CM Revanth Reddy (Image Source: Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

CM Revanth Reddy: న‌ర్సింగ్ క‌ళాశాల‌ల్లో ఆప్ష‌న‌ల్‌గా జ‌ప‌నీస్.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం

CM Revanth Reddy: రాష్ట్రంలోని 34 వైద్య కళాశాల‌లు పూర్తి స్థాయి వ‌స‌తుల‌తో ప‌ని చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి.. ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకు అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను వెంట‌నే త‌యారు చేయాల‌ని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఆ క‌మిటీ ప్ర‌తి క‌ళాశాల‌ను సంద‌ర్శించి అక్కడి అవసరాలను తెలుసుకోవడంతో పాటు త‌క్ష‌ణ‌మే పూర్తి చేయాల్సిన ప‌నులు, ప్ర‌భుత్వ‌ప‌రంగా అందించాల్సిన స‌హాయం త‌దిత‌ర వివ‌రాల‌తో నివేదికను స‌మ‌ర్పించాల‌ని సీఎం ఆదేశించారు.

వాటిపై సమగ్ర నివేదిక ఇవ్వండి: సీఎం
సీఎం రేవంత్ రెడ్డి వైద్యారోగ్య శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ వైద్య మండ‌లి (ఎన్ఎంసీ) రాష్ట్రంలోని వైద్య క‌ళాశాల‌ల‌కు సంబంధించి లేవ‌నెత్తిన ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల్లో నియామ‌కాలు, బోధ‌న సిబ్బందికి ప్ర‌మోష‌న్లు, వైద్య క‌ళాశాల‌ల‌కు అనుబంధంగా ఉన్న ఆసుప‌త్రుల్లో ప‌డ‌క‌ల పెంపు, ఆయా క‌ళాశాల‌ల‌కు అవ‌స‌ర‌మైన వైద్య ప‌రిక‌రాలు, ఖాళీల భ‌ర్తీ వీట‌న్నింటిపై స‌మ‌గ్ర నివేదిక రూపొందించి అందించాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి విడుద‌ల చేయాల్సిన నిధులను వెంట‌నే విడుద‌ల చేస్తామ‌ని సీఎం తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి నిధులు, అనుమ‌తులకు సంబంధించిన అంశాలుంటే వెంట‌నే తెలియజేయాల‌ని, కేంద్ర మంత్రి న‌డ్డా, ఆ శాఖ అధికారుల‌ను సంప్ర‌దించి వాటిని ప‌రిష్క‌రిస్తామ‌ని సీఎం పేర్కొన్నారు.

Also Read: Seethaka on KTR: కవితతో పోటీ.. అరెస్ట్ కోసం కేటీఆర్ తాపత్రయం.. మంత్రి సీతక్క

ప్రత్యేక యాప్ రూపకల్పనకు అధ్యయనం
న‌ర్సింగ్ క‌ళాశాల‌ల్లో జ‌ప‌నీస్ (జ‌పాన్ భాష‌) ను ఒక ఆప్ష‌నల్‌గా నేర్పించాల‌ని, జ‌పాన్‌లో మ‌న న‌ర్సింగ్ సిబ్బందికి డిమాండ్ ఉంద‌ని సీఎం తెలిపారు. ఈ విష‌యంలో మ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు జ‌పాన్ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని వెల్ల‌డించారు. ఆసుప‌త్రుల‌కు వ‌చ్చే రోగులు, వారిని ప‌రీక్షించే వైద్యులు, ఆసుప‌త్రుల స‌మ‌యాల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ఒక యాప్‌ను వినియోగించే అంశంపై అధ్య‌య‌నం చేయాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. విద్యా, వైద్య రంగాలు ఎంతో కీల‌క‌మ‌ని, ప్ర‌తి నెలా మూడో వారంలో ఈ రెండు శాఖ‌ల‌పై స‌మీక్ష నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. స‌మీక్ష‌లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, ముఖ్య‌మంత్రి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వి.శేషాద్రి, ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శి మాణిక్ రాజ్‌, వైద్యారోగ్య శాఖ కార్య‌ద‌ర్శి క్రిస్టియానా జ‌డ్ చోంగ్తూ, వైద్యారోగ్య శాఖ డైరెక్ట‌రేట్ డాక్ట‌ర్ న‌రేంద‌ర్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Also Read This: Mahesh Goud on Srinivas: పొంగులేటి వర్సెస్ టీపీసీసీ చీఫ్.. మంత్రిపై మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు