Vakiti Srihari (imgecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Vakiti Srihari: యువతలో నైపుణ్యం పెంచడమే లక్ష్యం

Vakiti Srihari: తెలంగాణ రాష్ట్రాన్ని ఉత్తమ మానవ వనరుల కార్ఖానాగా ఆవిష్కరించాలన్నదే ధ్యేయంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, కమర్షియల్ టాక్స్ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మహబూబ్ నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి సెట్విన్ సంస్థ సౌజన్యంతో తన సొంత నిధులతో మహబూబ్ నగర్ ఫస్ట్ పేరుతో మహిళల కోసం నిర్వహిస్తున్న వృత్తి నైపుణ్య శిక్షణ తరగతుల్లో రెండో బ్యాచ్ లో శిక్షణను పూర్తి చేసుకున్న 260 మందికి ప్రభుత్వం జారీచేసిన సర్టిఫికెట్లను మంత్రి అందజేశారు.

మహిళల ఆర్థిక స్వావలంబన కోసం

ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఉత్తమ మానవ వనరుల కేంద్రంగా తీర్చిదిద్దాలని సంకల్పంలో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నారన్నారు. సహచర శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ ఫస్ట్ పేరుతో ఇప్పటికే 550 మంది మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణను ఇప్పించి మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తుండటం అభినందనీయమన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు వారు ప్రారంభించబోయే వ్యాపారాలకు బ్యాంకుల ద్వారా రుణాలను కూడా మంజూరు చేసేలా యెన్నం చొరవ తీసుకోవడం ప్రశంసనీయమన్నారు. ఆయన స్ఫూర్తితోనే తన మక్తల్ నియోజకవర్గంలో 3718 మంది విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ ను పంపిణీ చేయగా, గతంలో పదవ తరగతిలో 60% ఉన్న ఉత్తీర్ణత శాతం ఈసారి 100 శాతానికి చేరిందన్నారు. యెన్నం స్ఫూర్తితో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ తరహా కార్యాచరణను అమలు చేస్తామన్నారు.

Also Read: BJP party: గ్రౌండ్ లెవల్లో పార్టీ బలోపేతం కోసం అడుగులు.. సక్సెస్ అయ్యేనా!

ఉపాధి మార్గాలు లేకనే యువత పెడదారులు

సరైన ఉపాధి మార్గాలు లేకనే సగం మంది యువత పెడదారులు తొక్కుతున్నారని, యువతను నైపుణ్యవంతులను చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటుచేసి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి యెన్నం శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మహబూబ్ నగర్ ఫస్ట్ పేరుతో ఇప్పటికే 550 మంది మహిళలకు ఆయా రంగాల్లో శిక్షణ నిచ్చి వారిని నిష్ణాతులుగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. తమ స్వార్థ రాజకీయాల కోసం బల నిరూపణ కోసం యువతను వెంటేసుకు తిరిగే వ్యక్తి తనది కాదని, తన పదవీకాలంలో కనీసం 5000 మంది యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్ది వారిని ప్రయోజకులుగా సమాజం ముందు నిలపడమే తన లక్ష్యం అన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు 5000 మందికి డిజిటల్ కంటెంట్ ను అందించినట్లు తెలిపారు… దీంతో గత సంవత్సరం 47% ఉన్న పదవ తరగతి ఉత్తీర్ణత శాతం ఈ సంవత్సరం 70% దాకా వృద్ధి చెందిందన్నారు.

సొంత నిధులతో ఉచిత కోచింగ్

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ (ప్రస్తుతం ఇపిసిట్‌గా వ్యవహరించబడుతోంది) ప్రవేశపరీక్షకు 124 మంది విద్యార్థులకు తన సొంత నిధులతో ఉచిత కోచింగ్ ఇప్పించగా 114 మంది ర్యాంకులు సాధించారన్నారు. 110 మందికి పాలిసెట్‌లో ఉచిత కోచింగ్ ఇప్పించడం ద్వారా 110 మంది పాలిసెట్‌కు అర్హత సాధించారన్నారు. 260 మందికి టెట్ మరియు డీఎస్సీ పోటీ పరీక్షలకు తన సొంత నిధులతో హైదరాబాదు నుండి ఫ్యాకల్టీని రప్పించి ఉచితంగానే మెటీరియల్ను కూడా పంపిణీ చేయించినట్లు తెలిపారు. ప్రస్తుతం కానిస్టేబుల్, గ్రూప్స్, వీఆర్ఏ, వీఆర్వో లాంటి పోటీ పరీక్షలకు ఎంపిక చేసిన 1264 మంది విద్యార్థులకు హైదరాబాదులోని అత్యుత్తమ ఫ్యాకల్టీతో తన సొంత నిధులతో జిల్లా కేంద్రంలో ఉచితంగానే కోచింగ్ ఇప్పిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Also Read: Hydraa News: హైడ్రా చీఫ్ వద్దకు స్కూల్ పిల్లలు.. విషయం ఏంటంటే?

భావితరాలకు ఓ ప్రజా ప్రతినిధిగా తాను మంచి విద్యను, సంస్కృతిని అందివ్వాలనే విశాల దృక్పథంతో ముందుకెళ్తున్నానన్నారు. మహబూబ్ నగర్‌ను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలన్నదే తన అంతిమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందిర బోయి, మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్, పిసిసి అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, సెట్విన్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వసంత, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ పి వెంకటేష్, మారేపల్లి సురేందర్ రెడ్డి, శ్రీమతి యెన్నం లక్ష్మి ప్రసన్న, మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, డివైఎస్ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు