Monday, July 1, 2024

Exclusive

IPL 2024: హైబ్రిడ్ పిచ్ లు సిద్ధం

 

IPL 2024: ఎన్నో రికార్డులకు ఐపీఎల్-24 వేదికగా మారింది. ఎప్పుడూ లేనంతగా భారీ స్కోర్లు, సిక్సులు, ఫోర్లు నమోదవుతున్నాయి. జస్​ప్రీత్ బుమ్రా లాంటి ఒకరిద్దరు టాప్ బౌలర్లు తప్ప అంతా బ్యాటర్ల దాడిలో బలవుతున్నారు. ఎలాంటి బంతులు వేస్తున్నా పరుగులు లీక్ అవుతుండటంతో ఎవరికీ ఏం చేయాలో పాలుపోవడం లేదు. అయితే బౌలర్లకు గుడ్ న్యూస్. క్యాష్ రిచ్ లీగ్​లో నయా ప్రయోగానికి బీసీసీఐ రెడీ అవుతోంది. ఇది గానీ సక్సెస్ అయిందా ఇక బ్యాటర్లకు చుక్కలేనని చెప్పాలి. ఇందుకోసం బీసీసీఐ వికెట్ నుంచి బ్యాటర్లతో పాటు బౌలర్లకు కూడా హెల్ప్ లభించేలా కొత్త పిచ్​లను తయారు చేస్తోంది. వీటినే హైబ్రిడ్ పిచ్​లుగా పిలుస్తున్నారు. సిస్​గ్రాస్ అనే సంస్థ రూపొందిస్తున్న ఈ పిచ్​లు మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఈ ట్రాక్స్​లో న్యాచులర్ గ్రాస్​తో పాటు 5 శాతం పాలిమర్ కూడా కలసి ఉంటుంది. దీంతో పేసర్లు కన్​సిస్టెంట్​గా బౌన్స్ రాబట్టొచ్చు. వికెట్ చాలా సేపటి వరకు తాజాగా ఉంటుంది. కాబట్టి బౌలర్లు మరింత ఎఫెక్టివ్​గా బౌలింగ్ చేయొచ్చు.

హైబ్రిడ్ పిచ్ గా ధర్మశాల

ధర్మశాల స్టేడియాన్ని రెండో హోం గ్రౌండ్‌గా ఎంచుకున్న పంజాబ్‌ కింగ్స్‌ జట్టు మే 5న చెన్నై సూపర్‌కింగ్స్‌తో.. మే 9న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో ఈ హైబ్రిడ్‌ పిచ్‌లపై ఆడబోతోంది. ఈ మ్యాచ్‌ల ఫలితాలను బట్టి మున్ముందు మ్యాచ్‌ల్లోనూ ఇలాంటి పిచ్‌లు తయారుచేయడానికి బీసీసీఐ ఆలోచన చేస్తోంది. ఐసీసీ కూడా ఇప్పటికే టీ20, వన్డేల్లో హైబ్రిడ్‌ పిచ్‌ల వాడకానికి ఆమోదం తెలపడంతో త్వరలో అంతర్జాతీయస్థాయిలోనూ ఈ పిచ్‌లపై మ్యాచ్‌లు జరిగే అవకాశాలున్నాయి. ఇంగ్లాండ్‌లో హైబ్రిడ్‌ పిచ్‌లపై టీ20, వన్డే మ్యాచ్‌లే కాదు నాలుగు రోజుల కౌంటీ మ్యాచ్‌లు కూడా ఆడుతున్నారు. ఈనేపథ్యంలో హైబ్రిడ్‌ ప్రయోగం మన ఐపీఎల్‌లో ఎలాంటి ఫలితాలు ఇస్తుందనేది ఆసక్తికరం.

Publisher : Swetcha Daily

Latest

Minister: అమాత్యయోగం ఎవరికో?

- త్వరలో మంత్రివర్గ విస్తరణ - ఉత్కంఠలో ఆశావహులు - ఆషాడానికి ముందే మహూర్తం? -...

Survey: చదువుల కంటే పెళ్లికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారుగా..!

Indian Weddings: మన దేశంలో పిల్లల చదువుల కంటే.. వారి పెళ్లికి...

Criminal Law: కొత్త పోలీసు చట్టాలు

- దేశవ్యాప్తంగా అమలుకు రంగం సిద్ధం - కేసుల సత్వర విచారణే లక్ష్యం -...

Job Calender: త్వరలో జాబ్ క్యాలెండర్

- అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు - కొలువుల జాతర కొనసాగుతుంది - కాంగ్రెస్...

PM Narendra Modi: అబద్ధాల్లో మోదీని మించారే..

- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కూనంనేని ఫైర్ - ‘సింగరేణి ప్రైవేటుపరం చేయడానికి...

Don't miss

Minister: అమాత్యయోగం ఎవరికో?

- త్వరలో మంత్రివర్గ విస్తరణ - ఉత్కంఠలో ఆశావహులు - ఆషాడానికి ముందే మహూర్తం? -...

Survey: చదువుల కంటే పెళ్లికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారుగా..!

Indian Weddings: మన దేశంలో పిల్లల చదువుల కంటే.. వారి పెళ్లికి...

Criminal Law: కొత్త పోలీసు చట్టాలు

- దేశవ్యాప్తంగా అమలుకు రంగం సిద్ధం - కేసుల సత్వర విచారణే లక్ష్యం -...

Job Calender: త్వరలో జాబ్ క్యాలెండర్

- అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు - కొలువుల జాతర కొనసాగుతుంది - కాంగ్రెస్...

PM Narendra Modi: అబద్ధాల్లో మోదీని మించారే..

- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కూనంనేని ఫైర్ - ‘సింగరేణి ప్రైవేటుపరం చేయడానికి...

T20 Match: ఫుల్‌ జోష్‌లో రాహుల్‌, ఎందుకంటే..!

Rahul Dravid Comments After India Win The T20 WorldCup 2024: టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్‌ పోరు ఆధ్యంతం ఉత్కంఠగా సాగింది. ఫైనల్‌ పోరులో నువ్వా నేనా...

T20 Match: జట్టును కొనియాడిన క్రికెట్‌ దేవుడు

T20 WorldCup Won The India Team, Sachin Showered Praise On The Team: టీ20 వరల్డ్ కప్‌ని భారత్‌ టీమ్ సొంతం చేసుకున్న వేళ భారత్‌లోని క్రికెట్ అభిమానులు సెలబ్రేట్...

T20 WorldCup Match: అవార్డుల లిస్ట్‌లో భారత్‌కి చోటు

India's Place In T20 BCCI Awards List:వరల్డ్‌వైడ్‌గా క్రికెట్ ఫ్యాన్స్‌ను దాదాపు నెలరోజుల పాటు టీ20 వరల్డ్ కప్ అలరించింది. ఈ టీ20 మ్యాచ్ శనివారంతో ముగిసింది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య...