shikhar Pahariya)తో రిలేషన్‌లో ఉందనేలా బాలీవుడ్‌లో వార్తలు టామ్ టామ్ అవుతుంటాయి. ఎందుకంటే, వీరిద్దరూ ఎప్పుడూ కలిసే కనిపిస్తుంటారు.

Also Read- Peddi: ‘పెద్ది’లో రామ్‌ బుజ్జిగా ‘మీర్జాపూర్’ నటుడు.. ఫస్ట్ లుక్ చూశారా?

తాజాగా వీరిద్దరూ లండన్‌లో ఛిల్ అవుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వీరిద్దరి రిలేషన్‌పై ఎన్ని రకాలుగా వార్తలు వస్తున్నా.. ఇద్దరిలో ఎవరూ ఖండించడం లేదు. ఆ మధ్య కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో కూడా శిఖర్ పహారియాతో రిలేషన్‌లో ఉన్నట్లుగా ఇన్‌ డైరెక్ట్‌గా జాన్వీ హింట్ ఇస్తుంది. తన కోసం ఓ సాంగ్‌ని ఎప్పుడు కావాలంటే అప్పుడు శిఖర్ పాడతాడని తెలిపింది. ఇప్పుడు లండన్ వీధుల్లో ఇద్దరు చేయి చేయి పట్టుకుని, జంటగా వెళుతున్న వీడియో బాగా వైరల్ అవుతుంది. జాన్వీ, శిఖర్‌ల మధ్య ఉన్న సంబంధాన్ని మరింతగా ఈ వీడియో బహిర్గతం చేస్తుంది. ఈ వీడియోలో ఈ జంట వెనుకే జాన్వీ సోదరి ఖుషి కూడా వెళుతుండటం విశేషం. అంటే, వీరిద్దరి రిలేషన్ గురించి ఇంట్లో కూడా తెలిసిపోయే ఉంటుందనేదానికి ఇదే ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

Also Read- Samantha and Raj Nidimoru: సమంత రెండో పెళ్లి ఫిక్స్? రాజ్ నిడిమోరు భార్య పెట్టిన పోస్ట్ తో కన్ఫర్మ్?

శిఖర్ పహారియా విషయానికి వస్తే.. మాజీ హోం మంత్రి సునీల్ కుమార్ షిండే మనవడే శిఖర్ పహారియా. నటి స్మృతి షిండే శిఖర్ పహారియా మదర్. అతని బ్రదర్ వీర్ పహారియా ఇటీవల వచ్చిన అక్షయ్ కుమార్ ‘స్కై ఫోర్స్’ సినిమాలో నటించారు. మరో వైపు జాన్వీ కపూర్ లండన్ వెళ్లడానికి కారణం యునైటెడ్ కింగ్‌డమ్‌లో ప్రస్తుతం ఆమె చేస్తున్న ‘ఉలాజ్’ చిత్ర షూటింగ్‌లో పాల్గొనడానికని తెలుస్తుంది. ‘ఉలాజ్’ క్లాప్ బోర్డ్‌తో జాన్వీ కపూర్ ఓ పిక్‌ని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. సినిమా షూటింగ్‌కని వెళ్లి.. చక్కగా లవర్‌తో జాన్వీ ఛిల్ అవుతుందనేలా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘ఉలాజ్’ విషయానికి వస్తే.. జాతీయ అవార్డు గ్రహీత సుధాన్షు సరియా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం ఒక యువ IFS అధికారిణి బయోపిక్ అని తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో తను ఛాలెంజింగ్ రోల్‌లో నటిస్తున్నట్లుగా జాన్వీ తెలిపింది. నిరంతరం కంఫర్ట్ జోన్ నుంచి బయటపడే స్ర్కిప్ట్ కోసం వెతుకుతుంటానని, ఇది అలాంటి చిత్రమేనని జాన్వీ పేర్కొంది. జంగ్లీ పిక్చర్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

">

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు