Chaitu and Samantha: చైతూ, సమంత మళ్లీ కలవబోతున్నారా?
Chaitu and Sam
ఎంటర్‌టైన్‌మెంట్

Chaitu and Samantha: నాగ చైతన్య, సమంత మళ్లీ కలవబోతున్నారా?

Chaitu and Samantha: అక్కినేని యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya), సమంత (Samantha) మళ్లీ కలవబోతున్నారా? అంటే అవుననే సంకేతాలే వినబడుతున్నాయి. అయితే కలవడం అంటే మళ్లీ కలిసి జీవించడం కాదు. అలాంటి రోజు మళ్లీ వస్తుందని అనుకోలేం. ఎందుకంటే, ఇద్దరూ ఇష్ట పూర్వకంగానే విడిపోయారు. వారిద్దరూ విడాకులు తీసుకుని ఎవరి జీవితం వారు అనుభవిస్తున్నారు. రీసెంట్‌గానే నాగ చైతన్య మరో వివాహం కూడా చేసుకున్నారు. నటి శోభితా ధూళిపాలను రెండో వివాహం చేసుకున్న నాగ చైతన్య ప్రస్తుతం హ్యాపీగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మరో వైపు సమంత కూడా రెండో వివాహం చేసుకోబోతున్నట్లుగా ఈ మధ్య వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌ దర్శకులలోని ఒకరితో ఆమె ప్రస్తుతం రిలేషన్‌లో ఉందని, త్వరలోనే పెళ్లి కూడా ఉండొచ్చనేలా టాక్ వైరల్ అవుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు చైతూ, సమంత మళ్లీ కలవబోతున్నారనేలా వార్తలు రావడం.. ‘ఇదేందయ్యా ఇది’ అనేలా కాస్త ఆశ్చర్యాన్ని కలిగించేవే.

Also Read- Kuberaa Trailer: ఒక బెగ్గర్ గవర్నమెంట్‌నే రిస్క్‌లో పెడితే..! శేఖర్ కమ్ముల కొట్టేస్తున్నాడు.. నో డౌట్!

అసలు విషయంలోకి వస్తే.. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కొత్త సినిమాల హడావుడి కంటే.. రీ రిలీజ్‌లే హంగామా చేస్తున్నాయి. ఈ రీ రిలీజ్ ట్రెండ్‌లోకి చైతూ, సమంతలని ఒక్కటి చేసిన చిత్రం కూడా వచ్చేసింది. అవును, వారిద్దరూ కలిసి గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేసిన ‘ఏ మాయ చేసావె’ మూవీ రీ రిలీజ్‌‌కు సిద్ధమైంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమాను జూలై 18న రీ రిలీజ్ చేసేందుకు రెడీ చేస్తున్నారు. ఇక రీ రిలీజ్‌లకు కూడా ఈ మధ్య ప్రమోషన్స్‌ని నిర్వహిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ‘అందాల రాక్షసి’ చిత్రానికి అందులో నటించిన హీరోలు, హీరోయిన్ వరస బెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చారు. ఇప్పుడలాంటి ప్రమోషన్సే ‘ఏ మాయ చేసావె’ చిత్రానికి కూడా చేయాల్సి వస్తే.. కచ్చితంగా చైతూ-సామ్ ఇద్దరూ మళ్లీ కలుసుకోవడం అంతా చూడొచ్చు.

Also Read- OTT Rush: ఓటీటీలోకి 32 సినిమాలొస్తే.. అందులో 11 తెలుగు సినిమాలే!

నిజంగా అలాంటి సందర్భమే వస్తే మాత్రం ఇద్దరి అభిమానులకు పండగే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, వారిద్దరూ విడిపోవడం ఇప్పటికీ కొంత మందికి నచ్చడం లేదు. ఇప్పుడు రీ రిలీజ్‌కు రెడీ అవుతున్న సినిమా.. ఒరిజినల్‌గా విడుదలైనప్పుడే వారిద్దరూ ప్రేమలో పడ్డారనే విషయాన్ని స్వయంగా వారే రివీల్ చేశారు. ఇప్పుడా సినిమా మళ్లీ థియేటర్లలోకి వస్తుంది. అప్పటి జ్ఞాపకాలు ఏ మాత్రం గుర్తొచ్చినా.. ఇద్దరూ బాధపడే అవకాశం లేకపోలేదు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఏమిటనేది ఇప్పటి వరకు తెలియరాలేదు. అంతగా ప్రేమించుకున్న వాళ్లు విడిపోయారంటే.. ఏదో బలమైన కారణమే ఉందనేలా టాక్ అయితే ఇంకా నడుస్తూనే ఉంది. మరి ఇలాంటి సందర్భంలో వీరిద్దరూ.. సినిమా ప్రమోషన్స్ నిమిత్తం మళ్లీ కలిస్తే.. ఎలా ఒకరినొకరు ఫేస్ చేస్తారనేది చూడటానికి టాలీవుడ్ మొత్తం వేచి చూస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!