Puri Vijay Sethupathi Film Update
ఎంటర్‌టైన్మెంట్

Puri Sethupathi: కత్తిలాంటి హీరోయిన్‌ని పట్టిన పూరి, చార్మి! ఈసారి హిట్టు పక్కా!

Puri Sethupathi: డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh), మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఎంతో ప్రతిష్టాత్మకంగా పూరి ఈ సినిమాను రూపొందించబోతున్నారు. పూరి సిగ్నేచర్ స్టైల్, విజయ్ సేతుపతి మాగ్నెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి లొకేషన్స్ వేట మొదలైనట్లుగా మేకర్స్ ఇటీవల ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అలాగే ఎంపికైన నటీనటులను ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ కత్తిలాంటి హీరోయిన్ ఈ సినిమాలో భాగమైనట్లుగా మేకర్స్ తెలియజేశారు.

Also Read- SS Rajamouli: ఎస్. ఎస్. రాజమౌళి ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా? షాకవుతారు!

ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ‘బింబిసార’, ‘భీమ్లా నాయక్’, ‘సార్’, ‘విరూపాక్ష’ వంటి చిత్రాలతో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా ముద్ర వేయించుకున్న సంయుక్త (Samyuktha) ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమైనట్లుగా తెలుపుతూ పూరి కనెక్ట్స్ అఫీషియల్‌గా ప్రకటించింది. ‘ఆమె నడకలో హుందాతనం, కళ్లల్లో ఆగ్రహం’ అంటూ సంయుక్తకు టీమ్ స్వాగతం పలికింది. అంతేకాదు.. పూరి, ఛార్మీలతో సంయుక్త ఉన్న ఫొటోని కూడా షేర్ చేశారు. అయితే ఇందులో సంయుక్త పాత్ర ఏమిటనేది మాత్రం మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. విజయ్ సేతుపతి సరసన హీరోయిన్‌గా నటిస్తుందా? లేదంటే వేరే ఏదైనా కీలక పాత్రలో కనిపిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. మరో వైపు, ఇటీవలే ఈ ప్రాజెక్ట్‌లోకి టబుని తీసుకున్న విషయం తెలిసిందే. విజయ్ సేతుపతి సరసన టబు హీరోయిన్‌గా చేస్తుందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు సంయుక్త పాత్ర ఎలా ఉంటుందనేది చాలా ఆసక్తికరంగా మారింది.

Also Read- Sobhita Dhulipala: మరిది అఖిల్ పెళ్లి.. టాప్ సీక్రెట్ చెప్పేసిన శోభిత.. ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

ఈ సినిమాకు ‘బెగ్గర్’, ‘భిక్షాందేహి’ అనే టైటిల్స్‌ని పరిశీలిస్తున్నట్లుగా టాక్ వినబడుతుంది. ఇక సంయుక్త ఈ ప్రాజెక్ట్‌లో భాగమవడంతో.. పూరి కష్టాలన్నీ తిరినట్లే.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఎందుకంటే, సంయుక్త‌ను టాలీవుడ్ గోల్డెన్ లెగ్‌గా అంతా భావిస్తుంటారు. ఆమె ఈ ప్రాజెక్ట్‌లో భాగమవడంతో.. ఈసారి పూరికి హిట్ పక్కా అనేలా అప్పుడే టాక్ మొదలైంది. మరోవైపు సంయుక్త వరుస ప్రాజెక్ట్స్‌తో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ ఛైర్ కోసం పోటీ పడుతున్నారు. నిఖిల్ సరసన ‘స్వయంబు’, నటసింహం బాలయ్య సరసన ‘అఖండ 2’, శర్వానంద్‌తో ‘నారి నారి నడుమ మురారి’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘హైందవ’లో.. ఇలా వరుస ప్రాజెక్ట్‌తో సంయుక్త టాలీవుడ్‌లో దూసుకెళుతోంది. పూరి, సేతుపతి సినిమాలో సంయుక్త పాత్ర చాలా కొత్తగా ఉంటుందని.. టీమ్ చెబుతోంది. విజయ్ సేతుపతి నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో కనిపించనున్న ఈ సినిమాలో శాండల్‌వుడ్ డైనమో విజయ్ కుమార్ మరో కీలక పాత్రను పోషిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!