BJP MLA Suryanarayana: కాంగ్రెస్ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు అందిస్తోందని, అయితే అందులో పెద్ద స్కాం జరుగుతోందని బీజేపీ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త ఆరోపణలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం సబ్సిడీ ఇస్తున్న ఎలక్ట్రికల్ బస్సులను కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు లేకుండా వాడుకుంటోందని ఆయన విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం జన గణనతో పాటు కుల గణన చేపట్టాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణ చేసిన కుల గణన తప్పుల తడక అని గుప్త విమర్శలు చేశారు.
అబద్ధపు హామీలతో కాంగ్రెస్
అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల గణనను బీజేపీ వ్యతిరేకించడంతో మరో రెండు మూడు రోజులు సమయం ఇచ్చారని, దీన్ని కూడా మమ అనిపించారన్నారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. తెలంగాణలో 45 శాతానికి మించి రుణమాఫీ జరగలేదని ధన్ పాల్ చెప్పుకొచ్చారు. బీసీలంటే కాంగ్రెస్ కు లెక్క లేదని, ఇందిరమ్మ ఇండ్ల ప్రాసెస్ నత్త నడకన సాగుతోందన్నారు. ఒకవేళ కాంగ్రెస్ నత్తతో పోటీ పడితే నత్తే గెలుస్తుందని ధన్ పాల్ ఎద్దేవాచేశారు.
Also Read: CM Revanth Reddy: నాయకులు క్యాడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేయాలి!
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు
నిజామాబాద్ జిల్లాలో ఒక్క అర్హుడైన పేదవాడికి కూడా ఇందిరమ్మ ఇల్లు దక్కలేదన్నారు. కాలేజీలు పున:ప్రారంభమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయడం లేదని విమర్శించారు. డబ్బులు రిలీజ్ అవ్వక విద్యార్థులు ఉద్యోగాలు కోల్పోతుంటే యాజమాన్యాలు ఆత్మహత్య చేసుకుంటున్నాయని, బీసీ రిజర్వేషన్ల అంశంపై స్పష్టత వచ్చాకే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలని ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త డిమాండ్ చేశారు.
Also Read: Chevireddy: పోలీసుల అదుపులో వైసీపీ కీలక నేత చెవిరెడ్డి.. ఇక చుక్కలేనా?