Baba Vanga Prediction (Image Source: Twitter)
Viral, లేటెస్ట్ న్యూస్

Baba Vanga Prediction: ముంచుకొస్తున్న ముప్పు.. ఆ రోజున ఏం జరగబోతోంది.. నెట్టింట ఒకటే చర్చ!

Baba Vanga Prediction: బాబా వంగా (Baba Vanga) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెను ప్రసిద్ధ కాలజ్ఞానిగా అందరూ విశ్వసిస్తుంటారు. బల్గేరియాకు చెందిన బాబా వంగాకు చూపు లేనప్పటికీ ఆమెకు ఉన్న అతీంద్రియ శక్తుల ద్వారా దైవ దూతలతో మాట్లాడగలిగేవారని చాలా మంది నమ్మకం. 1996లోనే ఆమె మరణించినప్పటికీ బాబా వంగా చెప్పిన భవిష్యవాణి చాలా వరకూ నిజమవుతూ వచ్చింది. అయితే ఆమెకు కొనసాగింపుగా ‘న్యూ బాబా వంగా’గా పిలువబడే జపనీస్ మాంగా కళాకారిణి రియో టాట్సుకి (Ryo Tatsuki) తెరపైకి వచ్చారు. తనకు కలలో జరగబోయేది కనిపిస్తుందని ఆమె చెబుతుంటారు. అయితే తాజాగా జపాన్ విషయంలో న్యూ బాబా వంగా చెప్పిన జోస్యం తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఇంతకీ ఆమె ఏం చెప్పారు? సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న భయాందోళనలు ఏంటి? ఇప్పుడు పరిశీలిద్దాం.

ఆ రోజున భారీ సునామీ!
న్యూ బాబా వంగా అలియస్ రియో టాట్సుకి (Ryo Tatsuki).. జపాన్ కు సంబంధించి కీలక భవిష్యవాణి చెప్పారు. 2025 జులై 5న జపాన్‌లో భారీ ప్రకృతి విపత్తు సంభవిస్తుందని ఆమె అంచనా వేశారు. ఆమె తన పుస్తకం “ది ఫ్యూచర్ ఐ సా” (The Future I Saw)లో ఈ ప్రిడిక్షన్‌ను పేర్కొన్నారు. ఈ విపత్తు జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో టెక్టానిక్ ప్లేట్ల విభజన లేదా అగ్నిపర్వత విస్ఫోరణం వల్ల సంభవించవచ్చని చెప్పారు. ఇది మెగా సునామీ లేదా భూకంపం రూపంలో ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. తన కలలో సముద్రం నుంచి భారీ గాలి బుడగలు (ఎయిర్ పాకెట్స్) బయటకు వస్తున్న దృశ్యాలు కనిపించాయని.. ఇది సముద్ర గర్భంలో అగ్నిపర్వత పేలుడుకు సంకేతమని న్యూ బాబా వంగా తన పుస్తకంలో రాసుకొచ్చారు. ఈ సునామీ జపాన్‌తో పాటు తైవాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా వంటి తీర ప్రాంతాలను కూడా ప్రభావితం చేయవచ్చని ఆమె అంచనా వేశారు.

టూరిజంపై దెబ్బ!
జపాన్ పై న్యూ బాబా వంగా భవిష్యవాణి నేపథ్యంలో దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. #July5Disaster హ్యాష్ ట్యాగ్ ను నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. దీంతో జులైలో జపాన్ కు వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జపాన్ టూరిజం బుకింగ్స్ లో భారీ కోత కనిపిస్తున్నట్లు ట్రావెల్ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. చైనాలోని హాంగ్ కాంగ్ నుంచి వచ్చే ఫ్లైట్స్, హోటల్ బుకింగ్స్ 50 శాతం మేర పడిపోయినట్లు బ్లూమ్ బర్గ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెల్లడించింది. అలాగే చైనాతో పాటు థాయిలాండ్, వియాత్నం నుంచి వచ్చే బుకింగ్స్ సైతం 83 శాతం మేర పడిపోయినట్లు పేర్కొంది. జులైలో జపాన్ పర్యటనను రద్దు చేసుకోవడం లేదా పోస్ట్ పోన్ చేసుకోవడం వంటివి చేస్తున్నారని బ్లూమ్ బర్గ్ స్పష్టం చేసింది. దీనివల్ల జపాన్ టూరిజంపై పెను ప్రభావం పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.

Also Read: Israel attack on Iran: వార్తలు చదువుతుండగా క్షిపణి దాడి.. ప్రాణ భయంతో పరిగెత్తిన యాంకర్!

జపాన్ అధికారుల భరోసా!
జులై 5న తమ దేశంలో ఉపద్రవం రానున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని పర్యటకులు ఎవరూ నమ్మవద్దని జపాన్ అధికారులు సూచిస్తున్నారు. మియాగి గవర్నర్ యోషిహిరో మురాయ్ (Miyagi Governor Yoshihiro Murai) మీడియాతో మాట్లాడారు. జపాన్ ప్రజలు ఉపద్రవం గురించి ఏమాత్రం ఆందోళన చెందడం లేదని అన్నారు. భయపడి ఎవరు పారిపోవడం లేదని చెప్పారు. కాబట్టి పర్యటకులు సైతం పుకార్లు నమ్మవద్దని సూచించారు. వారు యధావిధిగా జపాన్ లో పర్యటిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు..

Also Read This: Air India Flight: మరో ఎయిర్ఇండియా విమానంలో సమస్య.. హడలిపోయిన ప్రయాణికులు!

 

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?