Kaleshwaram Project Commission: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పీసీ ఘోష్ కమిషన్ (PC Ghosh Commission) విచారణ ముమ్మరంగా సాగుతోంది. రీసెంట్ గా కేసీఆర్ (KCR), హరీశ్ రావు (Harish Rao), ఈటల రాజేందర్ (Etela Rajender)లను విచారించిన కమిషన్.. తాజాగా కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో కేబినెట్ నిర్ణయాలపై ఆరా తీసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి గత ప్రభుత్వంలో మంత్రి వర్గం చేసిన తీర్మానాల వివరాలను అందజేయాలని కమిషన్ చీఫ్ పీసీ ఘోష్.. రేవంత్ ప్రభుత్వాన్ని కోరారు.
మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barraige) కుంగడం, అన్నారం (Annaram), సుందిళ్ల బ్యారేజీ (Sundilla Barraige)ల సీపేజీల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) న్యాయవిచారణకు ఆదేశించింది. కాళేశ్వరంలో జరిగిన అవినీతి తేల్చేందుకు విశ్రాంత న్యాయమూర్తి పీసీ ఘోష్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఇటీవల కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ ను కమిషన్ ప్రశ్నించగా.. కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు క్యాబినేట్ ఆమోదంతోనే జరిగినట్లు వారు చెప్పారు. దీంతో మంత్రివర్గ తీర్మానాలు అందజేయాలని రేవంత్ సర్కార్ ను కోరింది.
Also Read:Phone Tapping Case: పెను సంచలనం.. షర్మిల ఫోన్ సైతం ట్యాప్.. జగనే చేయించారా?
అయితే గతంలోనూ రెండు పర్యాయాలు తెలంగాణ ప్రభుత్వానికి కమిషన్ లేఖలు రాసింది. ఇంజనీర్ల ఓపెన్ కోర్ట్ స్టేట్ మెంట్ ఇచ్చిన్పపుడు, ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత లేఖలు పంపింది. అయితే గతంలో రాసిన లేఖలకు రేవంత్ సర్కార్ పూర్తి సమాచారం ఇవ్వలేదు. దీంతో తాజాగా మరోమారు లేఖ రాసినట్లు తెలుస్తోంది. గత మంత్రి వర్గ తీర్మానాలను అందించే విషయంలో.. రేవంత్ సర్కార్ (Revanth Reddy) ప్రస్తుత కేబినేట్ తో చర్చించే అవకాశముంది. కేబినేట్ నిర్ణయానికి అనుగుణంగా కమిషన్ లేఖపై స్పందించనుంది.