Mulugu District News: ఆదివాసీల గుడిసెలపై అటవి పోలీసులు దాడి
Mulugu District News (imagecredit:swetcha)
Telangana News

Mulugu District News: ఆదివాసీల గుడిసెలను కూల్చేందుకు అటవి పోలీసులు ప్రయత్నం

Mulugu District News: భూమికోసం, భుక్తి కోసం ఏళ్ల తరబడి పోరాడాల్సిన దుస్థితి ఇప్పటికీ నెలకొంటుంది. ఎంతోమంది రాజకీయ పలుకుబడితో ప్రభుత్వ భూములపై కన్నేసి వాటిని వశం చేసుకునేదాకా వదలని ఈ రోజుల్లో ఆదివాసీలు నివాసం కోసం ఏర్పాటు చేసుకున్న భూములను అటవీశాఖ అధికారులు వేసుకున్న ఆవాసాలను కూల్చేసి స్వాధీనం చేసుకునే దుస్థితి నెలకొంది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రోహీర్ అటవిశాఖ పరిధిలో గత రెండేళ్ళుగా గుడిసేలు నిర్మించుకుని నివాసముంటున్న ఆదివాసీల గుడిసెలను జేసిబీ, డోజర్‌‌‌ల సహాయంతో తొలగిస్తున్న అటవీ, పోలీసు శాఖా అధికారులను కర్రలతో గిరిజనులు తరిమేశారు.

మనస్థాపానికి గురై ఉరి వేసుకున్న రైతు

మంత్రి సీతక్క నియోజక వర్గంలో రోజుకో చోట గిరిజనుల భూముల గొడవలు వెలుగోలోకి వస్తున్నాయి. గత వారం రోజుల క్రితం మండలంలోని రాయిబంధం గూడెంలో సోడి రమేష్ అనే రైతు భూమిలో మొక్కలు నాటాడినికి వెళ్ళిన అటవీశాఖ అధికారులను పోడు రైతు సోడి రమేష్ వేడుకొన్న అధికారులు వినకపోవడంతో మనస్థాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మరవక ముందే మరో చోట గిరిజనుల గుడిసెలను తొలగించే ప్రయత్నం చేశారు. ఇళ్ళు లేని నిరుపేద గిరిజనులు గత రెండేళ్ళుగా ఆవాసాలు ఏర్పాటు చేసుకుని నివాసముంటున్న రోహీర్ బీట్ పరిధిలోకి పోలీసు ప్రొటక్షన్‌తో అటవీశాఖా అధికారులు తమ సిబ్బందితో దాడులకు రావడాన్ని గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకించారు.

Also Read: Air India plane Crash: అంతులేని విషాదం.. 92 బాడీలు గుర్తింపు.. ఫ్యామిలీలకు అందజేత!

గొత్తికోయల మాదిరిగా

మేము గుంట, రెండు గుంటలలో నివాసానికి ఇళ్ళు ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రం కాని రాష్ట్రం చత్తీస్ఘాడ్ నుండి వలస వచ్చిన గొత్తికోయల మాదిరిగా ఎకరాలలో పోడు చేసుకోలేదని వారి మూలంగా ఓటు బ్యాంకింగ్ పెంచుకుంటున్నారా అని స్థానిక గిరిజనులు మంత్రి సీతక్కను ప్రశ్నిస్తున్నారు. మా ఇళ్ళ స్థలాల పై అటవీశాఖ అధికారుల దాడులను వెంటనే ఆపివేయాలని లేదంటే ఉధ్యమాలకు తెరలేపుతామని ఆదివాసీలు మండిపడుతున్నారు. మంత్రి సీతక్క మా గిరిజనుల పై దయ చూపి మా ఇళ్ళకు హక్కులు కల్పించాలని అక్కడి గిరిజనులు వేడుకుంటున్నారు.

Also Read: Director Maruthi: సాగదీయను.. ‘ది రాజా సాబ్’ పార్ట్ 2‌పై మారుతి కామెంట్స్

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క