Sobhita Dhulipala: అక్కినేని నాగార్జున ఇంట పెళ్లి బాజాలు మోగిన సంగతి తెలిసిందే. చిన్న కుమారుడు, టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని జూన్ 6న జైనబ్ రవ్జీని వివాహం చేసుకున్నాడు. పెళ్లి చాలా సింపుల్ గా నాగార్జున ఇంట్లోనే జరిగినప్పటికీ.. రిసెప్షన్ మాత్రం ఓ రేంజ్ లో జరిగిందని చెప్పవచ్చు. ఇండస్ట్రీకి చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటి శోభిత దూళిపాళ నెట్టింట ఆసక్తికర పోస్ట్ పెట్టింది. జూన్ ముచ్చట్లు పేర్లతో పెళ్లి ఫొటోలు షేర్ చేసింది. అలాగే ఓ సీక్రెట్ ను సైతం ఆమె పంచుకుంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
మామకు ఆత్మీయ ఆలింగనం
నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్యను నటి శోభిత రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరిది అఖిల్ పెళ్లి (Akhil Akkineni Wedding)లో భర్త చైతూతో కలిసి శోభిత ఎంతో సంతోషంగా గడిపారు. దగ్గరుండి తన మరిది పెళ్లి పనులను చూసుకున్నారు. అయితే తాజాగా శోభిత.. జూన్ లో జరిగిన ముచ్చట్లను ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో పెళ్లిలో ఎంతో అందంగా ముస్తాబైన ఫొటోలను షేర్ చేశారు. ఆరెంజ్ డ్రెస్ లో శోభిత ఉన్న ఫొటోలు అందరినీ ఫిదా చేస్తున్నాయి. బరాత్ కోసం ఏర్పాటు చేసిన డీజే ఫొటో, మామ నాగార్జునను ఎంతో ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోలు.. అక్కినేని ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. లేటుగా వచ్చిన లేటెస్ట్ గా నాగార్జున ఫ్యామిలీలోకి శోభిత అడుగుపెట్టారని.. అక్కినేని ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు.
సీక్రెల్ రివీల్ చేసిన శోభిత!
అఖిల్ పెళ్లి ఫొటోలతో పాటు శోభిత చేసిన మరో పోస్ట్ సైతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భారతత్వవేత్త, ప్రసంగకర్త అయిన జిడ్డు కృష్ణమూర్తి (Jiddu Krishnamurti) చెప్పిన మాటను ఆమె ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో పంచుకున్నారు. ‘నా సీక్రెట్ ఏంటో తెలుసా?.. ఎవరు ఏమి అనుకుంటున్నారు.. అసలేం జరుగుతుంది అని పట్టించుకోకపోవడమే’ అని కృష్ణమూర్తి చెప్పిన మాటలు ఆ పోస్ట్ లో ఉన్నాయి. అయితే దీని ద్వారా తన సీక్రెట్ ఇదేనంటూ శోభిత చెప్పకనే చెప్పిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో సామ్ ఫ్యాన్స్, ఆమె అంటే గిట్టని వారు చేసిన విమర్శలకు శోభిత పోస్ట్ చెంపపెట్టు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Indian-Origin Dies: ఆస్ట్రేలియా పోలీసుల దుర్మార్గం.. మెడపై మోకాలితో తొక్కి.. ఇండియన్ హత్య!
రెండేళ్ల సీక్రెట్ రిలేషన్
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తో విడాకులు అనంతరం నటి శోభితను నాగచైతన్య (Naga Chaithanya) వివాహం చేసుకున్నారు. గతేడాది ఆగస్టులో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. రెండేళ్ల సీక్రెట్ రిలేషన్ తర్వాత ఈ జంట కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక్కటయ్యింది. శోభిత సినిమాల విషయానికి వస్తే ఆమె.. 2016లో హిందీలో వచ్చిన ‘రామన్ రాఘవ్ 2.0’ చిత్రంతో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. అడవి శేష్ (Adivi Sesh) హీరోగా చేసిన ‘గూఢచారి’ (2018) తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత ‘మేజర్’, ‘పొన్నియన్ సెల్వన్ 1, 2’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. హాలీవుడ్ లో వచ్చిన ‘మంకీ మాన్’ చిత్రంలోనూ శోభిత నటించింది.