YS Jagan: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప సినిమాల్లో డైలాగ్స్ ఇప్పటికీ.. ఎప్పటికీ మర్చిపోలేం. అనుకోకుండానే తగ్గేదేలే.. రప్పారప్పా నరుకుతాం.. ఇలాంటి డైలాగ్స్ వచ్చేస్తుంటాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్య నేతల పర్యటనలు.. సభలు, సమావేశాల్లో గట్టిగానే ప్లకార్డులు, నినాదాలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Ys Jagan Mohan Reddy) పల్నాడు జిల్లా పొదిలి పర్యటనలో రప్పారప్పా.. అంటూ ప్లకార్డు కనిపించింది. ఇదే అదనుగా చేసుకున్న టీడీపీ.. ఇదిగో ఇదే జగన్ అండ్ పార్టీ వ్యక్తిత్వం అని ఏకంగా ఆ ప్లకార్డు పట్టుకున్న కుర్రాడిపై కేసు పెట్టిన పరిస్థితి. ఈ ఘటనతో పాటు కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు.
మనం ఎక్కడున్నాం..?
చంద్రబాబు ఏడాది పాలనపై ప్రజల్లో తీవ్ర అసహనం ఉందని.. ఆయనపై విరక్తితో టీడీపీ శ్రేణులు తమ అసహనాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తున్నారని జగన్ తీవ్ర వ్యాఖలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర లేపుతూ వైసీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారని మండిపడ్డారు. ‘గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పారప్పా నరుకుతాం..’ అని పుష్ప సినిమా డైలాగులు, పుష్పా సీన్లు, తగ్గేదేలే పుష్పా అని మేనరిజం ప్రదర్శించినా కేసులు పెడతారా చంద్రబాబు? ఇంతకీ మనం ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా? లేదా? పల్నాడులో పుష్ప ఫ్లకార్డు పట్టుకున్న యువకుడు గతంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నాడని, చంద్రబాబు పాలనపై విరక్తితో టీడీపీ శ్రేణులు.. ఇలా తమ అసహనాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తున్నారేమోనని అని జగన్ అభిప్రాయపడ్డారు.
Also Read- YS Jagan: వైఎస్ జగన్ ఉంగరం వెనుక పెద్ద కథే ఉందిగా!
ఇదంతా నాణేనికి రెండో వైపు!
ఇవాళ్టి ప్రెస్ మీట్.. రాష్ట్రంలో జరుగుతున్న ఈ మధ్య కాలంలో జరుగుతున్న కరెంట్ ఈవెంట్స్ అన్నింటి మీద నాణేనికి రెండో వైపు చూపించే ప్రయత్నం అని జగన్ వెల్లడించారు. ‘ఎందుకంటే మనం ఎల్లో మీడియా సామ్రాజ్యంతో కూడా యుద్ధం చేస్తున్నాం. మన వర్షన్ ప్రజల్లోకి సింక్ అయ్యే అవకాశాలు.. వాళ్లు చేస్తున్నంతగా మనది సింక్ కాదు కాబట్టి ప్రజలకు రెండో వైపున స్టోరీ తెలియాల్సి ఉంది. అందుకే కరెంట్ ఈవెంట్స్ మీద ఈ ప్రెస్ మీట్. రాష్ట్రంలో ఈ రోజు దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, పాలనా వైఫల్యాలు, మోసాలు, అబద్ధాల మధ్య కొనసాగుతున్న చంద్రబాబు పాలన. సంవత్సరం తిరిగే నాటికల్లా ఒక ప్రభుత్వం ఇంత తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో చోటు చేసుకోవడం అన్నది బహుశా దేశ చరిత్రలోనే తక్కువ. చంద్రబాబు తాను చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్.. ప్రతి మాటలోనూ అసహనం కనిపిస్తోంది. అందుకే నియంతగా తాను మారి, అణిచివేత అన్న పదానికి నిజంగా ఒక నిర్వచనంగా చంద్రబాబు తయారయ్యారు’ అని జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
భయమేల బాబు..?
‘ప్రతిపక్ష నాయకుడు ప్రజల్ని కలవడానికి వెళ్లినప్పుడు గానీ, లేదా పార్టీ నాయకుల్ని పరామర్శించడానికి వెళ్లినప్పుడు గానీ ఎందుకు ఇటువంటి ఆంక్షలు విధించాలని అడుగుతున్నా. మొన్న పొగాకు రైతులకు సంబంధించి పొదిలి వెళ్తే అక్కడ కూడా నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. పొగాకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. అలాంటి నేపథ్యంలో ఇద్దరు ఆత్మహత్యలు జరిగాయి. రైతులకు సంఘీభావంగా ఎవరూ వెళ్లకూడదా? రైతుల సమస్యలనేవి ఎవరూ పట్టించుకోకూడదా? నేను అడుగుతున్నా చంద్రబాబును. ఎందుకు ఇంత భయపడుతున్నావు.. ఎందుకింత అసహనం’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
Also Read- Samantha and Raj Nidimoru: సమంత రెండో పెళ్లి ఫిక్స్? రాజ్ నిడిమోరు భార్య పెట్టిన పోస్ట్ తో కన్ఫర్మ్?
ఎందుకీ తాపత్రయం?
‘కొడాలి నాని, జోగి రమేష్, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు, వైవీ సుబ్బారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కొడుకు, దేవినేని అవినాశ్, తలశిల రఘురామ్, ఆర్కే, అంబటి రాంబాబు, విడదల రజిని, తాటిపర్తి చంద్రశేఖర్ దళిత ఎమ్మెల్యే, బూచేపల్లి శివప్రసాద్, ఉషాచరణ్ బీసీ మహిళా మాజీ మంత్రి, తోపుదుర్తి ప్రకాశ్, గోరంట్ల మాధవ్ ఎక్స్ ఎంపీ, గౌతమ్ రెడ్డి లాయర్ ఆయన పాపం.. విజయవాడలో మీ అందరికీ పరిచయం, మేరుగు నాగార్జున దళిత మాజీ మంత్రి, దాడిశెట్టి రాజా ఎక్స్ మినిస్టర్, ఈ నాయకులందరి మీదా తప్పుడు కేసులు పెట్టడం, వీళ్లను ఎప్పుడెప్పుడు అరెస్టు చేయాలా అని చంద్రబాబు తాపత్రయం. జగన్ చుట్టూ ఉన్నవాళ్లలంరినీ బెదిరించాలి.. భయపెట్టాలి. మోడస్ ఆపరాండా ఒకటి.. చిన్నచిన్న వ్యక్తులను కొట్టడం.. భయపెట్టడం.. లేదా ప్రలోభాలు పెట్టడం ఇదే పనిగా పెట్టుకున్నారు’ అని బాబుపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు