Aap Jaisa Koi Still
ఎంటర్‌టైన్మెంట్

Aap Jaisa Koi: డైరెక్ట్‌గా ఓటీటీలోకి మాధవన్, ఫాతిమా సనా షేక్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ డిటైల్స్ ఇవే!

Aap Jaisa Koi: ఈ మధ్య కాలంలో ఆర్. మాధవన్ (R Madhavan) చేసే సినిమాలు యమా క్రేజ్‌ని సొంతం చేసుకుంటున్నాయి. ఆయన చేస్తుంది తక్కువ సినిమాలే అయినా, మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన, ‘దంగల్’ బ్యూటీ ఫాతిమా సనా షేక్‌ (Fatima Sana Shaikh) కలిసి నటించిన చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలోకి రాబోతుంది. ఈ మేరకు మేకర్స్ స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. ఆర్. మాధవన్, ఫాతిమా సనా షేక్ కాంబోలో వివేక్ సోని (Vivek Soni) రూపొందించిన చిత్రం ‘ఆప్ జైసా కోయి’. కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమా ఏ ఓటీటీలో, ఎప్పుడు విడుదల అవుతుందంటే..

కరణ్ జోహార్ సినిమా విడుదల అవుతుందంటే చాలు.. బాయ్‌కాట్ సెగ తగులుతూ ఉంది. ఇది కొంతకాలంగా ఆయన ఫేస్ చేస్తున్నారు. మరి అందుకోసం చేస్తున్నారో.. లేదంటే అదిరిపోయే ఓటీటీ డీల్ కుదిరిందో తెలియదు కానీ.. ఆయన నిర్మించిన ‘ఆప్ జైసా కోయి’ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో (Netflix India) డైరెక్ట్‌గా విడుదలకాబోతోంది. జూలై 11 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటూ, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీతో పాటు, చిత్రయూనిట్ కూడా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందులో శ్రీరేణు పాత్రలో సంస్కృత ఉపాధ్యాయుడిగా ఆర్. మాధవన్ కనిపించనుండగా, ఫ్రెంచ్ బోధించే మధు పాత్రలో ఫాతిమా సనా షేక్ నటించారు. చాలా గ్యాప్ తర్వాత ఆర్. మాధవన్ తను ఇష్టపడే రొమాన్స్ జానర్‌లో నటించారు. ఈ చిత్రం కుటుంబ సంబంధాలు, అనుబంధాల అవసరాన్ని తెలియజేసేలా.. ఓ మంచి ప్రేమకథగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

Also Read- Puri Sethupathi: కత్తిలాంటి హీరోయిన్‌ని పట్టిన పూరి, చార్మి! ఈసారి హిట్టు పక్కా!

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వివేక్ సోని మాట్లాడుతూ.. మనం మన చుట్టూ నిర్మించుకుంటున్న కొన్ని కట్టుబాట్లను ఈ సినిమాలో చర్చించాం. ముఖ్యంగా బంధాలు, అనుబంధాలు వ్యక్తిగత కారణాల వల్ల ఎలా దూరమవుతున్నాయో చాలా సున్నితంగా చూపించాం. నిత్యజీవితంలోని కొన్ని పాత్రలను ఈ సినిమా నిశ్శబ్దంగా ప్రశ్నించినట్లుగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మన చుట్టూ మనం నిర్మించుకుంటున్న గోడల నుంచి ఎలా విముక్తిని పొందాలనేది తెలుపుతుంది. ఇందులో ఒక అద్భుతమైన ప్రేమకథ ఉంది. అది కచ్చితంగా ప్రేక్షకులను టచ్ చేస్తుంది. ఆర్. మాధవన్, ఫాతిమా వారి పాత్రలను అద్భుతంగా పోషించారు. సోషల్ మీడియాను ఫాలో అవుతూ.. అందులోని 40 ఏళ్ల వ్యక్తితో 30 ఏళ్ల మహిళ ఎలా ప్రేమలో పడింది? వారి ప్రేమ ఎంత వరకు వెళ్లింది? అనే పాయింట్ చుట్టూ తిరుగుతూ.. మనుషుల మధ్య నిజమైన బంధాల అవసరాన్ని, విలువలను తెలిపే చిత్రమే ‘ఆప్ జైసా కోయి’. జూలై 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌‌లో ఈ సినిమా అందుబాటులోకి వస్తుంది. అందరూ ఈ సినిమాను చూడాలని కోరుతున్నాను. ఎవ్వరినీ డిజప్పాయింట్ చేయదు. అన్ని రకాల అంశాలు ఇందులో ఉన్నాయి. అన్ని భాషల వారికి కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇందులో ఉందని అన్నారు.

Also Read- Genelia Marriage: ఆ స్టార్ హీరోతో జెనీలియా సీక్రెట్ పెళ్లి.. 14 ఏళ్ల తర్వాత బయటకొచ్చిన నిజం.. అతనెవరంటే?

నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఒరిజినల్ ఫిల్మ్స్ డైరెక్టర్ రుచికా కపూర్ మాట్లాడుతూ.. ‘ఆప్ జైసా కోయి’ అనేది ఆశలు సన్నగిల్లిన, సంప్రదాయాలు అడ్డుకున్న ప్రేమ జంట గురించి తెలిపే రొమాంటిక్ డ్రామా. వివేక్ సోని అద్భుతమైన విజన్, విజువల్స్‌తో పాటు.. ఆర్. మాధవన్, ఫాతిమా సనా షేక్, అయేషా రజా వంటి నటుల నటనతో ఒక క్లాసిక్ కథను నెట్‌ఫ్లిక్స్ వీక్షకులకు అందిస్తున్నాం. ఈ సంవత్సరం మేము నెట్‌ఫ్లిక్స్‌కు అందిస్తున్న బలమైన చిత్రాల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఈ సినిమా నిలుస్తుందని భావిస్తున్నామని తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!