Father: మనం అడిగినవన్నీ ఇవ్వకపోవచ్చు కానీ, అవసరం ఉన్న ప్రతీది ఎంత కష్టమైనా తీసుకొచ్చి ఇస్తాడు నాన్న. అలాంటిది పిల్లలు ఆపదలో ఉంటే ఊరుకుంటాడా. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. అలా రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించి మధ్యలో ఆగిపోయిన కూతురిని కాపాడేందుకు తండ్రి చేసిన ప్రయత్నం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకొచ్చింది.
రైలు పట్టాలు దాటుతుండగా..
వీడియోలో కనిపిస్తున్నదాన్నిబట్టి, ఓ యువతి ప్లాట్ ఫామ్ మీద నుంచి రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. పట్టాలపై ఉండగా, వేగంగా రైలు వచ్చేసింది. దీంతో ఆమె షాకయి అక్కడే నిలబడిపోయింది. ఇదే చివరి రోజు అనుకుంటూ భయంతో ఉన్న యువతిని తన తండ్రి గమనించి వెంటనే పట్టాల మీదకు దూకాడు. ప్లాట్ ఫామ్, రైలు పట్టాల మధ్య ఉండే గ్యాప్ వైపునకు కూతురిని తోసి తాను కూడా పడుకున్నాడు. ఆమె అటూ ఇటూ కదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఇంతలో ట్రైన్ వేగంగా వచ్చి వెళ్లిపోయింది. తండ్రి సాహసాన్ని, కూతురిపై ఉన్న ప్రేమను చూసినవారు ఎమోషనల్ అవుతున్నారు. కొందరైతే రన్నింగ్ ట్రైన్ వస్తున్న సమయంలో ఇలాంటి ఫీట్లు అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు.
In Cairo, Egypt, a young girl accidentally falls onto the railway tracks.
A speeding train approaches…
In a split second, her father jumps in and shields her with his own body, saving her life. 🙏#FathersLove #HeroDad #Cairo #ViralVideo #Parenting #RealHero #FatherDaughter pic.twitter.com/KN0yyk42r7— Times of IND (@TimesOfInd) June 17, 2025
Read Also- Aap Jaisa Koi: డైరెక్ట్‌గా ఓటీటీలోకి మాధవన్, ఫాతిమా సనా షేక్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ డిటైల్స్ ఇవే!
ఫ్లోరిడాలో తండ్రి ప్రాణత్యాగం
మరోవైపు, అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఫోర్ట్ లాడర్‌డేల్ బీచ్‌లో విషాదం నెలకొన్నది. ఆంట్వోన్ విల్సన్ అనే వ్యక్తి తన ఇద్దరి పిల్లలను తీసుకుని బీచ్‌కు వెళ్లాడు. అందరూ ఆనందంగా గడిపారు. అయితే, ఇద్దరు పిల్లలు ఈత కోసం సముద్రంలోకి వెళ్లి కొట్టుకుపోయారు. దీన్ని గమనించిన ఆంట్వోన్ విల్సన్, వెంటనే సముద్రంలోకి దూకాడు. అక్కడున్నవారు వెంటనే 911కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఫైర్ రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వారు వచ్చే సమయానికి పిల్లలు మునిగిపోకుండా విల్సన్ పట్టుకుని ఉన్నాడు. మరో వ్యక్తి పిల్లలను ఒడ్డుకు చేర్చాడు. దురదృష్టవశాత్తూ విల్సన్ మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి సముద్రం అడుగున అతడి మృతదేహాన్ని గుర్తించారు. ఒడ్డుకు తీసుకొచ్చి ప్రథమ చికిత్స చేశారు. తర్వాత ఆస్పత్రికి తసుకెళ్లారు. అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. తండ్రి ప్రాణ త్యాగానికి సంబంధించిన ఈ వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Read Also- Bayya Sunny Yadav: వైజాగ్‌లోని అన్వేష్ ఇంటికి భయ్యా సన్నీ యాదవ్.. టెన్షన్ టెన్షన్