Salman Khan: ‘గ్రేట్ ఇండియన్ కపిల్ షో’.. నార్త్ ఆడియన్స్‌కు ఇది చాలా ఫేవరెట్. తనదైన కామెడీ టైమింగ్‌తో సినీ తారలతో కపిల్ శర్మ నవ్వులు పూయిస్తాడు. త్వరలో ఈ షో మూడో సీజన్ ప్రారంభం కాబోతున్నది. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తయింది. మొదటి ఎపిసోడ్‌కు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హాజరయ్యాడు. దీనికి సంబంధించిన ప్రోమో బయటకొచ్చింది. అందులో అమీర్ ఖాన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు సల్మాన్.
అమీర్ పెళ్లిళ్లపై సెటైర్లు
ప్రోమో ప్రారంభంలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ తనదైన రీతిలో పరిచయం చేస్తూ కనిపించాడు. కపిల్ శర్మ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రోమోలో కపిల్, అతని బృందంతో సల్మాన్‌ను ఆటపట్టించే సంభాషణలు నవ్వులు పూయిస్తున్నాయి. ఎప్పటిలాగే సల్లూ భాయ్ తన మాటలతో ఎపిసోడ్‌పై హైప్ పెంచేశాడు. మాటల సందర్భంలో అమీర్ ఖాన్ పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకొచ్చాడు కపిల్. ‘‘అమీర్ ఖాన్ ఈ మధ్యే తన గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేశాడు’’ అని సల్మాన్‌తో చెబుతూ ‘‘ఆయన ఆగట్లేదు, మీరు చేయట్లేదు’’ అంటూ కపిల్ సెటైర్లు వేశాడు. దీనిపై సల్మాన్ స్పందిస్తూ, ‘‘అమీర్ చాలా ప్రత్యేకం. అతను పరిపూర్ణవాది(పర్ఫెక్షనిస్ట్). కానీ, పెళ్లి విషయంలో మాత్రం కాదు’’ అని వ్యంగ్యంగా మాట్లాడాడు. దీంతో అందరూ పగలబడి నవ్వారు. మరోవైపు, ఈ మధ్య రిలీజ్ అయిన సికిందర్ సినిమాను కూడా ప్రోమోలో హైలైట్ చేశారు. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ సినిమాపై పరోక్షంగా సెటైర్లు వేయగా, ఆ డైలాగులు బాగా పేలాయి.
Read Also- Suniel Narang: సినిమాలే చూడను.. వారి ముందు నేను ఎంత?.. కుబేర నిర్మాత సంచలన కామెంట్స్
సల్మాన్‌కు కోపం వచ్చిందా?
ఎపిసోడ్‌లో భాగంగా సునీల్ గ్రోవర్, కృష్ణ అభిషేక్.. షారుఖ్, సల్మాన్ లాగా నటించారు. వారి మధ్య సాగిన డైలాగులకు జడ్జిలు, ప్రేక్షకులు తెగ నవ్వారు. ‘‘ఈ రోజు మనం దీన్ని నివారించాలి’’ అని సునీల్ అనగా ‘‘ఏం ఫర్వాలేదు భాయ్.. నేను ఉన్నాను’’ అని కృష్ణ అంటాడు. దానికి సునీల్ బదులిస్తూ ‘‘నువ్వు ఉన్నావు, నీకు ఏం కాదు.. అది నా సమస్య’’ అని అంటాడు. ఆ సమయంలో సల్మాన్ చాలా కోపంగా వారి వైపు చూస్తాడు. అక్కడితో ప్రోమో ముగిసింది. ఈ నెల 21న ప్రారంభం అవుతున్న ‘గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ మొదటి ఎపిసోడ్ రాత్రి 8 గంటలకు ప్రసారం కానున్నది.
పారితోషికం దండిగా..
ఈసారి ఈ షోలో పాల్గొంటున్న వారంతా భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. కపిల్ శర్మ ఒక్కో ఎపిసోడ్‌కు సుమారు రూ.5 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. సుదీర్ఘ విరామం తర్వాత మూడో సీజన్‌లో పాల్గొంటున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఒక్కో ఎపిసోడ్‌కు రూ.30 లక్షల నుంచి ర.40 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నట్టు తెలిసింది. అర్చన పురన్ సింగ్ రూ.10 లక్షల వరకు తీసుకుంటున్నదని టాక్. సునీల్ గ్రోవర్ రూ.25 లక్షలు, కృష్ణ అభిషేక్ రూ.10 లక్షలు, కికు శారద రూ.7 లక్షలు, రాజీవ్ ఠాకూర్ రూ.6 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం.
Read Also- Air India Crash: ‘ఫాదర్స్ డే’ నాడు విషాదం.. డీఎన్ఏ టెస్టులో!