Samantha and Raj Nidimoru: తెలుగులో ఆమె నటనతో అందర్ని మెప్పించి.. కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అకినేని నాగార్జున పెద్ద కుమారుడైన హీరో నాగ చైతన్యను సమంత పెళ్లిచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట పట్టుమని నాలుగేళ్ళు కూడా కలిసి ఉండలేకపోయారు. వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరి ఇష్టంతో విడాకులు తీసుకుని విడిపోయారు. తప్పు ఎవరదైనా .. శిక్ష ఇద్దరూ అనుభవించారు.
ప్రస్తుతం సామ్ సింగిల్ గా ఉంటుంది. కానీ, నాగ చైతన్య మాత్రం బాలీవుడ్ భామ శోభిత ధూళిపాళ్ళను రెండో పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు.అయితే, ప్రస్తుతం సమంత మూవీస్ చేయకుండా నిర్మాతగా బాధ్యతలు తీసుకొని శుభం మూవీతో మన ముందకొచ్చింది. ఈ చిత్రం హిట్ అవ్వడంతో నిర్మాతగా తొలి సక్సెస్ అందుకుంది. శుభం మూవీ ఆశించిన కలెక్షన్స్ వసూలు చేయడంతో సమంత సంతోషంగా ఉంది. ఈ సినిమా రిలీజైన అన్ని చోట్ల హిట్ టాక్ తెచ్చుకోవడంతో థాంక్స్ మీట్ కూడా పెట్టింది. అయితే, తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ భార్య శ్యామాలి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
డైరెక్టర్ భార్య శ్యామాలి ” నా కోసం ఆలోచించే వారు, వినే వారు , వినిపించే వారు, మాట్లాడేవారు, మాట్లాడించే వారు, రాసే వారిని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. నా ఆశీర్వాదాలు కూడా పంపుతూనే ఉంటా ” అంటూ అంతక ముందు పెట్టింది. ఇక రీసెంట్ గా ” కర్మ ఎవర్ని విడిచి పెట్టదు. దాని సమయం వచ్చినప్పుడు అన్ని అవే బయటపడతాయి” అంటూ ఇంకో పోస్ట్ ను పెట్టింది. ఇక ఇప్పుడు తాజాగా ” నమ్మకం చాలా విలువైనది. దాన్ని ఒకసారి పోగొట్టుకుంటే మళ్లీ పొందలేరు. ఆస్తులు పోయినా మళ్లీ సంపాదించవచ్చు. కానీ, నమ్మకం మళ్లీ తిరిగి పొందలేరంటూ ఇంస్టాగ్రామ్ లో రాసుకొచ్చింది.
