Politics

RS Praveen Kumar: కేటీఆర్‌పై కక్షసాధింపు.. బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత ఏదీ?

RS Praveen Kumar: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై(KTR) అక్రమ కేసులు బనాయిస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) తీవ్ర స్థాయిలో ఆరోపించారు.  తెలంగాణ భవన్‌లో బీసీ కమిషన్ మాజీ సభ్యులు కే కిశోర్ గౌడ్, (Kishor Goud)  సీహెచ్ ఉపేంద్రతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేస్తున్న కేటీఆర్‌ను అణచివేయడానికే రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్‌పై నమోదైన ఫార్ములా ఈ కార్ రేస్ కేసును ప్రవీణ్ కుమార్ తప్పుబట్టారు. “ఒకే అంశంపై కేటీఆర్‌పై రెండు ఎఫ్‌ఐ‌ఆర్‌లు పెట్టారు. ఇది ఏ రూల్ బుక్‌లో ఉంది? నా 26 ఏళ్ల పోలీసు సర్వీసులో ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదు” అని అన్నారు.

 Also Read: Medchal District Corruption: మేడ్చల్‌‌లో అనిశాకు పట్టుబడిన మారని ఉద్యోగుల తీరు

ఫార్ములా ఈకారు రేస్ లో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా కేటీఆర్ ఫార్ములా ఈ కారు రేస్ ను తీసుకువచ్చారన్నారు. నగరానికి పెట్టుబడులు కోసమేఫార్ములా ఈ రేస్ నిర్వహణ జరిగిందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచేందుకు మొబిలిటీ వ్యాలీ తెచ్చారన్నారు. హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి ఫార్ములా ఈ రేస్ సంస్థ అకౌంట్ కు డబ్బు పంపించారని, ఇది పూర్తి చట్టబద్ధంగా జరిగిందన్నారు. బీఆర్ఎస్ (BRS) నేతలపై పెట్టే కేసుల ఎఫ్ ఐ ఆర్ లు గాంధీ భవన్ లో రెడీ అవుతున్నాయని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించలేదు 

ఫార్ములా ఈ కార్ రేస్ పై అసెంబ్లీలో చర్చ ఎందుకు పెట్టలేదు రేవంత్ రెడ్డి (Revanth Reddy) అని ప్రశ్నించారు. కేటీఆర్( KTR) లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్దం అంటే ఎందుకు స్పందించలేదు రేవంత్ రెడ్డి (Revanrh Reddy) అని నిలదీశారు. ఫార్ములా ఈ కార్ రేస్ లో అసలు నిందితుడు రేవంత్ రెడ్డి అని కేసు పెట్టాను అని, కానీ నాకు తెలియకుండానే పోలీసులు కేసును క్లోజ్ చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకో న్యాయం చట్టంలో ఉందా? అని విమర్శించారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే లై డిక్టేటర్ టెస్ట్ కు,బహిరంగ విచారణకు రావాలని డిమాండ్ చేశారు. ఫార్ములా ఈ రేసు వ్యవహారం లో కేటీఆర్‌పై పెట్టిన కేసు పై న్యాయస్థానాలను తప్పకుండా ఆశ్రయిస్తామని వెల్లడించారు.

Also Read: Ponguleti Srinivas Reddy: నిర్దేశించిన గడువులోగా భూ స‌మ‌స్యల ప‌రిష్కారం!

బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత ఏదీ? మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తున్నదని, బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించడంలో విఫలమైందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud)  ఆరోపించారు తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, (Jaipal Yadav) బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిశోర్ గౌడ్, (Kishor Goud)  ఉపేంద్రచారితో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, మంత్రివర్గ కూర్పులో ఎందుకు పాటించలేదు? బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత ఏది?” అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

కులగణనను గొప్పగా చేశామని, దేశానికి రోల్ మోడల్ అంటున్నారని, కానీ కాంగ్రెస్ ఎన్నికల్లో చెప్పిందేమిటి, చేసిందేమిటి అని ప్రశ్నించారు. కులగణన తప్పుల తడకగా జరిగిందని, అరవై శాతం జనాభా ఉన్న బీసీలకు మూడేనా మంత్రి పదవులని నిలదీశారు.

 Also Read: KTR: నేడు ఏసీబీ ఎదుటకు కేటీఆర్.. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ!

Just In

01

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!