Bomb Threat to Airport: అహ్మదాబాద్ ఘోర ప్రమాదాన్ని మరిచిపోకముందే వరుస బాంబు బెదిరింపు ఘటనలు విమాన ప్రయాణికులను భయందోళనకు గురిచేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపులు చూసి హడిలిపోతున్నారు. ఈ క్రమంలోనే ఏకంగా ఓ ఎయిర్ పోర్ట్ కే బాంబు బెదిరింపు కాల్ రావడం మరింత ఆందోళనలకు దారి తీసింది. హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ (Begumpet Airport)కు బెదిరింపు కాల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
అగంతకుల కాల్!
ఈరోజు ఉదయం (బుధవారం) 10:30 గంటల ప్రాంతంలో బేగంపేట్ విమానాశ్రయానికి కాల్ వచ్చింది. విమానాశ్రయంలో బాంబు ఉన్నట్లు గుర్తుతెలియని వ్యక్తులు హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబ్బంది.. బాంబ్ స్క్వాడ్ టీమ్ (Bomb Squad Team) కు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ టీమ్.. ఎయిర్ పోర్టులోని ఉద్యోగులు, ప్రయాణికులను వెంటనే బయటకు పంపించి వేసింది.
Also Read: Trump on Iran: ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం.. రంగంలోకి అమెరికా.. ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!
క్షుణ్ణంగా తనిఖీలు.. చివరికి!
అనంతరం బాంబు స్క్వాడ్, ఎస్పీఎఫ్ పోలీసులు (SPF Police) విమానశ్రయమంతా క్షుణ్ణంగా పరిశీలించారు. బాంబు ఉందేమోనన్న అనుమానంతో ప్రతీ మూలన జల్లెడ పట్టారు. అయితే ఎక్కడా బాంబు లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బాంబు బెదిరింపునకు సంబంధించిన కాల్ ను ఫేక్ గా తేల్చారు. కాల్ చేసిన నెంబర్ ఆధారంగా అగంతకులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Bomb scare at Hyderabad #BegumpetAirport. Strangers sent threats by mail. Telangana Special Protection Force, #CISF on alert. Airport employees and staff evacuated.
Cybercrime officials have started an investigation.#airportsecurity #Airport pic.twitter.com/etwoWSqzVR— SHRA.1 ✍ (@shravanreporter) June 18, 2025