Special Meeting On Banakacherla Project(image credit: twitter)
తెలంగాణ

Special Meeting On Banakacherla Project: బనకచర్లపై పీపీపీ.. లోక్‌సభ రాజ్యసభ సభ్యులకు ఆహ్వానం!

  1. Special Meeting On Banakacherla Project: గోదావరి, బనకచర్ల ప్రాజెక్టుపై సచివాలయంలో  సాయంత్రం 4 గంటలకు లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ముఖ్య అతిథిగా పాల్గొంటారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. ఈ మేరకు  ప్రకటన విడుదల చేశారు. గోదావరి, బనకచర్ల ప్రాజెక్టును మరింత పటిష్టంగా ప్రతిఘటించడంతో పాటు కేంద్ర జలసంఘం అనుమతులు ఇవ్వకుండా ఒత్తిడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ పథకాన్ని రూపొందిస్తున్నదని మంత్రి ఉత్తమ్ (Uttam Kumar Reddyపేర్కొన్నారు.

ఈ సమావేశంలో ప్రత్యేక అతిథులుగా కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, (Kishan Reddy) (Bandi Sanjay)  బండి సంజయ్‌లను ఆహ్వానించామని, స్వయంగా తాను ఫోన్ చేసి రావాలని కోరినట్లు వెల్లడించారు. అందుబాటులో ఉన్న లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి సమావేశంలో పాల్గొనాలని కోరానన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి, (Revanth Reddy)  తాను 2025 జూన్ 3న ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను స్వయంగా కలిసి తెలంగాణ ప్రభుత్వం (Telangana Government)  తరపున అభ్యంతరాలను లేవనెత్తామన్నారు.

 Also Read: Mahesh Kumar Goud: కేసీఆర్ కేటీఆర్‌పై.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

కేంద్రమంత్రి స్పందిస్తూ 2025 మే 28న తనకు రాసిన లేఖలో లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు అందలేదని చెబుతూనే అది అందిన మీదట నీటి కేటాయింపులలో ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలు, ట్రైబ్యునల్ తీర్పులు, అంతర్రాష్ట్ర ఒప్పందాలతో పాటు 2014 ఆంద్రప్రదేశ్ (Andrapradesh)  పునర్వ్యవస్థీకరణ చట్టాలను పరిగణనలోకి తీసుకున్నాకే సమీక్షిస్తామన్నారని వివరించారు. తిరిగి 2025 జూన్ 13న తాను కేంద్ర జలశక్తి మంత్రికి రాసిన లేఖలో (Godavari Project) గోదావరి, బనకచర్లపై (Banakacherla Project)అభ్యంతరాలను తెలియపరచడం జరిగిందన్నారు.

అంతేకాకుండా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులను కేంద్ర జల సంఘం నిలువరించాలని డిమాండ్ చేశామన్నారు. వీటన్నింటినీ సమీక్షించిన మీదట ఈ విషయంలో భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశామని ఉత్తమ్ (Uttam Kumar Reddy) తెలిపారు.

 Also Read: Water Diversion: బనకచర్లను అడ్డుకోవాలని.. కేంద్రానికి లేఖలు!

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!