Ponguleti Srinivas Reddy( image credit: swetcha reporter)
తెలంగాణ

Ponguleti Srinivas Reddy: అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి హామీ!

Ponguleti Srinivas Reddy: మీ ఇంటి పెద్ద కొడుకు గా చెబుతున్నా.. ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేలాగా చేయడమే ధ్యేయంగా పనిచేస్తానని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) పేర్కొన్నారు. నేలకొండపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మంత్రి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) చేశారు. నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో అంతర్గత సీసీ రోడ్లకు, కోరట్లగూడెం, ముటాపురం గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా వివిధ పార్టీలకు చెందిన పలువురికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

 Also Read: RS Praveen Kumar: కేటీఆర్‌పై కక్షసాధింపు.. బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత ఏదీ?

పలుచోట్ల ఇందిరమ్మ ఇండ్ల (Indhiramma Homes) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి (Ponguleti Srinivas Reddy) మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో ఇచ్చిన హామీలు అనేకం అమలు చేసిందని…. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోయినా మిగిలిన హామీలను కూడా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు రాలేదని ఎవరూ బాధపడొద్దని …. విడతల వారీగా అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు (Indhiramma Homes) ఇప్పించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. దాదాపుగా ప్రతీ ఇంటికి ఏదో ఒక్క సంక్షేమ పథకం చేర్చడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాల్లో, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి , పలువురు జిల్లా, నియోజకవర్గ, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 Also Read: Government Aims: 540 నుంచి 5 వేలకు పైగా ప్రైమరీ స్కూళ్లకు విస్తరణ!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు