CM Revanth Reddy: రైతులను కాదనుకున్న వారు అధికార పీఠంపై కూర్చోలేరని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. సర్పంచ్ నుంచి సీఎం వరకు ఏ పదవి రావాలన్నా, రైతులకు అండగా నిలవాల్సిందేనని చెప్పారు. రైతుల (farmers) ఆశీర్వాదం ఉంటేనే పాలకుల కుర్చీలు పదిలంగా ఉంటాయన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతును రాజును చేయడమే కాకుండా వ్యవసాయాన్ని పండుగలా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (Professor Jayashankar Agriculture University) ఆడిటోరియంలో 1,031 రైతు వేదికల్లో ‘రైతు నేస్తం’ (Rythu Nestham) కార్యక్రమాన్ని సీఎం (CM)) లాంఛనంగా ప్రారంభించారు.
వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రం నలుమూలలా ఉన్న రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం (CM) ముచ్చటించారు. అనంతరం ప్రసంగించారు. 18 నెలల కాలంలోనే ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వారా రైతుల (farmers) కోసం రూ.1.01 లక్షల కోట్లను ఖర్చు పెట్టిందని ప్రకటించారు. వచ్చే 9 రోజుల్లో రూ.9వేల కోట్లను రాష్ట్రంలోని 49 లక్షల ఎకరాలకు సంబంధించి 70,11,984 మంది రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నట్లు చెప్పారు. ప్రభుత్వానికి ఎన్ని కష్టాలు ఉన్నా రైతులు (farmers) కష్టాలు పడకూడదనే భరోసాకు నిధులను విడుదల చేశామన్నారు.
Also Read: KTR: ప్రజల్లో చర్చిద్దామంటే రేవంత్ పారిపోయాడు.. కేటీఆర్ సంచలన కామెంట్స్!
బీఆర్‌ఎస్‌ది వందేళ్ల విధ్వంసం
బీఆర్‌ఎస్ చేసిన వందేళ్ల విధ్వంసం కోలుకోలేనిదని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ కొందరికే చుట్టంగా మారిందని విమర్శించారు. గత సీఎం అందినకాడికల్లా అప్పులు చేసి రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని అన్నారు. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి దిగజార్చారని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్‌తో అరాచకం చేశారని, భార్యాభర్తలు కూడా స్వేచ్చగా మాట్లాడుకోలేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేదన్నారు. వాళ్లు చేసిన తప్పులను సరి చేయడానికి రోజుకు 18 గంటలు పనిచేయాల్సి వస్తోందని తెలిపారు.
బిల్లులు రాలేదని చాలామంది మాజీ సర్పంచులు అక్కడక్కడా ఆందోళన చేస్తున్నారని, వారికి పెండింగ్‌లో పెట్టింది గత ప్రభుత్వమేనన్నారు. తాను సీఎం అయ్యే నాటికే సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిపోయిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీకే సరిపోలేదని, తాము ఆరు నెలల్లోనే మాఫీ చేసి చూపించామన్నారు. మొదటి రోజు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీఆర్‌ఎస్ (BRS) నేతలు కుట్ర చేశారని ఆరోపించారు. పదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపిన వారు 18 నెలలు తిరగకముందే ఈ ప్రభుత్వాన్ని నిందిస్తూ, దూషిస్తూ వీధి నాటకాలతో బయలుదేరారని సీఎం మండిపడ్డారు.
రాష్ట్రంలో ఎవరు, ఏ విధంగా చనిపోయినా ప్రతిపక్ష నేతలు సంబురపడిపోతున్నారని, చావుల పునాదులపై అధికారంలోకి రావాలని చూస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం ఎన్ని నిధులు ఖర్చు చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రతి పైసాకు అసెంబ్లీలో లెక్కలు వివరిస్తానని, చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు. అధికారం కోల్పోయాక కూడా బీఆర్‌ఎస్ (BRS) నేతల్లో అసూయ, అక్కసు, అహంభావాలు అలాగే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఎవరు బట్టలు చించుకున్నా పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే (Congress Government) ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
వరి సాగులో దేశంలోనే నెంబర్ వన్
వరి వేస్తే ఉరే అని ఆనాటి ప్రభుత్వం చెప్పిందని, వరి వేయండి చివరి గింజ వరకు కొనే బాధ్యత మాది అని ప్రజా ప్రభుత్వం చెప్పిందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. పేదలకు సన్నబియ్యం ఇచ్చేందుకు రైతులు (farmers) సన్న వడ్లు పండించేలా ప్రోత్సహించామని తెలిపారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ప్రకటించడంతో రాష్ట్రంలో 60 శాతం సన్న వడ్లు పండుతున్నాయని, దీనివల్లనే పేదలకు అందించగలుగుతున్నామని పేర్కొన్నారు.
ఒక్క ఏడాదిలోనే 2 కోట్ల 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించి తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నానని, తెలంగాణ ముఖ్యమంత్రిగా తనకు ఇంతకంటే ఏం కావాలని వ్యాఖ్యానించారు. రైతులు (farmers) ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నుంచి ఆత్మగౌరవంతో బతికే పరిస్థితిని కల్పించామన్నారు. ఏడాదిలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని చెప్పారు.
వాణిజ్య పంటలు, ఇతర పంటల సాగు రైతులకు సోలార్ పంపుసెట్లతో కలిగే ప్రయోజనాలపై కలెక్టర్లు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సభా వేదికపై నుంచే సీఎం ఆదేశాలు ఇచ్చారు. రైతులకు (farmers) ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ రావు,( Ponnam Prabhakar) సీతక్క, (Seethakka) వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.
ఎకరాలతో సంబంధం లేకుండా రైతు భరోసా: ఉప ముఖ్యమంత్రి
ఎకరాలతో సంబంధం లేకుండా రైతులందరి (farmers) అకౌంట్లలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Batti Vikramarka) అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి రూ.12 వేలను అందిస్తున్నామని, రానున్న 9 రోజుల్లో రూ.9 వేల కోట్లను జమ చేస్తామని చెప్పారు. పదేళ్లు పాలించిన వారు ప్రజా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజానీకం గుర్తించాలన్నారు. ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
దేశానికి రేవంత్ పథకాలు కావాలి: మంత్రి తుమ్మల
దేశానికి తెలంగాణ ప్రభుత్వ పాలన, రేవంత్ రెడ్డి (Revanth Reddy) లాంటి పాలన కావాలని అందరూ కోరుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswar Rao) అన్నారు. ఒక్క ఏడాదిలోనే పక్క రాష్ట్రాలు (tTelangana) తెలంగాణను అనుసరిస్తుండడం గర్వకారణమని చెప్పారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమన్నారు. రైతులు (farmers) సుభిక్షంగా ఉండాలని, పచ్చని పంటలతో ఆనందంగా ఉండేందుకు రాబోవు రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామని ప్రకటించారు.
Also Read: CM Revanth Reddy: నర్సింగ్ కళాశాలల్లో ఆప్షనల్‌గా జపనీస్.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం